బెర్హంపూర్
Berhampore
Baharampur | |||||
---|---|---|---|---|---|
City | |||||
Berhampore montage | |||||
Coordinates: 24°06′N 88°15′E / 24.1°N 88.25°E | |||||
Country | India | ||||
రాష్ట్రం | West Bengal | ||||
జిల్లా | Murshidabad | ||||
Government | |||||
• Type | Municipality | ||||
• Body | Berhampore Municipality | ||||
• MP | Adhir Ranjan Chowdhury | ||||
విస్తీర్ణం | |||||
• City | 104.25 కి.మీ2 (40.25 చ. మై) | ||||
• Metro | 194.67 కి.మీ2 (75.16 చ. మై) | ||||
• Rank | 7th | ||||
Elevation | 18 మీ (59 అ.) | ||||
జనాభా (2011)[2] | |||||
• City | 3,05,609 | ||||
• జనసాంద్రత | 2,900/కి.మీ2 (7,600/చ. మై.) | ||||
Languages | |||||
• Official | Bengali, English | ||||
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) | ||||
పిన్ కోడ్ | 742101, 742102, 742103 | ||||
Telephone code | 91-3482-2xxxxx | ||||
Vehicle registration | WB57, WB58 | ||||
Lok Sabha constituency | Berhampore (Lok Sabha constituency) | ||||
Vidhan Sabha constituency | Berhampore (Vidhan Sabha constituency) |
బెర్హంపూర్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక నగరం. ఇదిపురపాలక సంఘ పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, బెర్హంపూర్ నగర జనాభా 3,05,609. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనాభా పరంగా కోల్‌కతా, అసన్సోల్, సిలిగురి, దుర్గాపూర్, బర్ధమాన్, మాల్దా తర్వాత ఏడవ అతిపెద్ద నగరం. బెర్హంపూర్ నగరం ముర్షిదాబాద్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. ఇది రాష్ట్ర రాజధాని కోల్‌కతా నుండి సుమారు 200 కి.మీ. (124 మై.) దూరంలో ఉంది. ఇది బెంగాల్ రాష్ట్రంలో భారతదేశ అత్యంత ముఖ్యమైన వ్యాపార, పరిపాలనా, విద్యా, రాజకీయ కేంద్రాలలోఒకటి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి 1999 నుండి ఈనగర అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ పట్టణ సముదాయాలలో ఒకటి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇది మొదటి కేంద్రం. బ్రిటీష్ వారు మాత్రమే కాకుండా డచ్, ఫ్రెంచ్ వారు కూడా ఈ నగరంలో తమ కంపెనీలను స్థాపించారు. ఫలితంగా ఇది భారతదేశపు ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇది చనాబోరా, మనోహర, రస్గుల్లా, మరెన్నో ప్రసిద్ధ తీపి తినుభండారాలకు ప్రసిద్ధి చెందింది. నగరం ఐదు పరిపాలనా ప్రాంతాలుగా విభజించబడింది. గోరా బజార్, ఖగ్రా, ఇంద్రప్రస్థ, కోసింబజార్, హరిదాస్మతి. బెర్హంపూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో (బారక్ స్క్వేర్) జరిగిన 1857 సిపాయిల తిరుగుబాటులో బెర్హంపూర్ భాగం. దీన్ని చాలామంది విదేశీ వ్యాపారులు తమ ఉత్పత్తి కేంద్రంగా ఉపయోగించుకున్నారు. సైదాబాద్ వంటి అనేక జనపదాలు నగరంగా మారడానికి ముందు, ఫరస్దంగా, కాళికాపూర్ ప్రసిద్ధిచెందాయి. కాసింబజార్ దాని మస్లిన్ దుస్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది.ఈ నగరం 1875 వరకు రాజ్‌షాహి పరిపాలనా ప్రాంతానికి ప్రధాన కార్యాలయంగా ఉండేది.
