Jump to content

సూరి (బీర్బం జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 23°54′36″N 87°31′37″E / 23.910°N 87.527°E / 23.910; 87.527
వికీపీడియా నుండి
Suri
Siuri
City
Siuri railway station
Suri is located in West Bengal
Suri
Suri
Location in West Bengal, India
Suri is located in India
Suri
Suri
Suri (India)
Suri is located in Asia
Suri
Suri
Suri (Asia)
Coordinates: 23°54′36″N 87°31′37″E / 23.910°N 87.527°E / 23.910; 87.527
Country India
State West Bengal
జిల్లాBirbhum
Government
 • TypeMunicipality
 • BodySuri Municipality
విస్తీర్ణం
 • Total9.47 కి.మీ2 (3.66 చ. మై)
Elevation
71 మీ (233 అ.)
జనాభా
 (2011)
 • Total67,864[1]
 • జనసాంద్రత7,166/కి.మీ2 (18,560/చ. మై.)
Languages
 • OfficialBengali[3][4]
 • Additional officialEnglish[3]
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
731101 (Suri main)

731102 (Hatjan Bazar) 731103 (Barabagan)

731126 (Karidhya)
Telephone/STD code+91 / 03462
Vehicle registrationWB-54
Lok Sabha constituencyBirbhum
Vidhan Sabha constituencySuri

సూరి, (సియురి అని కూడా పిలుస్తారు) భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక నగరం.ఇది పురపాలక సంఘ పట్టణం. బీర్భూమ్ జిల్లాకు ప్రధాన కార్యాలయం.

భౌగోళికం

[మార్చు]

సూరి పట్టణం 23°54′36″N 87°31′37″E / 23.910°N 87.527°E / 23.910; 87.527 అక్షాంశ, రేఖాంశాల వద్ద ఉంది.[5] సూరి పట్టణం రాష్ట్ర రాజధాని కోల్‌కతా (కలకత్తా) నుండి 220 కిమీ, దుర్గాపూర్ నుండి 90 కిమీ, బోల్పూర్ - శాంతినికేతన్ నుండి 34 కిమీ, ఆండాళ్ నుండి 55 కిమీ, తూర్పు రైల్వే విభాగంలోని ఆండాల్-సైంథియా బ్రాంచ్ లైన్‌లో సైంథియా నుండి 19 కి.మీ. దూరంలో ఉంది.[6] ఇది పనాగర్-మోర్గ్రామ్ జాతీయ రహదారిపై ఉంది. (ఎన్.ఎచ్ 60 అని పిలుస్తారు). సముద్రమట్టానికి 71మీటర్లు (233 అడుగులు) సగటుఎత్తులో ఉంది.[7] ఇది చోటా నాగ్‌పూర్ పీఠభూమి విస్తరించిన భాగంలో ఉంది. సూరికి వాయువ్యంగా 3 కి.మీ. దూరంలో మయూరాక్షి నదిపై తిల్పారా ఆనకట్ట ఉంది.2001 భారత జనాభా లెక్కలు ప్రకారం సూరి పట్టణం 9.47 కిమీ 2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది

చరిత్ర

[మార్చు]

