అక్షాంశ రేఖాంశాలు: 21°56′N 86°43′E / 21.94°N 86.72°E / 21.94; 86.72

బారిపడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బారిపడా
పట్టణం
బారిపడా is located in Odisha
బారిపడా
బారిపడా
Coordinates: 21°56′N 86°43′E / 21.94°N 86.72°E / 21.94; 86.72
దేశంభారతదేశం
రాష్ట్రం ఒడిశా
జిల్లామయూర్‌భంజ్
Government
 • BodyBaripada Municipality
Elevation
36 మీ (118 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,16,874
 • RankIndia 446th, Odisha 8th
భాషలు
 • అధికారికఒరియా[2]
Time zoneUTC+5:30 (IST)
PIN
757 0xx
Telephone code06792-25xxxx/ 06792-26xxxx
Vehicle registrationOD-11

బారిపడా, ఒడిషా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న పట్టణం. బుధబలంగా నది తూర్పు ఒడ్డున ఉన్న బారిపడా ఉత్తర ఒడిషా ప్రాంతపు సాంస్కృతిక కేంద్రం. ఇటీవలి సంవత్సరాలలో, ఇక్కడ అనేక వృత్తిపరమైన కళాశాలలను ప్రారంభించడంతో ఇది విద్యా కేంద్రంగా ఉద్భవించింది.[3][4] పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

ఈ పట్టణం మయూర్‌భంజ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం. వైశాల్యం ప్రకారం ఒడిషాలో ఇది అతిపెద్ద జిల్లా. పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా, సెషన్స్ కోర్టులూ ఉన్నాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభ లోని బారిపడా విధాన సభ నియోజకవర్గ కేంద్రం ఇక్కడే ఉంది.[3][5]

భౌగోళికం

[మార్చు]

బారిపడా 21°56′N 86°43′E / 21.94°N 86.72°E / 21.94; 86.72 వద్ద,[6] సముద్రమట్టం నుండి సగటున 36 మీటర్ల ఎత్తున ఉంది. పట్టణం బుధబలంగా నది ఒడ్డున ఉంది.

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Baripada, Odisha (1981–2010, extremes 1955–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.7
(94.5)
39.9
(103.8)
42.4
(108.3)
46.0
(114.8)
48.3
(118.9)
47.8
(118.0)
40.6
(105.1)
36.6
(97.9)
39.6
(103.3)
37.4
(99.3)
36.1
(97.0)
32.7
(90.9)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 26.5
(79.7)
30.1
(86.2)
34.9
(94.8)
37.8
(100.0)
37.4
(99.3)
34.9
(94.8)
32.5
(90.5)
32.0
(89.6)
32.4
(90.3)
31.7
(89.1)
29.4
(84.9)
26.8
(80.2)
32.2
(90.0)
సగటు అల్ప °C (°F) 12.7
(54.9)
16.2
(61.2)
20.5
(68.9)
24.1
(75.4)
25.4
(77.7)
25.9
(78.6)
25.5
(77.9)
25.4
(77.7)
24.8
(76.6)
22.1
(71.8)
17.3
(63.1)
12.6
(54.7)
21.1
(70.0)
అత్యల్ప రికార్డు °C (°F) 5.0
(41.0)
6.8
(44.2)
11.6
(52.9)
15.2
(59.4)
17.5
(63.5)
18.9
(66.0)
20.0
(68.0)
20.4
(68.7)
18.5
(65.3)
14.6
(58.3)
10.1
(50.2)
5.0
(41.0)
5.0
(41.0)
సగటు వర్షపాతం mm (inches) 14.2
(0.56)
23.2
(0.91)
39.2
(1.54)
63.9
(2.52)
126.7
(4.99)
274.9
(10.82)
322.7
(12.70)
355.7
(14.00)
282.8
(11.13)
145.1
(5.71)
21.3
(0.84)
7.3
(0.29)
1,677.1
(66.03)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.8 2.8 4.6 6.8 11.7 16.0 16.6 12.8 5.9 1.4 0.7 82.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 62 58 55 59 66 77 85 87 85 77 67 62 70
Source: India Meteorological Department[7][8]

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బారిపడా జనాభా 1,10,058. అందులో 57,008 మంది పురుషులు, 53,050 మంది మహిళలు. పట్టణ సముదాయం జనాభా 1,16,874 లో 60,535 పురుషులు, 56,339 మంది స్త్రీలు.[9] మునిసిపాలిటీలో 1,000 మంది పురుషులకు 931 స్త్రీలు లింగ నిష్పత్తి ఉంది. జనాభాలో 9% మంది ఆరేళ్లలోపు వారు. వయోజనుల్లో అక్షరాస్యత 89.31%; పురుషుల అక్షరాస్యత 93.45%, స్త్రీల అక్షరాస్యత 84.88%.

