కోరియా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరియా జిల్లా

कोरिया जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో కోరియా జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో కోరియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంకోరియా
మండలాలు5
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం6,604 కి.మీ2 (2,550 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం6,58,917
 • సాంద్రత100/కి.మీ2 (260/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత71.41
 • లింగ నిష్పత్తి971
ప్రధాన రహదార్లు1
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 27 జిల్లాలలో కోరియా జిల్లా ఒకటి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ జిల్లా వాయవ్యంలో ఉంది. జిల్లా కేంద్రంగా బైకుంటపూర్ ఉంది.

చరిత్ర[మార్చు]

16వ శతాబ్దం నుండి ఈ ప్రాంతం ఉనికిలో ఉంది. బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియాలో కోరియా రాజాస్థానంగా ఉంది. కోరియా జిల్లా ప్రాంతంలో ఉన్న మరొక రాజాస్థానం చంగ్‌భకర్. 1947 ఇండియాకు స్వతంత్రం వచ్చిన తరువాత కోరియా, చంగ్‌భకర్ పాలకులు 1948 జనవరి 1 నుండి సమైక్యభారతంలో మిశ్రితం కావడానికి అంగీకరించారు. తరువాత ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో భాగం అయ్యాయి. 1998 మే 25 నుండి కోరియా జిల్లా ఉనికిలోకి వచ్చింది. సుర్గుజా జిల్లాలో కొంతభాగం వేరుచేసి ఈ జిల్లాను రూపొందించారు. 2000 జనవరి 1 న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాగం అయింది. ప్రస్తుతం ఇది " రెడ్ కార్పెట్ "లో భాగం అయింది. [1]

భౌగోళికం[మార్చు]

కోరియా జిల్లా 22°56′ , 23°48′ డిగ్రీల ఉత్తర అక్షాంశంలో , 81°56′ , 82°47′ డిగ్రీల తూర్పు రేఖంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ది, దక్షిణ సరిహద్దులో బిలాస్‌పూర్, , కోర్బా, తూర్పు సరిహద్దులో సుర్గుజా , పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 5977. జిల్లాలో 59.9% అరణ్యప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో విస్తారంగా కొండప్రాంతాలు ఉన్నాయి. దిగువన ఉన్న మైదానభూములు సముద్రమట్టానికి 550 మీ ఎత్తు ఉంది. సోనాహత్ పీఠభూమి ఎత్తు 755 మీ. జిల్లాలో ఎత్తైన 1027 మీ ఎత్తైన శిఖరం దేవ్‌గర్ శిఖరం. వాతావరణం మైల్డ్‌గా ఉటుంది. మితమైన వర్షం, తక్కువ ఉష్ణోగ్రత కలిగిన వేసవి భరించగలిగిన చలితో శీతాకాలాలు ఉంటాయి.

విభాగాలు[మార్చు]

కోరియా జిల్లా 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.: బైకుంటపూర్, భరత్పూర్, చిర్మిరి, మానేంద్రగర్ , సోనాగర్. 5 తాలూకాలు , 5 బ్లాకులు ఉన్నాయి: భరత్పూర్, ఖద్గవన్, మనేంద్రగర్ , సోనాహత్ , చిర్మిరి ముంసిపల్ కార్పొరేషన్. జిల్లాలో 653 గ్రామాలు, 5 జనపద్, 236 గ్రామపంచాయితీలు, 2 నగర పంచాయితీలు, 3 పురపాలకాలు ఉన్నాయి..[2]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 659,039, [3]
ఇది దాదాపు. మోంటెన్ గ్రో దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 510వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 100 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.4%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 971:1000[3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.41%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

గణాంకాలు[మార్చు]

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జనసంఖ్య 586,327
నగరీకరణ శాతం
పురుషుల సంఖ్య 51.38%
స్త్రీలసంఖ్య 48.62%
గ్రామీణ ప్రజలు 70.2%
నగర ప్రజలు 29.8%
షెడ్యూల్డ్ కులాలు 8.2%
షెడ్యూల్డ్ తెగలు 44.4%
స్త్రీ పురుష నిష్పత్తి
జాతీయ సరాసరి 928 కంటే
అక్షరాస్యతా శాతం 63.1%
పురుషుల అక్షరాస్యతా శాతం 75.7%
స్త్రీల అక్షరాస్యతా శాతం 49.7%.
6 సంవత్సరాలకు లోబడిన బాలబాలికల సంఖ్య
6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య
, బాలికల సంఖ్య
వెనుకబడిన తరగతి ప్రజల సంఖ్య,
వెనుకబడిన జాతుల ప్రజల సంఖ్య
జిల్లాలో నివసిస్తున్న మొత్తం కుటుంబాలు

కోరియా ప్రాంత పూర్వీకప్రజలలో కోల్, గోండి, భూయింహర్లు (పాండో) ప్రజలు ప్రధానంగా ఉన్నారు. కోరియా జిల్లాకు నిరంతరంగా వలసలు జరుగుతూనే ఉన్నాయి. వలస ప్రజలలో చెవర, రాజ్వార్లు, సాహ్, అహిర్, గ్వాలాస్, ఒరయోన్, గడారియా, కోయిర్, బర్గాహ్, బశోధ్స్, ముస్లిములు, కహరాస్, కుంబి, కెవాత్లు, గుప్తాలు, జైస్వల్, షెడ్యూల్ కులాలు, అగర్వాల్, పనిక ప్రజలు అధికం.

భాషలు[మార్చు]

జిల్లాలో కోరియా భాష వాడుకలో ఉంది. బెంగాలీ,, హిందీ మాట్లాడే ప్రజలు 72.91% ఉన్నారు.[6] (compared to 60% for German and English) [7] బగేల్ ఖండ్‌లో 7-8 లక్షలమంది మాట్లాడుతుంటారు.[6]

సస్కృతి[మార్చు]

కోరియా జిల్లాలో కర్మా, సలియా, సుగ సంప్రదాయ నృత్యాలు వైద్యమైన పండుగ సందర్భాలలో ప్రదర్శినబడుతుంటాయి. దీపావళి, దసరా, హోళీ సందర్భాలలో ఈ నృత్యాలు ప్రదర్శించబడుతూ ఉంటాయి. గంగా దసరా, చర్తా, నవఖై, సుర్హుల్ వంటి పండుగలు కూడా జిల్లాలలో ఆచరించబడుతున్న ఇతర పండుగలో ముఖ్యమైనవి.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలు.

 • గురుఘసిదాస్ నేషనల్ పార్క్.
 • అమ్రిత్‌ధారా జలపాతం.
 • రాందహ జలపాతం.
 • గురుఘాట్ జలపాతం.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 2. http://korea.gov.in/
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 11 (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741 {{cite web}}: line feed character in |quote= at position 8 (help)
 6. 6.0 6.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)
 7. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)

వెలుపలి లింకులు[మార్చు]

 • [1] List of places in Korea

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]