భారతదేశంలో బ్రిటిష్ వారి ఆగమనం, బెంగాల్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ముందు, సూరి పట్టణం కేవలం ఒక చిన్న గ్రామం, అయినప్పటికీ, బ్రిటీష్ వలసవాదులు బహుశా రవాణా, కమ్యూనికేషన్ సౌలభ్యం కారణంగా సూరిని బీర్బమ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఎంచుకున్నారు. సూరి రోడ్డు ద్వారా చాలా ప్రాంతాలకు బాగా ప్రయాణ సదుపాయాలు కల్పించారు. అయితే ఆ రోడ్ల పరిస్థితుల గురించి స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఈ రహదారులను జేమ్స్ రెన్నెల్ 'జంగ్లెటరీ డిస్ట్రిక్ట్' (1779) పటములో గుర్తించవచ్చు.[7] బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్-దౌలా ఓటమి తరువాత, అతని స్థానంలో బ్రిటీష్ వారు చాలామందిని తోలుబొమ్మల రాజులుగా నియమించారు.మీర్ క్వాసిం నవాబుగా ఉన్నప్పుడు, అతను జమీందార్లందరినీ (భూస్వాములు) మరింత ఆదాయాన్ని చెల్లించమని ఆదేశించాడు. దీనికి రాజ్‌నగర్ పాలకుడు అసద్ జమా ఖాన్ విభేదించాడు.1760 డిసెంబరులో, నవాబు, బ్రిటీష్ సైన్యం బీర్భూమ్‌పై దాడి చేయడానికి కలిసి కవాతు చేసింది. అసద్ జమా ఖాన్ కూడా దాదాపు 5,000 మంది సైనికులతో కూడిన అశ్వికదళం, దాదాపు 20,000 మంది పదాతిదళంతో సిద్ధమయ్యాడు. యుద్ధంలో అసద్ జమా ఖాన్ ఓడిపోయి అతని జమీందారీని లాక్కున్నాడు. అతను చోటానాగ్‌పూర్‌లోని చాలా దట్టమైన అడవుల మధ్య ఆశ్రయం పొందాడు.అక్కడ అతను మరాఠా సైన్యాధ్యక్షుడు శివభట్టతో రహస్యంగా సమావేశమయ్యాడు. శివభట్ట అతనితో రెండు నుండి మూడు వేల మంది సైనికులతో పాటు పెద్ద పదాతిదళంతో కూడా చేరాడు. 1763లో కరిద్ధ్యా సమీపంలో జరిగిన మరో యుద్ధంలో అతను మళ్లీ ఓడిపోయాడు. ఆ విధంగా బ్రిటిష్ వారు సూరి పట్టణంపై నియంత్రణ సాధించారు.[7] బ్రిటీష్ పాలన ప్రారంభ సంవత్సరాల్లో, బిష్ణుపూర్, బీర్భూమ్ ముర్షిదాబాద్ నుండి నిర్వహించబడ్డాయి. అప్పుడు, బీర్భూమ్, బిష్ణుపూర్‌లను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పడింది. సూరి పట్టణం ప్రధాన కార్యాలయంగా చేయబడింది. ఆ సమయంలో, బ్రిటిష్ అధికారులు '(లాత్) హైదరాబాద్' అనే పేరును ఉపయోగించారు.కానీ తరువాత సూరి పేరు మాత్రమే వాడుకలోకి వచ్చింది. బీర్భూమ్ జిల్లా మొదటి జిల్లా కలెక్టర్ జిఆర్ ఫోలే. సూరి పురపాలక సంఘం 1876 నుండి పనిచేయడం ప్రారంభించింది. అప్పుడు, సూరి పట్టణ జనాభా 7,000 కంటే ఎక్కువ కాదు. పురపాలక మొదటి ఛైర్మన్ ఎఎ ఓవెన్. 1913లో ఆండాల్ - సైంథియా మార్గంలో మొదటి రైలు ప్రారంభమైనప్పుడు రైలు రవాణా సూరి పట్టణానికి చేరుకుంది.[8]

ఆర్థిక శాస్త్రం

[మార్చు]

సూరి పట్టణ ప్రధాన పరిశ్రమలలో బియ్యపు మిల్లులు, పత్తి, పట్టు నేయడం, కలప సామానులు తయారీ ముఖ్యమైనవి.