2011 లో అక్షరాస్యత

[మార్చు]

బారిపడా నగరంలో మొత్తం అక్షరాస్యులు 89,421. వీరిలో 48,388 మంది పురుషులు కాగా, 41,033 మంది మహిళలు. బారిపడా నగరం సగటు అక్షరాస్యత 89.31 శాతం, ఇందులో పురుషుల అక్షరాస్యత 93.45% కాగా, స్త్రీల అక్షరాస్యత 84.88%.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

బారిపడా రైల్వే స్టేషన్ ఒడిశాలోని తొలి స్టేషన్లలో ఒకటి. మయూర్‌భంజ్ పాలకుడు, మహారాజా కృష్ణ చంద్ర భంజ్‌దేవ్, బారిపడాను హౌరా-చెన్నై రైల్వే కారిడార్‌కు నారో-గేజ్ రైలు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించాడు. దీనిని మయూర్‌భంజ్ స్టేట్ రైల్వే అనేవారు. ఒడిశాలో బ్రిటిష్ రాజ్ కాలంలో మొట్టమొదటి విమానాశ్రయాలను రాజాబాసా (నగరం నుండి 16 కి.మీ.), రాస్‌గోవింద్‌పూర్ (నగరం నుండి 60  కి.మీ.) లలో నిర్మించారు. వీటిని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారు.

ఇప్పుడు దాని స్థానంలో బ్రాడ్ గేజ్ రైలు మార్గం ఏర్పడింది. ప్రస్తుతానికి, ఒక బారిపడా - రూప్సా - బాలాసోర్ ల మధ్య ఒకటి, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ నడుస్తాయి. బారిపడా నుండి పూరికి నేరుగా నడిచే వారపు రైలు కూడా ఉంది. బరిపాడ నుంచి కోల్‌కతాకు రైలు నడుస్తోంది. నగరం శివార్లలో భంజ్‌పూర్ రైల్వే స్టేషన్ పేరుతో మరొక రైల్వే స్టేషను ఉంది.

రోడ్డు రవాణాకు సంబంధించి, లగ్జరీ A/C బస్సులు నగరాల మధ్య ప్రసిద్ధ రవాణా సాధనాలు. ఇక్కడి నుండి భువనేశ్వర్, పూరి, సంబల్పూర్, ఝర్సుగూడ, రూర్కెలా, కియోంజర్, బాలాసోర్, అంగుల్, బోలంగీర్, భద్రక్, కటక్, జంషెడ్పూర్, ఖరగ్పూర్, రాంచీ, కోల్‌కతాలకు రోడ్డు సౌకర్యం ఉంది. నగరం, చెన్నై వెళ్ళే NH 5 (ప్రస్తుతం NH 18) ప్రారంభ స్థానం నుండి 3 కి.మీ దూరంలో ఉంది.

చదువు

[మార్చు]

బారిపడా లోని [10] తాకత్‌పూర్‌లో నార్త్ ఒరిస్సా విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ మహారాజా పూర్ణ చంద్ర జూనియర్ కళాశాల ఉంది. ఇక్కడ 2000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్ లలో ఉన్నత మాధ్యమిక విద్య అభ్యసిస్తారు. పట్టణాంలో MPC అటానమస్ కళాశాల ఉంది. ఇది వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యావేత్తలను అందిస్తుంది. పూర్వపు మయూర్‌భంజ్ ప్యాలెస్‌లో మహారాజా పూర్ణ చంద్ర జూనియర్ కళాశాల, సుమారు 500 మంది విద్యార్థినులతో ప్రభుత్వ మహిళా కళాశాల ఉన్నాయి.[11]

BPUTకి అనుబంధంగా, సీమంత ఇంజినీరింగ్ కాలేజ్ అనే ఇంజనీరింగ్ కళాశాల జార్పోఖారియా సమీపంలో ఉంది. ఇది బారిపడా నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. మయూర్‌భంజ్ న్యాయ కళాశాల (1978లో స్థాపించబడింది), B.Ed. కళాశాల, ఆయుర్వేద కళాశాల, హోమియోపతి కళాశాలలు బారిపడాలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  2. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 5 January 2019.
  3. 3.0 3.1 "Odisha Tourism : Baripada". odishatourism.gov.in. Retrieved 2020-06-08. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Welcome To North Orissa University". www.nou.nic.in. Retrieved 2020-06-08.
  5. "About District | Mayurbhanj District, Government of Odisha | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 8 June 2020.
  6. "Maps, Weather, and Airports for Baripada, India". www.fallingrain.com. Retrieved 20 September 2020.
  7. "Station: Baripada Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 105–106. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  8. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M160. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 10 January 2021.
  9. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  10. "Odisha Tourism : Baripada". odishatourism.gov.in. Retrieved 4 June 2020.
  11. "Mayurbhanj palace wallows in royal neglect". The Times of India. 29 October 2011. Archived from the original on 14 December 2013. Retrieved 15 January 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=బారిపడా&oldid=3990297" నుండి వెలికితీశారు