చరిత్ర
[మార్చు]1757జూన్ లో ప్లాసీ యుద్ధం తర్వాత బెర్హంపూర్ 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీచే బలపరచబడింది. ఇది 1870 వరకు సైన్య నివాస ప్రాంతంగా కొనసాగింది. బెర్హంపూర్‌కు అతి సమీపంలో ఉన్న కర్ణసుబర్ణానికి సా.శ.600 నాటి చరిత్ర ఉంది. 1600ల చివరి నాటి అనేక భవనాలు ఇప్పటికీ చూడవచ్చు. అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ స్థిరపడినందున దీనిని బ్రహ్మపూర్ అని పిలిచేవారు. కంటోన్మెంట్ 1876లో పురపాలకసంఘంగా ఏర్పాటైంది. ఇది ముర్షిదాబాద్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉంది. బెర్హంపూర్ కళాశాల 1853లో స్థాపించబడింది.1888లో ప్రధానంగా రాణి స్వర్ణమయి మద్దతుతో స్థానిక సంఘానికి అప్పగించబడింది. 1857 ఫిబ్రవరి 27న 1857 నాటి భారతీయ తిరుగుబాటు మొదటి ప్రధాన సాయుధ యుద్ధం బెర్హంపూర్‌లోని బారక్ స్క్వేర్‌లో జరిగింది. బెర్హంపూర్‌ను రాజా కృష్ణత్, అతని పూర్వీకులు, వారసులు పరిపాలించారు (అతనికి ప్రత్యక్ష వారసులు లేనందున అతని సోదరి కుటుంబానికి చెందినవారు). 1901లో బెర్హంపూర్ 24,397 జనాభాను కలిగి ఉంది. పురాతన పట్టణం కాసిం బజార్‌ను కలిగి ఉంది.
భౌగోళికం
[మార్చు]బెర్హంపూర్బెర్హంపూర్ 24°06′N 88°15′E / 24.1°N 88.25°E అక్షాంశ, రేఖాంశాల వద్ద సముద్ర మట్టానికి 18మీటర్లు (59 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.[3] బెర్హంపూర్ నగరం, కోల్‌కతాకు ఉత్తరాన రోడ్డు ద్వారా సుమారు 200 కి.మీ దూరంలో, 24°4′N 88°9′E / 24.067°N 88.150°E అక్షాంశ, రేఖాంశాల వద్ద ఇది భాగీరథి నదికి తూర్పు వైపున ఉంది, ఇది గంగానది ప్రధాన పంపిణీదారు,దీని దిగువ ప్రాంతాలలో హుగ్లీ నది అని పిలుస్తారు.
గమనిక: మ్యాప్‌తో పాటు ఉపవిభాగాలలో కొన్ని ముఖ్యమైన స్థానాలను ప్రదర్శిస్తుంది. పటంలో గుర్తించబడిన అన్ని స్థలాలు పెద్ద పూర్తి పటంలో లింకు చేయబడ్డాయి.
పౌర పరిపాలన
[మార్చు]రక్షకభట నిలయం
[మార్చు]బెర్హంపూర్ పురపాలక సంఘ ప్రాంతం,బెర్హంపూర్ కమ్యూనిటీ బ్లాక్‌లో కొంత భాగం బెర్హంపూర్ రక్షకభట నిలయం అధికారపరిధిని కలిగి ఉంది.[4]
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం బెర్హంపూర్ పట్టణ సముదాయం పరిధిలో 3,05,609 జనాభాను కలిగి ఉంది.అందులో 1,56,489 మంది పురుషులు కాగా 1,49,120 మంది మహిళలు ఉన్నారు. 0–6 సంవత్సరాల వయస్సు గల జనాభా 23,182. 7+ జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యతరేటు 88.38.గా ఉంది.[5] జనాభాలో 98.02% మంది మాట్లాడే ప్రధాన భాష బెంగాలీ. మొత్తం జనాభాలో 1.46% మంది హిందీ మాట్లాడతారు.[6]
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం బెర్హంపూర్ పట్టణ పరిధిలో1,60,168 మంది జనాభా ఉన్నారు. వారిలోపురుషులు 51% మంది ఉండగా, స్త్రీలు 49% మంది ఉన్నారు.[7] పట్టణ సరాసరి అక్షరాస్యత 79%గా ఉంది.ఇది జాతీయ సగటు అక్షరాస్యతరేటు 59.5% కన్నా ఎక్కువ. పురుషులు అక్షరాస్యత రేటు 53% ఉండగా, స్త్రీల అక్షరాస్యత రేటు 47%గా ఉంది. మొత్తం జనాభాలో 9% మంది ఆరు సంవత్సరాల కన్నాతక్కువ వయస్సు వారు ఉన్నారు.
