Jump to content

కేంద్రపడా

వికీపీడియా నుండి
కేంద్రపడా
କେନ୍ଦ୍ରାପଡ଼ା
తులసీ క్షేత్రం[1]
—  పట్టణం  —
కేంద్రపడా is located in Odisha
కేంద్రపడా
కేంద్రపడా
ఒడిశా పటంలో పట్టణ స్థానం
దేశం  India
రాష్ట్రం ఒడిశా
జిల్లా కేంద్రపడా
Area rank 29
జనాభా (2001)
 - మొత్తం 41,404
భాషలు
 - అధికారిక ఒరియా
Time zone IST (UTC+5:30)
PIN 754211
Telephone code 6727[2]
Vehicle registration OD 29

కేంద్రపడా ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపడా జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు రాజధాని. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. దీనిని తులసీ క్షేత్రం అని కూడా అంటారు.[3]

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

కేంద్రపడా 20°30′N 86°25′E / 20.50°N 86.42°E / 20.50; 86.42 వద్ద [4] సముద్రమట్టం నుండి 13 మీ. ఎత్తున ఉంది.

చిత్రోప్తలా నది ( మహానది యొక్క శాఖ) కేంద్రపడా జిల్లా గుండా ప్రవహిస్తుంది. కేంద్రపడాలోని ఇతర నదులలో లూనా, కరాండియా, గోబారి, బ్రహ్మణి, బిరుపా, కని, హన్సువా, బైతరణి, ఖరస్రోత, పైకా ఉన్నాయి. ఈ జిల్లాలో 9 బ్లాక్‌లు ఉన్నాయి, అవి ఔల్, డెరాబిష్, గరద్‌పూర్, మహాకలపద, మార్షఘై, కేంద్రపర, రాజానగర్, రాజ్‌కనికా, పట్టముండై ఉన్నాయి.

రవాణా

[మార్చు]

జగత్‌పూర్ - సాలిపూర్ రాష్ట్ర రహదారి SH9A లేదా జాతీయ రహదారులు నెం.16, 53 ద్వారా కేంద్రపడా చేరుకోవచ్చు. జాతీయ రహదారి 16, రాష్ట్ర రహదారి 9Aలో భువనేశ్వర్ విమానాశ్రయం నుండి రెండున్నర గంటల ప్రయాణంలో కేంద్రపడా ఉంది. సమీప రైల్వే స్టేషను రాష్ట్ర రహదారి 9Aలో కేంద్రపడా పట్టణం నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌లో ఉంది.

విద్య

[మార్చు]

కేంద్రపడాలో అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. కేంద్రపడా పట్టణంలో ఉన్న కేంద్రపడా అటానమస్ కళాశాల జిల్లాలోనే అతిపెద్ద ఉన్నత విద్యా కళాశాల. ఇతర సంస్థలలో పట్టముండై కళాశాల, రాజ్‌కనికాలోని శైలేంద్ర నారాయణ్ కళాశాల, కేంద్రపడా ఉన్నత పాఠశాల (జిల్లాలోని అతి పురాతన ఉన్నత పాఠశాల, 1863లో స్థాపించబడింది) ఉన్నాయి. 1918 సంవత్సరంలో స్థాపించబడిన, జిల్లాలో రెండవ పురాతన ఉన్నత పాఠశాల RN హై స్కూల్ కూడా పట్టణాంలో ఉంది.[5]

మూలాలు

[మార్చు]
  1. "KSHETRA". Report Odisha. Archived from the original on 2017-09-28. Retrieved 2015-11-25.
  2. "STD Codes for indian cities, Search Telephone area phone Dialing codes".
  3. "KSHETRA". Report Odisha. Archived from the original on 2017-09-28. Retrieved 2015-11-25.
  4. Falling Rain Genomics, Inc – Kendrapara
  5. http://kendrapadahes.org/