బిలాస్‌పూర్ జిల్లా
Bilaspur జిల్లా बिलासपुर जिला | |
---|---|
![]() ఛత్తీస్‌గఢ్ పటంలో Bilaspur జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | Bilaspur, Chhattisgarh |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,272 కి.మీ2 (3,194 చ. మై) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 26,63,629 |
• సాంద్రత | 320/కి.మీ2 (830/చ. మై.) |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో బిలాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బిలాస్‌పూర్ పట్టణం ఉంది. 2011 గణాంకాల ప్రకారం బిలాస్‌పూర్ జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో 3 వస్థానంలో ఉందని గుర్తించబడింది. మొదటి 2 స్థానాలలో రాయ్‌పూర్, దుర్గ్ జిల్లాలు ఉన్నాయి. [1]
పేరు వెనుక చరిత్ర[మార్చు]
జిల్లా కేంద్రం భిలాస్‌పూర్ అనే పేరుకు మూలం భిలాస అనేది ఒక మత్స్యవనిత . ఆమె పేరుతో బిలాస్‌పూర్ స్థాపించబడిందని పురాణ కథనాలు వివరిస్తున్నయి.పృస్తుతం ఇది బిలాస్పూర్ గా పిలివబడుతుంది.
చరిత్ర[మార్చు]
బిలాస్‌పూర్ జిల్లా ప్రాంతం 1818 నాగ్పూర్ సామ్రాజ్యానికి చెందిన భొంసల రాజుల ఆధీనంలో ఉండేది. తరువాత మరాఠీ గవర్నర్ సుభాహ్ ఆధీనంలో ఉండేది. 1818 నుండి బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని 3వ రఘూజీ పాలించాడు. 1853లో 3వ రఘూజీ మరణం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ నాగపూర్ భూభాగంలో కలిపివేయబడింది.అందులో బిలాస్‌పూర్ ప్రత్యేక జిల్లాగా ఉండేది.[2] 1903లో సరికొత్తగా " ది సెంట్రల్ ప్రొవింస్ , బేరర్ " స్థాపించబడి అందులో చత్తీస్గఢ్ విభాగంలో బిలాస్‌పూర్ చేర్చబడింది. 1905లో బెంగాల్ ప్రొవింస్‌కు సంబల్ జిల్లాను తరలించి చంద్రపూర్, పద్మపూర్, మాల్‌ఖుద్ర రాజాస్థానాలను బిలాస్‌పూర్‌కు తరలించారు.1906లో దుర్గ్ జిల్లా రఒందించబడి ముంగెలి తాలూకా అందులో చేర్చబడింది. జిల్లాలోని ఇతర ప్రాంతాన్ని రాయ్‌పూర్ జిల్లాకు తరలించారు.[3] 1998 మే మాసంలో ప్రస్తుత బిలాస్‌పూర్ జిల్లా 3 చిన్న జిల్లాలుగా (బిలాస్‌పూర్, కోర్బా, జాంజ్‌గిర్ - చంపా జిల్లా లుగా విభజించబడింది. 2012లో జిల్లాలోని అధ్వానస్థితిలోఉన్న రహదార్లు, ఇతర మౌలిక వసతులను సరిచేయడానికి కొందరు యువకులు " కంసర్న్ 4 బిలాస్‌పూర్ " ఏర్పరచి నగరంలోని ప్రతి పౌరుడు పరిస్థితిని గ్రహించి అందుకు అవసరమైన పరిష్కారం కొరకు ఆలోచించేలా చేసింది.
భౌగోళికం[మార్చు]
బిలాస్‌పూర్ జిల్లా 21º47', 23º8' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 81º14', 83º15' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో లోరియా, రాష్ట్రంలోని, పశ్చిమ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరీ, అనుప్పూర్, వాయవ్య సరిహద్దులో కబీర్‌ధామ్ జిల్లా , దక్షిణ సరిహద్దులో దుర్గ్, రాయ్‌పూర్, తూర్పు సరిహద్దులో కోర్బా, జనిగిర్-చంపా జిల్లా జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 6377చ.కి.మీ. బిలాస్‌పూర్ జిల్లా రాష్ట్రానికి సాంస్కృతిక కేంద్రంగా భావించబడుతుంది. జిల్లాలో వివిధ సాంఘిక, సాంస్కృతిక కార్యాక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. జిల్లాలో అపోలో హాస్పిటల్ వంటి అంతర్జాతీయ హాస్పిటల్స్ ఉన్నాయి. జిల్లా రాష్ట్రానికి వైద్యకేంద్రంగా ఉంది. గత దశాబ్ధంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో చక్కని అభివృద్ధి కొనసాగింది. జిల్లాలో డి.ఎ.వి పబ్లిక్ స్కూల్, డిపిఎస్, ఎస్.టి, క్సేవియర్స్ వంటి అనర్జాతీయ స్థాయి స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకారణంగా జిల్లాలో మౌలిక సదుపాయాలు చక్కాగా అభివృద్ధిచేయబడ్డాయి.
ఆర్ధికం[మార్చు]
బిలాస్‌పూర్ కోయిల్ ఇండియాలో అతిపెద్దది, అత్యంత లాభదాయకమైన శాఖ అయిన " సౌత్ ఈస్టర్న్ కోయిల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ " ప్రధాన కార్యాలయ కేంద్రం.[citation needed] బిలాస్పూర్ జిల్లాలో లఫార్జ్, సెంచురీ, ఎ.సి.సి, మొదలైన పలు విద్యాసంస్థలు ఉన్నాయి. " ది బిలాస్‌పూర్ రైల్వే జోన్ " మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నుండి అధిక లాభదాయకమైన రైల్వేగా గుర్తింపు పొందుతూ అవార్డ్‌ను అందుకుంది.
బిలాస్‌పూర్ జిల్లా మిగిలిన దేశంతో రైలు, రహదారి మార్గాల ద్వారా చక్కగా అనుసంధానితమై ఉంది. రైలు, రహదారి మార్గాలు జిల్లాను చక్కాగా ఆర్థికంగా అభివృద్ధిచేసాయి. జిల్లాలో వ్యాపార్ విహార్, టెలిపరా, లింక్ రోడ్, సెపాత్ రోడ్, బస్ స్టాండ్ రోడ్, రాజీవ్ ప్లాజా, గోయల్ బజార్ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. జిల్లాలో చీఫ్ ఇంజినీర్ ఆద్జ్వర్యంలో పనిచేసే స్టేట్ ఎలెక్ట్రిసిటీ బోర్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఉంది.చీఫ్ ఇంజనీర్‌కు బిలాస్‌పూర్, కోర్బా, జనిగిర్-చంపా జిల్లా, రాజ్‌గఢ్ జిల్లాలకు విద్యుత్తును అందించే అధికారం ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అధికారిక విద్యుత్తు సరఫరా కేద్రాలలో బిలాస్‌పూర్ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో " రీజనల్ హెడ్క్వార్టర్స్ ఆఫ్ రాయ్‌పూర్" ఉంఫి.
విభాగాలు[మార్చు]
బిలాస్‌పూర్ జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి: బిలాస్‌పూర్, గౌరెల్లా, లోర్మి, కోట, ముంగెలి, తాకత్పూర్, బిహ, మద్తూరి. జిల్లాలో మొత్తం 1635 గ్రామాలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వైశాల్యంలో రెండవ స్థానంలో ఉన్న బిలాస్‌పూర్ జిల్లాలో రాష్ట్ర హైకోర్ట్ కూడా ఉంది. ఈ కారణంగా బిలాస్‌పూర్ ఛత్తీస్‌గఢ్ " న్యాయధాని "గా గుర్తించబడుతుంది. బిలాస్‌పూర్‌లో కానన్ పెండరి జూ పార్క్ ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న అర్ప నది లోతులో తక్కువైనా వర్షాకాలంలో వరదలకు కారణం ఔతుంది.
ప్రయాణవసతులు[మార్చు]
బిలాస్‌పూర్‌లో " సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే " జోనల్ ఆఫీస్ ఉంది. ఇండియన్ రైల్వే 16వ జోన్‌గా ఇది అత్యధిక లోడింగ్ చేసినందుకు గుర్తింపు పొందింది. ఈ నగరం ముంబై - కొలకత్తా రైలు మార్గంలో ఉంది. రాష్ట్రంలో ఇది అతిప్రధాన రైల్వే జోన్‌గా గుర్తించబడుతుంది. ఇక్కడి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు రైలు సౌకర్యాలు ఉన్నాయి. 2007 నగర పాలనా వ్యవస్థ , జిల్లా పాలనా వ్యవస్థ జాయింట్ వెంచర్ పద్ధతిలో బిలాస్‌పూర్ నగరంలో అంతర్జాతీయ స్థాయి సిటీ బసులను నడపాలని నిర్ణయించింది.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,662,077, [1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెవాడానగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 152 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 322 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 33.21%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 972:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 71.59%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు[మార్చు]
జిల్లాలో ఆస్ట్రో ఆసియాటిక్ భాషలలో ఒకటైన అగారియా భాషను 72,000 మంది మాట్లాడేవారు. ;[6] బఘేలి, హిందీ భాషను 78,00,000 మంది మాట్లాడుతున్నారు.[7], భరియా (ద్రావిడ భాషలలో ఒకటి) ను భరియా, షెడ్యూల్డ్ తెగలు 2,00,000 మంది మాట్లాడే వారు. ఈ భాషను దేవనాగరి లిపిలో వ్రాసేవారు.[8]
వెలుపలి లింకులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Imperial Gazetteer of India, Oxford, 1908-1931 vol. 8, p. 224
- ↑ Imperial Gazetteer of India, Oxford, 1908-1931, vol. 8, p. 221
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
{{cite web}}
: line feed character in|quote=
at position 7 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
{{cite web}}
: line feed character in|quote=
at position 7 (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
{{cite encyclopedia}}
:|edition=
has extra text (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
{{cite encyclopedia}}
:|edition=
has extra text (help) - ↑ M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
{{cite encyclopedia}}
:|edition=
has extra text (help)
వెలుపలి లింకులు[మార్చు]
- [1] List of places in Bilaspur
- అధికారిక వెబ్సైటు
- Overview of Bilaspur district
![]() |
దిందోరి జిల్లా, మధ్యప్రదేశ్ | అనుప్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్ | కోరియా జిల్లా | ![]() |
కబీర్‌ధామ్ జిల్లా | ![]() |
కోర్బా జిల్లా | ||
| ||||
![]() | ||||
దుర్గ్ జిల్లా. | రాయ్‌పూర్ జిల్లా | జాంజ్‌గిర్ చంపా జిల్లా |
మూలాలు[మార్చు]
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- CS1 errors: extra text: edition
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- All articles with unsourced statements
- Articles with unsourced statements from January 2012
- ఛత్తీస్‌గఢ్ జిల్లాలు
- బిలాస్పూర్
- భారతదేశంలో బొగ్గు గనులున్న జిల్లాలు
- 1861 స్థాపితాలు
- ఛత్తీస్‌గఢ్