ఆర్థికం
[మార్చు]ప్రారంభంలో ఈ నగర నివాసులలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది వ్యవసాయ, పట్టు వ్యాపారులుగా ఉన్నారు. క్రమంగా దాని భౌగోళిక స్థానం కారణంగా నగర ప్రాముఖ్యత పెరిగింది. దాని చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఈ నగరం మంచి సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించింది.తద్వారా పర్యాటకం మరొక ప్రముఖ పరిశ్రమగా మార్చింది.దాని ద్వారాపట్టణ ఆదాయం గణనీయంగా పెరిగింది.
ప్రధాన పరిశ్రమలలో వరి, నూనె గింజల నుండి నూనె తీయటం వంటి వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు ఉన్నాయి. సిల్క్ దుస్తులు నేయడం, దంతపు వస్తువులు తయారీ, చెక్కడం, విలువైన లోహపు పని వంటి గృహోపకరణాలు ఈ నగరంలో ఇతర ముఖ్యమైన పరిశ్రమలు. బహ్రంపూర్‌లోని పొరుగున ఉన్న ఖాగ్రా, బెల్-మెటల్, ఇత్తడి పాత్రలు, అలాగే దంతాలు, చెక్క చెక్కడం తయారీకి ప్రసిద్ధి చెందింది.[8][9] "ఖగ్రై కాన్షా" అని పిలువబడే గంటలు తయారు చేయడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ రకం లోహం నగరంలో తయారు చేస్తారు. ఇది వంటకాల గిన్నెల వంటి పాత్రలను తయారు చేయడానికి ఉపయోగించే ఇత్తడి రకం. నగరంలో అనేక పెద్ద దుకాణాలు ఉన్నాయి.అవి ఇప్పుడు ప్రధాన షాపింగ్ గమ్యస్థానాలుగా మారాయి. పట్టణంలోని సముదాయ వాణిజ్య భవనాలలో బెర్హంపూర్ కోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ మాల్ లోపల మోహన్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. బెర్హంపూర్ తీపి ఛనాబోరా, రుచికరమైన ఖాజా, తీపి పదార్థాలకు ప్రసిద్ధి చెందింది.ఇది ముర్షిదాబాద్ పట్టు (తస్సార్) కు కూడా ప్రసిద్ధి చెందింది. మిఠాయి దుకాణాలు, స్వర్ణకారుల దుకాణాలు, అనేక ఇతర చిన్న తరహా పరిశ్రమలలో కలికా అనే పేరును ఉపయోగిస్తున్నారు. కాళికా అనే పేరు కాళీ దేవి అని అర్థం.
రవాణా
[మార్చు]రహదారి - బెర్హంపూర్ ముర్షిదాబాద్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం, పశ్చిమ బెంగాల్ మధ్య స్థానంలో ఉన్నందున, ఇది ఉత్తర బెంగాల్,దక్షిణ బెంగాల్ మధ్య కూడలి ప్రాతంగా పనిచేస్తుంది.ఈ పట్టణం జాతీయ రహదారి 12, జాతీయ రహదారి 34 ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. స్థానిక రవాణా అనేది రిక్షాలు,ఇ-రిక్షాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. (టుక్-టుక్ లేదా టోటో కార్ అని పిలుస్తారు). దక్షిణ బెంగాల్ నుండి ఉత్తర బెంగాల్‌కు, వైస్ వెర్సాకు రోజూ బస్సు సర్వీసులు ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాలు
[మార్చు]బెర్హంపూర్ పశ్చిమ బెంగాల్‌లోని పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది ఈస్టిండియా కంపెనీ మొదటి ప్రధాన కార్యాలయంకావడంతో స్థానికులు,విదేశీయుల నుండి పర్యాటకుల సందర్శన వత్తిడి ఎక్కువ ఉంటుంది. బెంగాల్ నవాబులు, బెంగాల్ సుల్తానులు, జమీందార్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ ( బ్రిటీష్ రాజ్), ఫ్రెంచ్ వంటి ఇతర యూరోపియన్ వలసవాద దళాలచే సుసంపన్నమైనసుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.
