బరంపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బరంపురం
ବ୍ରହ୍ମପୁର
బ్రహ్మపూర్ /బెర్హంపూర్
City
బరంపురం రైల్వే స్టేషను
బరంపురం రైల్వే స్టేషను
Nickname(s): BAM
బరంపురం is located in Odisha
బరంపురం
Location in Odisha, India
Coordinates: 19°19′N 84°47′E / 19.32°N 84.78°E / 19.32; 84.78Coordinates: 19°19′N 84°47′E / 19.32°N 84.78°E / 19.32; 84.78
దేశం  India
రాష్ట్రం ఒడిషా
జిల్లా గంజాం
Government
 • మేయర్ శివ్ శంకర్ దాస్
Elevation  m ( ft)
Population (2011)
 • Total 355
 • Rank 120
Languages
 • Official ఒడియా, ఆంగ్లము
Time zone IST (UTC+5:30)
పిన్‌కోడ్ 760001 -760010
టెలిఫోన్ కోడ్ 0680
Vehicle registration OR-07/ OD-07
Website www.berhampur.gov.in

బరంపురము లేక బ్రహ్మపుర్ లేదా బెర్హంపూర్ ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరమునకు సిల్క్ సిటీ అని కూడా వ్యవహరిస్తారు. ఇది రాజధాని భువనేశ్వర్ నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చరిత్ర[మార్చు]

ఆంగ్లేయ కాలమందు బరంపురము మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగముగా ఉండేది కావున ఇచ్చట తెలుగు మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసించుచున్నారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

బరంపురం ఒడిషా రాష్ట్రపు వాణిజ్య రాజధాని మరియు దక్షిణ ఒడిషా ముఖద్వారము. ఈ కారణం వలన ఇక్కడ రవాణా సదుపాయములు బాగా అభివృద్ధి చెందాయి.

రోడ్డు[మార్చు]

బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నది. జాతీయ రహదారి 5 (భారతదేశం) (చెన్నై– కోల్‌కతా) మరియు NH-59 (గోపాల్‌పూర్– అహమదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉన్నది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.

రైలు[మార్చు]

బరంపురం రైల్వేస్టేషను కోల్‌కతా మరియు చెన్నై మహానగరాలను కపుపుతూ సాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ కు అనుసంధానమై ఉన్నది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన కొత్త ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగలూరు, భువనేశ్వర్, చెన్నై, కటక్, ముంబాయి, నాగ్‌పూర్, పూనా, పూరి, విశాఖపట్నం, కోల్‌కతా, రాయ్‌పుర్, సంబల్‌పుర్ లను సులభంగా చేరుకోవచ్చు.

సముద్రం[మార్చు]

ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ మరియు పరదీప్ పోర్ట్ ట్రస్ట్ ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు బాహుదా మౌత్ (ముహన్) ఈ రెండు ఓడరేవులు.

ప్రముఖులు[మార్చు]

  • తాపీ ధర్మారావు నాయుడు - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
  • జయంతి కామేశం పంతులు - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టు పేటలో నివశించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కధకుడు అయిన ఆదిభట్ల నారాయణదాసు గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో ఉపజాత్యష్టకం చెప్పిఉన్నారు

మూలాలు, ఆధారాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బరంపురం&oldid=1697101" నుండి వెలికితీశారు