Jump to content

వైదిక గణితము

వికీపీడియా నుండి

వైదిక గణితము (ఆంగ్లం: Vedic Mathematics) అనగా హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి 1911, 1918 సంవత్సరాల మధ్య స్వామి భారతీ క్రిష్ణ తీర్థ (1884-1960) చే తిరిగి కనుగొనబడ్డ పదహారు ముఖ్య గణిత సూత్రాల సంకలనం. కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధతో వేదాలను అభ్యసించడం ద్వారా ఈ సూత్రాలను కనుగొన్నట్టు ఈయన పేర్కొన్నాడు.వేదాలు గణితానికి చాలా ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. వేదాలలో ఉన్న గణితాన్ని విపులీకరిస్తూ బోధాయన మహర్షి, గర్గ మహర్షి, మేధాతిధి, పరాశరుడు, కశ్యపుడు, మయుడు, బృహస్పతి తరువాతి కాలంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు, భాస్కరుడు అనేక గ్రంథాలు వ్రాశారు. సా.శ. 770 ప్రాంతంలో ఉజ్జయిని వాసి అయిన కంకుడు అనే పండితుడు అరబ్ విద్వాంసులకు మన గణితాన్ని బోధించినట్లు తెలుస్తుంది. సిరియాలో సా.శ. 7 వ శతాబ్దం నాటికే హిందూ అంకెలు వాడుకలో ఉన్నట్లు "ఆన్ న్యూ లైట్ ఆన్ ఔర్ న్యూమెరల్స్" అనే ఫ్రెంచ్ వ్యాసంలో ఉంది. అరబ్బుల నుంచి గణితము ఆంగ్లేయులకు ప్రాచుర్యం పొంది తిరిగి భారతావనికి గణితము ఆంగ్ల రూపములో చేరింది.వేదంలో ఎక్కడా గణిత శాస్త్రం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన దాఖలాలు లేవు. కానీ, యజ్ఞ యాగాదులు తలపెట్టినపుడు, తలపెట్టిన కార్యక్రమాన్ని అనుసరించి హోమకుండం, యజ్ఞ వాటిక నిర్మాణాలు ఏ తీరుగా నిర్మించాలో మొదలుకుని, ఋత్విక్కులు చేసే అన్ని కార్యక్రమాల్లో గణితం అంతర్లీనంగా ఉండేది.వేదగణితం పురాతనమైన, గహనమైన, విస్తృతమైన శాస్త్రం. చాలాకాలం వరకూ, అది జ్యోతిష శాస్త్రంలో భాగంగా పరిగణించబడేది. క్షేత్రగణితానికి పునాదిగా, సులభ సూత్రాలనే పేరుతో ఇది కల్ప శాస్త్రంలో పాక్షికంగా ప్రస్తావించబడింది. ఈ శాస్త్రంలో - ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, పావులూరి మల్లన్న వంటి నిష్ణాతులైన గణితశాస్త్రజ్ఞులు ఎందరెందరో ఉన్నారు[permanent dead link]

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 88వ మన్ కి బాత్ ప్రసంగంలో "భారతీయులకు గణితము ఎప్పుడూ క్లిష్టమయిన విషయము కాదు కారణము వైదిక గణితమే. వైదిక గణితము ద్వారా క్లిష్టమయిన లెక్కలు రెప్ప పాటులో చేస్తున్నారు. చాలా మంది యువత సామాజిక మాధ్యమాలనుపయోగించి శిక్షణ ఇస్తున్నారు[1][2] అని పేర్కొన్నారు.

సూత్రాలు

[మార్చు]
  1. ఏకాధికేన పూర్వేణ : By one more than the one before
  2. నిఖిలం : All from 9 and the last from 10
  3. ఊర్థ్వ తిర్యగ్భ్యాం : Vertically and Cross-wise
  4. పరావర్త్య యోజయేత్ : Transpose and Apply
  5. శూన్యం సామ్యసముచ్చయే : If the Samuccaya is the Same it is Zero
  6. శూన్యమన్యత్ : If One is in Ratio the Other is Zero
  7. సంకలన వ్యాకలనాభ్యాం : By Addition and by Subtraction
  8. పూరణపూరణాభ్యాం : By the Completion or Non-Completion
  9. చలన కలనాభ్యాం : Differential Calculus
  10. యవాదునమ్ : By the Deficiency
  11. వ్యాస్తి సమస్తి : Specific and General
  12. శేషన్యంకేన చరమేణ : The Remainders by the Last Digit
  13. సోపాంత్యద్వయమంత్యం : The Ultimate and Twice the Penultimate
  14. ఏకాన్యునేన పూర్వేణ : By One Less than the One Before
  15. గుణిత సముచ్చయ:The Product of the Sums
  16. గుణక సముచ్చయ:All the Multipliers

ఉప సూత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "'From Zero to infinity': PM Modi on Vedic Maths, Intel CEO on Mann ki Baat". Hindusthan times. 24 April 2022. Retrieved 26 January 2023.
  2. "PM Modi Emphasis On Learning Vedic Maths". The national bulletin. 24 April 2022. Retrieved 26 January 2023.