హౌరా
ఈ article లో మూలాలేమీ లేవు. |
?హౌరా పశ్చిమ బెంగాల్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 22°34′25″N 88°19′30″E / 22.5736296°N 88.3251045°ECoordinates: 22°34′25″N 88°19′30″E / 22.5736296°N 88.3251045°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
51.74 కి.మీ² (20 చ.మై) • 12 మీ (39 అడుగులు) |
జిల్లా (లు) | హౌరా జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత • ఆడ-మగ నిష్పత్తి |
1,008,704 (2001 నాటికి) • 19,496/కి.మీ² (50,494/చ.మై) • 852 |
భాష (లు) | బెంగాలీ, ఆంగ్లం, హిందీ, ఉర్దూ |
మేయర్ | గోపాల్ ముఖర్జీ |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 711 xxx • +91 (33) |
వెబ్‌సైటు: www.hmc.org.in/home |
హౌరా (Howrah) (బెంగాలీ: হাওড়া ) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక పారిశ్రామిక నగరము. హౌరా నగరము, దాని పరిసర ప్రాంతాలు హౌరా జిల్లాలో ఉన్నాయి. హుగ్లీ నదికి పశ్చిమపు ఒడ్డున ఉన్న హౌరా, నదికి అవతలి ఒడ్డున ఉన్న కలకత్తా జంట నగరాలు. హౌరా పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని రెండవ పెద్ద నగరం. కలకత్తాను, హౌరాను కలుపుతూ నదిపై ప్రసిద్ధ హౌరా వంతెన (రబీంద్ర సేతు) తో పాటు విద్యాసాగర్ సేతు (రెండవ హౌరా వంతెన), వివేకానంద సేతు వంతెనలు ఉన్నాయి. హౌరాలో కలకత్తా, హౌరా నగరాలకు సేవలందిస్తున్న, దేశములో ప్రధానమైన హౌరా రైల్వే స్టేషను ఉంది. ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.
బెంగాలీ భాషలో "హావర్" అంటే నీరు, మట్టి బయటికు వెళ్ళే దారి (తూము). 500 సంవత్సరాల క్రితం వేనీషియన్ యాత్రికుడు సీసరే ఫెడరిసి 1578లో తన జర్నల్‌లో "బాటర్" (Bator) అనే స్థలం గురించి వ్రాశాడు. ప్రస్తుత హఌరా నగరం పరిసరాలలో అదే పేరుగల స్థలం ఉంది. ఔరంగజేబు మనుమడైన ఫరూఖ్ సియార్ రాజ్యం అధిష్టించినాక 1713లో ఈస్టిండియా కంపెనీ వారు అతనితో హుగ్లీ నది పశ్చిమాన ఉన్న గ్రామాలు (సలికియా, హౌరా, కసుండియా, రామకృష్ణపూర్) గురించి ఒక సెటిల్‌మెంట్ ఒప్పందం చేసుకొన్నారు. తరువాత తమ సముద్రయానం రాకపోకలకు కంపెనీవారు హౌరాను స్థావరంగా మార్చుకొన్నారు. అప్పటినుండి ఆధునిక హౌరా నగరం వృద్ధి చెందింది. ఆ గ్రామాలలో పెద్దదైన హౌరా పేరు మొత్తం నగరానికి వర్తించసాగింది. 1714 కంపెనీ రికార్డులలో "హౌరా" అనే పేరు మొట్టమొదటిసారి కనిపించింది.
1854లో హౌరా రైల్వే టెర్మినస్ ఏర్పాటు నగరం పెరుగుదలకు, పారిశ్రామికీకరణకు రెండవ ప్రధాన ఘట్టం. 1883లో హౌరా-షాలిమార్ మార్గం నిర్మించారు. 1914నాటికి అన్ని ప్రధాన నగరాలలోని రైలు ప్రయాణావసరాలకు హౌరా వర్క్‌షాప్ చాలా ముఖ్యమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి నగరం ఇంకా అభివృద్ధి చెందడంతో జనావాసాలకు స్థలం చాలక పూరిగుడిసెల ప్రాంతాలు అధికమయ్యాయి.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
బయటి లింకులు[మార్చు]
- History of Howrah from India Government Site
- Howrah Municipal Corporation Site
- Volunteer Driven Portal of Howrah City
- Satellite View of Howrah
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to హౌరా. |