తాపీ ధర్మారావు
తాపీ ధర్మారావు నాయుడు | |
---|---|
![]() తాపీ ధర్మారావు నాయుడు | |
జననం | తాపీ ధర్మారావు నాయుడు 1887 , సెప్టెంబర్ 19 ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు |
మరణం | 1973 మే 8 |
ఇతర పేర్లు | తాతాజీ |
వృత్తి | కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు |
ప్రసిద్ధి | తెలుగు రచయిత తెలుగు భాషా పండితుడు హేతువాది నాస్తికుడు |
మతం | లేదు |
పిల్లలు | కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య) |
తండ్రి | డాక్టర్ అప్పన్న |
తల్లి | నరసమ్మ |
Notes తాపీ ధర్మారావు నాయుడు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” |
తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 - మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1]
జీవిత చరిత్ర[మార్చు]
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.[1] ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో "బండి" లేదా "బండారు" కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో "తాపీ లక్ష్మయ్యగారు" అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో 'ఆంధ్రులకొక మనవి' అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
జీవితంలో ముఖ్య ఘట్టాలు[2][మార్చు]
1887 - సెప్టెంబర్ 19 జననం - గంజాం జిల్లా, బరంపురం
1903 - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం
1904 - గురజాడను సుదూరంగా దర్శించడం
1904 - ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి
సినిమా జీవితం[మార్చు]
విశేషాలు[మార్చు]
- ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
- ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
- 'మాలపిల్ల' (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
- తాపీని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.
రచనలు[మార్చు]
- ఆంధ్రులకొక మనవి
- దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
- పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
- ఇనుపకచ్చడాలు
- సాహిత్య మొర్మొరాలు
- రాలూ రప్పలూ
- మబ్బు తెరలు
- పాతపాళీ
- కొత్తపాళీ
- ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
- విజయవిలాసం వ్యాఖ్య
- అక్షరశారద ప్రశంస
- హృదయోల్లాసము
- భావప్రకాశిక
- నల్లిపై కారుణ్యము
- విలాసార్జునీయము
- ఘంటాన్యాయము
- అనా కెరినీనా
- ద్యోయానము
- భిక్షాపాత్రము
- ఆంధ్ర తేజము
- తప్తాశ్రుకణము
పురస్కారములు[మార్చు]
- శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
- చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
- మరెన్నో సాహిత్య పురస్కారములు.
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
వనరులు[మార్చు]
- తెలుగు సాహితీవేత్తల చరిత్ర - రచన: మువ్వల సుబ్బరామయ్య - ప్రచురణ: కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ (2008).
- http://www.suryaa.com/sahithyam/article-1-99661[permanent dead link]
- CS1 errors: access-date without URL
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1887 జననాలు
- 1973 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు సినిమా రచయితలు
- సంపాదకులు
- నాస్తికులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- శ్రీకాకుళం జిల్లా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా హేతువాదులు
- శ్రీకాకుళం జిల్లా పాత్రికేయులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు