సుర్గుజా జిల్లా
సుర్గుజా జిల్లా
सरगुजा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
ముఖ్య పట్టణం | అంబికాపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 15,732 కి.మీ2 (6,074 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,61,329 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (390/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 61.16 |
• లింగ నిష్పత్తి | 991 |
Website | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాల్లో సుర్గుజా (सरगुजा) జిల్లా ఒకటి. అంబికాపూర్ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా సరిహద్దులలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, దక్షిణ సరిహద్దులో వింద్యపరత్వం శ్రేణిలోని బగెల్ఖండ్ ప్రాంతం ఉంది.
చరిత్ర
[మార్చు]శ్రీరాముడు 14 సంవత్సరాల కాలంలో అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రామారణ మహాకావ్యంతో సంబంధం ఉన్న పలు ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రామచంద్రుని విజయం తరువత్త జిల్లాలోని పలు ప్రాంతాలకు రాంగర్, సీతా-భెంగ్రా, లక్ష్మణ్‌గర్ వంటి పేర్లు వచ్చాయని భావిస్తున్నారు.[1] మౌర్య సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతాన్ని నందరాజుల చేత పాలించబడింది. క్రీ.పూ 1820 లో ఈ ప్రాంతం చిన్నచిన్న రాజాస్థానాలుగా విభజించబడింది. తరువాత రక్షల్ రాజవంశానికి చెందిన రాజపుత్రరాజు ప్రస్తుత జార్ఖండ్ ప్రాంతం మీద దండయాత్ర సాగించి ఈ ప్రాతం మీద ఆధిక్యత సాధించాడు. 1820లో అమరసింగ్ మహారాజుగా సింహాసనాధిష్టుడు అయ్యాడు. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో సుర్గుజా ప్రాంతం రాజాస్థానంగా ఉంది.[1][2] ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం..[3]
భౌగోళికం
[మార్చు]జిల్లా 23°37'25" నుండి 24°6'17" డిగ్రీల ఉత్తర అక్షాంశం, 81°34'40" నుండి 84°4'40" డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 16359చ.కి.మీ. .[1] సుర్గుజా జిల్లాలోని ఎగువభూములు చిన్న " టేబుల్ లాండ్స్ " లతో కూడిన " ప్యాట్ ఫార్మేషన్"కి చెందినవి. జిల్లాలోని ది మైంపాట్, ది జరంగ్ పాట్, ది జొంకా పాట్, ది జమిరా పాట్ , ది లాహ్సన్‌పాట్ ప్రధానమైనవి. ఈ ప్రాంతపు సరాసరి ఎత్తు 600 మీ. జిల్లాలో మైలాన్ శిఖరం ఎత్తు 1226 మీ, జాం శిఖరం ఎత్తు 1166మీ, పార్తా ఘర్సా శిఖరం ఎత్తు 1159 మీ, కందాదర శిఖరం ఎత్తు 1149 మీ, చుటై శిఖరం ఎత్తు 1131 మీ , కారో శిఖరం ఎత్తు 1105 మీ. శిఖరాలతో పలు శిఖరాలు ఉన్నాయి. జిల్లా వాయవ్యప్రాంతం కొండలతో నిండి ఉంది. రిహాండ్ నది , దాని ఉపనదులు ప్రవహిస్తున్న మద్య సుర్గుజాలో దిగువభూములు ఉన్నాయి. జిల్లాలో భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. తూర్పున శ్రీనగర్ వద్ద పాట్నా , కర్గవాన్‌కు చెందిన దిగువభూములు, రెండవ వరుసలో సోనాహత్ వద్ద ఎగువభూములు , మూడవ స్థాయిలో సోనాహత్ తరువాత ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. [1] సుర్గుజా జిల్లాలో 3 నదీమైదానాలు ఉన్నాయి: హస్డియో నది, రిహండ్ నది , కంహర్ నది.[1] వేసవి ఉష్ణోగ్రత 46 డి సెల్షియస్ , శీతాకాలంలో కనిష్ఠ ఉషోగ్రత 5 డి సెల్షియస్ ఉంటుంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,361,329, [4] |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 192వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 150 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.74%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 976:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 61.16%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రజలు ఉన్నారు. అతిపురాతన స్థానికులలో పాండో, కొర్వ జాతి ప్రజలు ఇప్పటికీ అరణ్యాలలో నివసిస్తున్నారు. పాండో ప్రజలు తమను తాము పాండవుల సంతతికి చెందినవారమని భావిస్తున్నారు. కొర్వా ప్రజలు తమను తాము కౌరవ సంప్రదాయానికి చెందిన వారమని భావిస్తున్నారు.[1]
భాషలు
[మార్చు]జిల్లాలో అధికంగా భరియా భాష వాడుకలో ఉంది. వర్నాకులర్ భాషను దాదాపు 2,00,000 మంది (భరియా జాతి ప్రజలు), షెడ్యూల్డ్ ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ భాషను దేవనాగర లిపిలో వ్రాస్తున్నారు.[7]
సంస్కృతి
[మార్చు]వన్యమృగాల జీవన శైలిని చిత్రించే మైక్ పాండే చిత్రీకరించిన " ది లాస్ట్ మైగ్రేషన్ " చిత్రం సుర్గుజాలో చిత్రీకరించబడింది. సోనాభాయి అనే మహిళ గిరిజన, జానపద శైలిలో తయారుచేస్తున్న బంకమట్టి శిల్పాలు జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.
మూలాలు
[మార్చు]Dr.Sanjay Alung-Chhattisgarh ki Riyaste/Princely stastes aur Jamindariyaa (Vaibhav Prakashan, Raipur1, ISBN 81-89244-96-5)
Dr.Sanjay Alung-Chhattisgarh ki Janjaatiyaa/Tribes aur Jatiyaa/Castes (Mansi publication, Delhi6, ISBN 978-81-89559-32-8)
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Surguja". Surguja district administration. Retrieved 2010-08-03.
- ↑ "Surguja (Princely State)". Archived from the original on 2010-09-28. Retrieved 2010-08-03.
- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico - 2,059,179
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.