చదువు
[మార్చు]బాలుర కోసం ప్రభుత్వ-సహాయక ఉన్నత పాఠశాలల్లో, కృష్ణత్ కాలేజ్ స్కూల్, బెర్హంపూర్, బెర్హంపూర్ జెఎన్ అకాడమీ, ఈశ్వర్ చంద్ర ఇన్‌స్టిట్యూషన్ (ఐసిఐ), గురుదాస్ తారాసుందరి ఇన్‌స్టిట్యూషన్ (జిటిఐ), సైదాబాద్ మనీంద్ర చంద్ర విద్యాపీఠం (ఎంసివి) అత్యంత ప్రసిద్ధమైనవి. బాలికల ఉన్నత పాఠశాలలో బెర్హంపూర్ మహారాణి కాశీశ్వరి బాలికల ఉన్నత పాఠశాల, మహాకాళి పాఠశాల,శ్రీష్ చంద్ర విద్యాపీఠ్,లిపిక బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. పైన పేర్కొన్న అన్ని పాఠశాలలు స్టేట్ బెంగాల్ బోర్డ్‌తో అనుబంధించబడ్డాయి.
విశ్వవిద్యాలయ
[మార్చు]- ముర్షిదాబాద్ విశ్వవిద్యాలయం
కళాశాలలు
[మార్చు]- బెర్హంపూర్ కళాశాల మొదట 1963లో రాజా కృష్ణత్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌గా స్థాపించబడింది. 1975లో పేరు మార్చబడింది. ఇది బెర్హంపూర్‌లో ఉంది.[10]
- బెర్హంపూర్ బాలికల కళాశాల 1946లో బెర్హంపూర్‌లో స్థాపించబడింది [11][12]
- సెంట్రల్ సెరికల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ సిల్క్ బోర్డ్, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే నిర్వహించబడిన ఒక పరిశోధనా కేంద్రం, దీనిని 1943లో బెర్హంపూర్‌లో స్థాపించారు. ఇది సెరికల్చర్, టైలర్ మేడ్ కోర్సులలో రెగ్యులర్ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సును నిర్వహిస్తుంది.[13]
- గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్స్‌టైల్ టెక్నాలజీ, బెర్హంపూర్ [14]లో బెర్హంపూర్‌లో స్థాపించబడింది.
- కృష్ణత్ కళాశాల (1902 వరకు బెర్హంపూర్ కళాశాల అని పేరు పెట్టారు) 1853లో బెర్హంపూర్‌లో స్థాపించబడింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు ఫిజియాలజీ, సెరికల్చర్,సంస్కృతంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది.[15][16]
- ముర్షిదాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ [17]లో బెర్హంపూర్‌లో స్థాపించబడింది.
- ముర్షిదాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1956లో స్థాపించబడింది.
- ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ బెర్హంపూర్‌లో 2012లో స్థాపించబడింది [18]
- మోనార్క్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ టెక్నాలజీ అనేది బెర్హంపూర్‌లోని ఒక ప్రైవేట్ కళాశాల, ఇది యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్,సిరామిక్ డిజైన్‌లో కోర్సులను అందిస్తోంది.[19]
- ప్రభరణి పబ్లిక్ స్కూల్ 2003లో బెర్హంపూర్ శివార్లలో స్థాపించబడింది. ఈ పాఠశాల కళ్యాణ్ భారతి ట్రస్ట్‌లో భాగం, ఇందులో బెంగాలీ మీడియం పాఠశాలలు, బిఇడి, సి బి ఎస్ ఇ పాఠశాలతో పాటు కళాశాలలు.[20]
- యూనియన్ క్రిస్టియన్ ట్రైనింగ్ కాలేజీ 1938లో బెర్హంపూర్‌లో స్థాపించబడింది. ఇది దాని బిఇడి కోర్సు కోసం వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ టీచర్స్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్‌తో దాని బి పీఇ డీ కోర్సు కోసం కల్యాణి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది.[21]
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- రాఖల్‌దాస్ బంద్యోపాధ్యాయ, చరిత్రకారుడు (మొహెంజో-దారో సింధు లోయ నాగరికతలో శిథిలాలను వెలికితీ సాడు )
- నబరున్ భట్టాచార్య, రచయిత
- అతిన్ బందోపాధ్యాయ, రచయిత
- సయాద్ ముస్తఫా సిరాజ్, రచయిత
- అరూప్ చంద్ర, కవి, రచయిత
- త్రిదిబ్ చౌధురి, రాజకీయ నాయకుడు
- అరిజిత్ సింగ్, గాయకుడు
- అధిర్ రంజన్ చౌదరి, రాజకీయ నాయకుడు
- మంజు డే, నటి
- మనీష్ ఘటక్, కల్లోల కాలం నాటి కవి
- మహాశ్వేతా దేవి, రచయిత్రి
- శ్రేయా ఘోషల్, నేపథ్య గాయని [22]
- బ్రజ భూషణ్ గుప్తా, జాతీయవాద రాజకీయ నాయకుడు
- సర్ జార్జ్ ఫ్రాన్సిస్ హిల్, బ్రిటిష్ సంగ్రహశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ లైబ్రేరియన్ (1931–1936)
- మికైయా జాన్ ముల్లర్ హిల్, బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు
- మోనిరుద్దీన్ ఖాన్, రచయిత
- సుదీప్ రాయ్, కళాకారుడు
- బైకుంఠ నాథ్ సేన్, రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త
- సత్యరూప్ సిద్ధాంత, పర్వతారోహకుడు
- రామేంద్ర సుందర్ త్రిబేది, రచయిత
- బ్రజేంద్ర నాథ్ సీల్,తత్వవేత్త
- సుదీప్ బందోపాధ్యాయ్: పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.
మూలాలు
[మార్చు]- ↑ "Berhampore City".
- ↑ 2.0 2.1 "Berhampore Info".
- ↑ "Maps, Weather, and Airports for Baharampur, India". www.fallingrain.com. Retrieved 1 April 2018.
- ↑ "District Statistical Handbook 2014 Murshidabad". Table 2.1. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 29 July 2017. Retrieved 17 May 2017.
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 21 October 2011.
- ↑ "Table C-16 Population by Mother Tongue (Urban): West Bengal". censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
- ↑ "Handicrafts and silk industry". Murshidabad district administration. Archived from the original on 11 December 2007. Retrieved 8 September 2007.
- ↑ "Crafts and artisans of India". craftandartisans.com. Archived from the original on 11 September 2007. Retrieved 8 September 2007.
- ↑ "Berhampore College". BC. Retrieved 13 September 2017.
- ↑ "Berhampore Girls' College". BGC. Archived from the original on 17 సెప్టెంబరు 2017. Retrieved 12 September 2017.
- ↑ "Berhampore Girls' College". College Admission. Retrieved 12 September 2017.
- ↑ "Central Sericulture and Research Institute, Berhampore (W.B.)". Central Silk Board, Ministry of Textiles, Government of India. Retrieved 12 September 2017.
- ↑ "Government College of Engineering & Textile Technology, Berhampore". GCETTB. Retrieved 12 September 2017.
- ↑ "Krishnath College". KC. Archived from the original on 12 September 2017. Retrieved 12 September 2017.
- ↑ "Krishnath College". College Admission. Retrieved 12 September 2017.
- ↑ "Murshidabad College of Engineering & Technology". meetbhb. Retrieved 12 September 2017.
- ↑ "Murshidabad Medical College & Hospital, Murshidabad". collegedunia. Retrieved 12 September 2017.
- ↑ "Monarch College of Art and Technology". College Admission. Retrieved 12 September 2017.
- ↑ "Prabharani Public School". PPS. Archived from the original on 20 అక్టోబరు 2017. Retrieved 20 October 2017.
- ↑ "Union Christian Training College". UCTC. Retrieved 12 September 2017.
- ↑ "Shreya Ghoshal's :: Official Website". www.shreyaghoshal.com. Archived from the original on 24 అక్టోబరు 2013. Retrieved 1 April 2018.