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19018,692—    
19119,131+5.1%
19218,915−2.4%
193110,908+22.4%
194115,867+45.5%
195118,135+14.3%
196122,841+25.9%
197130,110+31.8%
198140,783+35.4%
199154,298+33.1%
200161,806+13.8%
201167,864+9.8%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సూరి పట్టణ మొత్తం జనాభా 1,06,789, అందులో 54,589 మంది పురుషులు ఉండగా, 52,200 మంది స్త్రీలు ఉన్నారు. సూరి పట్టణ లింగ నిష్పత్తి 963. 0 నుండి 6 సంవత్సరాల వయస్సు గల జనాభా 5,935 మంది ఉన్నారు. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 53,845, ఇది జనాభాలో 79.3% ఉంది. పురుషుల అక్షరాస్యత 82.8% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 75.7% ఉంది. సూరి 7+ జనాభా ప్రభావవంతమైన అక్షరాస్యత రేటు 86.9%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 90.8%. స్త్రీల అక్షరాస్యత రేటు 82.9%. షెడ్యూల్డ్ కులాలు జనాభా 12,857, షెడ్యూల్డ్ తెగల జనాభా 6,27 ఉన్నారు. సూరి పట్టణ పరిధిలో 22,385 గృహాలు ఉన్నాయి [1]

రవాణా సౌకర్యం

[మార్చు]

సూరి పట్టణం నుండి రెండు ప్రభుత్వాలతో చక్కటి వ్యవస్థీకృత రహదారి రవాణా వ్యవస్థ ఉంది. దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ, ఉత్తర బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సేవలు, ప్రైవేట్ బస్సు సర్వీసులు ద్వారా కోల్‌కతా, దుర్గాపూర్, అసన్సోల్, పురూలియా, బంకురా, మేదినీపూర్, దిఘా, మస్సంజోర్, దుమ్కా, బోల్పూర్, బుర్ద్వాన్ ,ఇంగ్లీష్ బజార్, జల్పైగురి, సిలిగురి, కత్వా, బలుర్‌గంజ్‌హట్ ప్రధాన పట్టణాలు, నగరాలకు రోడ్డు మార్గం ద్వారా అనుసంధానించబడి ఉంది.

సియూరి ఒక మోడల్ రైల్వే స్టేషన్. ఇది పట్టణ దక్షిణ భాగంలో, హట్జన్ బజార్ వద్ద ఉంది. సియూరి మీదుగా నడిచే కొన్ని ముఖ్యమైన రైళ్లు, సూరీని నేరుగా హౌరా, కోల్‌కతా, బర్ధమాన్, దుర్గాపూర్, గౌహతి, డిబ్రూఘర్, మాల్దా, సిలిగురి, పూరి, చెన్నై, సూరత్, ఝఝా, అసన్‌సోల్, రాంచీ నాగ్‌పూర్, బిలాస్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, డిమాపూర్, జంషెడ్‌పూర్, పురూలియా, కట్‌క్, విజయవాడ, రాయ్‌పూర్, దుర్గ్ మొదలైన వంటి ప్రాంతాలతో కలుపుతుంది.

విద్య

[మార్చు]

సూరిపట్టణం లోని కళాశాలల్లో బీర్భూమ్ మహావిద్యాలయ, సూరి విద్యాసాగర్ కళాశాల ప్రముఖమైనాయి, రెండూ బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి..[9] బిర్భమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, "ఎల్.సి. కళాశాల" అని పిలువబడే శ్రీరామకృష్ణ శిల్ప విద్యాపీఠం సాంకేతిక విద్యను అందిస్తాయి. మరో 2 డిప్లొమా టెక్నికల్ కాలేజీలు (ప్రైవేట్) తాసర్కాంతలో ఉన్నాయి. సూరి పట్టణంలో అన్ని డి.ఇ.డి., బి.ఇ.డి. అన్ని కలిపి 5 కళాశాలలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చెందిన వాటితో సహా మొత్తం 18 ఉన్నత పాఠశాలలు. పాఠశాల ( బీర్భుమ్ జిల్లా స్కూల్ ) 4 సి.బి.ఎస్.ఇ. సీనియర్ సెకండరీ పాఠశాలలు అంటే కె.వి. కార్మెల్, జె.ఎన్.వి., కేంద్రీయ విద్యాలయ, యుపి పబ్లిక్ స్కూల్., ఒక డబ్ల్యు.బి.బి.ఎస్.ఇ. ఇంగ్లీష్ మీడియం పాఠశాల-సెయింట్ ఆండ్రూస్. ఆల్బాట్రాస్ పబ్లిక్ స్కూల్ సి.బి.ఎస్.ఇ. పాఠ్యాంశాలను అనుసరిస్తుంది. కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్‌ను కూడా అనుమతిస్తుంది. ఉన్నత మాధ్యమిక విద్యను అందిస్తున్న ప్రైవేట్ పాఠశాలల జాబితాలో లెవెల్‌ఫీల్డ్ స్కూల్ కూడా చేరింది.

