మంజు డే
Appearance
మంజు డే | |
---|---|
జననం | బహరంపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం | 1929 మే 7
మరణం | 1989 సెప్టెంబరు 30 | (వయసు 60)
క్రియాశీల సంవత్సరాలు | 1951 - 1983 |
పురస్కారాలు | ఉత్తమ సహాయ నటి (25వ వార్షిక బి.ఎఫ్.జె.ఎ. అవార్డు) |
మంజు డే (7 మే, 1926 - 30 సెప్టెంబరు, 1989) బెంగాలీ సినిమా నటి, దర్శకురాలు.[1] 1962లో కారీ సాహెబర్ మున్షి సినిమాకు 25వ వార్షిక బి.ఎఫ్.జె.ఎ. అవార్డులలో ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది.[2]
జీవిత విషయాలు
[మార్చు]మంజు 1926, మే 26న పశ్చిమ బెంగాల్ లోని బహరంపూర్ గ్రామంలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]జిఘన్సా అనే బెంగాలీ సినిమాలోని నటనతో గుర్తింపు పొందింది. 1950-1960 మధ్యకాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో పేరొందిన మంజు, సినీ దర్శకులు అజోయ్ కార్, మృణాళ్ సేన్, తపన్ సిన్హా రూపొందించిన సినిమాలలో నటించింది. షజరుర్ కాంతా, అభిషప్తా చంబల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించింది.[3][4]
సినిమాలు
[మార్చు]- జిఘన్సా (1951)
- బియల్లిష్ (1951)
- రత్నదీప్ (1951)
- బౌ ఠాకురనిర్ హాత్ (1953)
- గృహప్రవేష్ (1954)
- మంత్ర శక్తి (1954)
- ఉపహార్ (1955)
- లక్ష-హీరా (1956)
- కాబూలీవాలా (1957)
- పృతిబి అమరే చాయ్ (1957)
- బర్డిడి (1957)
- నీల్ అకాషర్ నీచే (1958)
- అభిషప్త చంబల్ (1967)
- షాజూర్ కాంతా (1974)
- అర్పిత (1983)
మరణం
[మార్చు]మంజు 1989, సెప్టెంబరు 30న మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Manju Dey on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-06-11.
- ↑ "Manju Dey - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-06-11.
- ↑ Kirstin Olsen (1994). Chronology of Women's History. Greenwood Publishing Group. p. 309. Retrieved September 19, 2018.
Manju Dey actress.
- ↑ "Manju Dey Complete Movies List from 1954 to 1952". www.bollywoodmdb.com. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మంజు డే పేజీ