గణితము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

చరిత్ర[మార్చు]

గణితము వేద కాలము నుండి భారతీయ సంప్రదాయములో భాగమేనని మన వేద గణితము ద్వారా మనకు తెలియు చున్నది. గణితము ప్రాచీన భారత దేశముతో పాటు ప్రాచీన ఈజిప్టు, మెసపుటేమియా, ప్రాచీన చైనా, ప్రాచీన గ్రీకు నాగరికతలలో ఎక్కువగా అభివృద్ధి చెందినది. ప్రపంచ వ్యాప్తముగా గణితము అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా భారతీయుల ఆవిష్కరణే.
కొన్ని ప్రాచీన భారతీయ గణిత గ్రంథాలు:

ప్రముఖ గణిత శాస్త్రజ్ఞులు[మార్చు]

శాఖలు[మార్చు]

గణితము వివిధ భాగములుగా అభివృద్ధి చెందుతున్నది.

  1. బీజ గణితము (Algebra)
  2. రేఖా గణితము లేదా క్షేత్ర గణితము (Geometry)
  3. త్రికోణమితి (Trigonometry)
  4. కలన గణితము (Calculus)
  5. సాంఖ్యక శాస్త్రము (Statistics)

మొదలైనవి.

  1. సంభావ్యత (Probability)

బీజ గణితము[మార్చు]

బీజ గణితములో వివిధ భాగములున్నవి: సమితులు, ప్రమేయములు, అనుక్రమాలు, శ్రేణులు, సంభావ్యత, అవధులు, ప్రస్తారాలు, సంయోగాలు మొదలైనవి.

రేఖా గణితము[మార్చు]

రేఖా గణితములో వృత్తములు, త్రిభుజములు, సరళ రేఖలు మొదలైన ఆకృతులను గూర్చి, అవి ఆధారపడు సూత్రముల గురించి వివరించబడును. రేఖా గణితమును మొదట యజ్ఞ యాగాదుల కొరకు ఉపయోగించారు. రాను రాను అది ఒక శాస్త్రముగ అభివృద్ధి చెందింది. భారత దేశములో

త్రికోణమితి[మార్చు]

త్రికోణమితి ముఖ్యముగా త్రిభుజములు వాటి సూత్రములు ఆధారముగా భుజాలను, కోణాలను కొలుచుటకు ఉపయోగించు శాస్త్రము. త్రికోణమితి యొక్క ఉపయోగాలు ఖగోళ శాస్త్రములోను, నిజజీవితములోను ఎన్నో చోట్ల ఉన్నాయి. నక్షత్రములు, గ్రహముల మధ్య దూరము లను అంచనా వేయడానికి త్రికోణమితిని ఉపయోగిస్తారు. త్రికోణమితిలో ప్రమేయాలు లంబ కోణ త్రిభుజము (లం.కో.త్రి.) ఆధారముగా నిర్వచించబడినవి. ఒక త్రిభుజములో 90 డిగ్రీలు ఉన్న కోణాన్ని లంబ కోణమనీ, 90 డిగ్రీలకంటె ఎక్కువ ఉంటే గురుకోణమనీ, 90 డిగ్రీలకంటె తక్కువ ఉంటే లఘుకోణమనీ అంటాము. ఒక త్రిభుజము లోని కోణాల మొత్తం 180 డిగ్రీలు. త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటే ఆ త్రిభుజాన్ని లంబ కోణ త్రిభుజము అంటాము; ఒక కోణము గురు కోణమైతే దానిని గురు కోణ త్రిభుజము అంటాము; మూడు కోణాలూ లఘు కోణాలైతే దానిని లఘుకోణ త్రిభుజము అంటాము. ఒక త్రిభుజములో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఎదురు భుజము అనీ, కోణానికి ఇరు ప్రక్కలా ఉండే భుజాలను ఆసన్నభుజములనీ అంటాము. లంబ కోణ త్రిభుజములో, లంబ కోణము కాని మిగిలిన రెండు కోణాలూ లఘుకోణా లని గమనిద్దాం.లంబకోణ త్రిభుజములో లంబకోణానికి ఎదురుగా ఉన్న కోణాన్ని కర్ణము అని కూడా అంటాము.

సాంఖ్యక శాస్త్రము[మార్చు]

సంఖ్యలు[మార్చు]

Hindu numerals.png

ఇవికూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గణితము&oldid=2306791" నుండి వెలికితీశారు