సూరి విద్యాసాగర్ కళాశాల ప్రధాన ద్వారం

పట్టణం లోని కొన్ని ప్రముఖ పాఠశాలలు

[మార్చు]

సూరిలోని కొన్ని ప్రముఖ పాఠశాలలు బీర్భం జిల్లా స్కూల్ (స్థాపన-1851), R.T. బాలికల ఉన్నత పాఠశాల (1884లో రివర్ థాంప్సన్ బాలికల ఉన్నత పాఠశాలగా స్థాపించబడింది, తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ బాలికల ఉన్నత పాఠశాలగా పేరు మార్చబడింది), సూరి పబ్లిక్, చంద్రగతి ముస్తాఫీ మెమోరియల్ హైస్కూల్ (సూరి మిడిల్ ఇంగ్లీష్ స్కూల్‌గా స్థాపించబడింది-1856), సూరి బేనిమాధబ్ ఇన్‌స్టిట్యూషన్ ( స్థాపించబడింది-1917), కలిగటి స్మృతి నారీశిక్ష నికేతన్, సూరి రామకృష్ణ విద్యాపీఠ్, ముక్-బధీర్ విద్యాలయం (చెవిటి, మూగ పాఠశాల, స్థాపించబడింది-1936).[7] సత్సంగ్ మిషన్ మెడికల్ కాలేజ్, రిషి శాండిల్య విశ్వవిద్యాలయం, పురోషోత్తం ఫార్మా & రిటైల్ చైన్, సత్సంగ్ మిషన్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఠాకూర్ అనుకుల్ చంద్ర సత్సంగ్ మిషన్ సాధన్‌పీఠ్ ద్వారా హరిపూర్ ధామ్, చంద్రపూర్,[10]

దేవాలయాలు -ప్రార్థనా స్థలాలు

[మార్చు]
సూరి పట్టణంలో ఇది శివునికి అంకితం చేసిన దామోదర్‌ ఆలయం.

హిందూ దేవాలయాలు

[మార్చు]

