చంపా
చం పా చైం థాన్హ్ | |||||||
---|---|---|---|---|---|---|---|
192–1832 | |||||||
చంపా ప్రాంతం సిర్కా 1000-1100లో | |||||||
రాజధాని | ఇంద్రపుర (875–978) విజయ (978–1485) పాండురంగ (1485–1832) | ||||||
సామాన్య భాషలు | చామ్, సంస్కృతం | ||||||
మతం | చామ్ మతం, హిందూ మతం , బౌద్ధ మతం, తర్వాతి దశలో ఇస్లాం | ||||||
ప్రభుత్వం | రాజరికం | ||||||
చరిత్ర | |||||||
• స్థాపన | 192 | ||||||
• పాండురంగ ప్రాంతాన్ని వియత్నాంకు చెందిన న్గుయెన్ వంశం ఆక్రమించుకోవడం. | 1832 | ||||||
|
నేటి వియత్నాం దక్షిణ, మధ్య ప్రాంతాల తీరాన్ని అంటుకుని వ్యాపించి స్వతంత్రులైన చామ్ ప్రజల రాజ్యవ్యవస్థను చంపా అని పిలిచేవారు. దాదాపుగా 7వ శతాబ్దం నుంచి 1832 వరకూ చంపా నిలిచివుండేది. 1832లో వియత్నాం ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని వియత్నాంలో కలిపిసేకుంది. ఈ రాజ్యం పేరు చామ్, కాంబోడియన్ భాషల్లో నగర చంప (సంస్కృతం: नगर चम्पा, Khmer: ចាម្ប៉ា) గా, వియత్నామీస్ భాషలో Chăm Pa (占城 Chiêm Thành సిని-వియత్నామీస్ భాషాపదజాలంలో) గా, చైనీస్ రికార్డుల్లో ఝాన్‌చెంగ్ అనీ వేర్వేరుగా ఉంది.
ఆధునిక వియత్నాం, కంబోడియాలోని చామ్ ప్రజలు ఈ మాజీ రాజ్యం అవశేషాలు. వారు మలయో పాలినేషియన్ కుటుంబానికి చెందిన చామ్ భాషలు మాట్లాడుతారు. ఇవి బాలీ-ససక్ భాషలు, మలయిక్ భాషలకు అతిదగ్గరి సంబంధం కలిగివుంటాయి. సా.శ.7వ శతాబ్దంలో హిందువులు చంపాను నిర్మించారు. పాణినీయ వ్యాకరణం, పురాణాలు, జ్యోతిష్యం, షడ్దర్శనాలు, ధర్మశాస్త్రములు శైవాగమాలు, హిందువుల చతుష్షష్టి కళలు ఈ దేశాల్లో ఉండేవి. ఇక్కడ శైవ మతము ప్రబలడంతో ఎన్నో శివాలయాలుండేవి. వాటి శిథిలాలు ఇప్పటికీ పరిశోధకులకు లభిస్తున్నాయి.[1]
మూలాలు
[మార్చు]- ↑ రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.