బెంగాల్‌లోని కొన్ని అత్యుత్తమ టెర్రకోట దేవాలయాలు ఉన్న ప్రదేశంగా పండితులు బీర్భూమ్‌ను అంగీకరించారు. పురాతన, అత్యుత్తమమైన ఆలయం - దీనిని రాధా దామోదర్ ఆలయం అని పిలుస్తారు ఇది సూరి పట్టణంలో ఉంది. ఇది శివుని మరొక పేరు అయిన దామోదర్‌కి అంకితం చేయబడిన గంభీరమైన ఆచలం.[11] 17-18వ శతాబ్దంలో నిర్మించిన ఆచల రాధా-శ్యామ్ ఆలయాన్ని డేవిడ్ జె. మెక్‌కచియన్ ప్రస్తావించాడు, ఇటుకలతో నిర్మించబడిన ఫూల్‌పథార్ ముఖభాగాలు బాగా చెక్కబడ్డాయి.[12] మత సామరస్యం కనిపించే ప్రదేశాలలో సూరి పట్టణం ఒకటి. కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు సూరిలో ఉన్నాయి. మౌమాచి క్లబ్ సూరిలో ఒక కాళీ ఆలయం ఉంది. ఇది ఈ పట్టణంలో ప్రత్యేకమైంది, గొప్పది. ఇతర ప్రసిద్ధ ఆలయాలు బామ్ని కలిబారి, భబతరిణి కలిబారి, దంగల్‌పర ఆనందపూర్ సర్బజనిన్ మాతృమందిర్, శిబ్ మందిర్, రాధా బల్లవ్ మందిర్, శని మందిర్, దామోదర్ మందిర్, రవీంద్రపల్లి కలిబారి, రక్షకాళి ఆలయం, కెందువా దక్షిణ్ పారా కాళీ మందిర్ మొదలైనవి ఉన్నాయి. ఛటోరాజ్ కుటుంబానికి చెందిన దుర్గా దేవాలయం పట్టణంలో చాలా పురాతనమైంది.ఇది వారసత్వ దేవాలయం. ఇది సెహరాపరా వద్ద ఉంది. దుర్గాపూజ సమయంలో చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.కొత్తగా స్థాపించబడిన శివ మందిరం ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రజలను ఆకర్షిస్తుంది. సాంప్రదాయ దుర్గా పూజ ఆచారాలను పాటించటానికి ప్రజలు ఇష్టపడతారు. బరుయి-పారాలో ఉన్న సింఘా బహిని మందిర్, ప్రతిరోజు అనేక మంది భక్తులను ఆకర్షిస్తున్న మరొక పురాతన దేవాలయం. సింఘ బహిని మందిర్‌లో సంప్రదాయ-శైలి దుర్గా పూజ, కాళీ పూజ కూడా భక్తులు ఆనందిస్తారు.

మశీదులు

[మార్చు]

సూరిలో కొన్ని మసీదులు ఉన్నాయి. వాటిలో, మస్జిద్ మోర్ వద్ద ఉన్న మసీదు, మదర్సా రోడ్‌లోని మసీదు ప్రత్యేకించి ప్రస్తావించదగినవి. సూరి హజ్రత్ డేటా మెహబూబ్ షా దర్గాకు ప్రసిద్ధి చెందింది. దర్గాకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పోటెత్తారు.

చర్చీలు

[మార్చు]

ఈ పట్టణంలో మూడు చర్చిలు ఉన్నాయి. అతి పురాతనమైనది నార్తర్న్ ఎవాంజెలికల్ లూథరన్ చర్చి, సూరిలోని లాల్‌కుతిపారా సమీపంలో ఉన్న సూరి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census of India: Suri". www.censusindia.gov.in. Retrieved 3 December 2019.
  2. "Suri Municipality". Archived from the original on 5 June 2016. Retrieved 19 March 2022.
  3. 3.0 3.1 "Fact and Figures". www.wb.gov.in. Retrieved 15 January 2019.
  4. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 2 March 2019.
  5. "GeoHack - Suri, Birbhum". www.geohack.toolforge.org.
  6. Eastern Railway time table
  7. 7.0 7.1 7.2 7.3 Suri Saharer Itihas by Sukumar Sinha, Ashadeep Publication
  8. Kamangulo Sab Gelo Koi(Where Have the Cannons Gone), Dayal Sengupta, the Anandabazaar Patrika
  9. "Affiliated Colleges". www.buruniv.ac.in. Archived from the original on 2023-04-08. Retrieved 2023-04-08.
  10. "Foundation Stone Laying Ceremony of Satsang Mission Medical College, Hospital & Cancer Research Institute along with various Projects held at Haripur Dham, Chandrapur, Suri, Birbhum". Archived from the original on 2023-04-08. Retrieved 2023-04-08.
  11. Sengupta, Somen. "Next weekend you can be at Suri". The Telegraph, 20 April 2014. Retrieved 26 July 2019.
  12. McCutchion, David J., Late Mediaeval Temples of Bengal, first published 1972, reprinted 2017, page 31. The Asiatic Society, Kolkata, ISBN 978-93-81574-65-2

వెలుపలి లంకెలు

[మార్చు]