కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం
కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం (కెఎంఏ) | |
---|---|
పట్టణ ప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
కోర్ సిటీ | కోల్‌కతా |
జిల్లాలు | కోల్‌కాతా జిల్లా ఉత్తర 24 పరగణాలు దక్షిణ 24 పరగణాలు నదియా జిల్లా హౌరా జిల్లా హుగ్లీ జిల్లా |
విస్తీర్ణం | |
• Metro | 1,886.67 కి.మీ2 (728.45 చ. మై) |
జనాభా (2011 జనగణన)[1] | |
• Metro | 1,41,12,536 |
• Metro density | 7,480/కి.మీ2 (19,400/చ. మై.) |
Time zone | UTC+5.30 (IST) |
కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం చుట్టూ ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. ఢిల్లీ, ముంబై తరువాత భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మూడవ మెట్రోపాలిటన్ ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో 37 పురపాలక సంఘాలు, 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి.[2][3] ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికల కొరకు కోల్‌కాతా మహానగర అభివృద్ధి సంస్థ (కెఎండిఎ)కు పూర్తి అధికారం ఉంటుంది.
చరిత్ర
[మార్చు]కోల్‌కాతా అనే పేరు కొలికత (తెలుగులో కాళిక) అనే బెంగాలి పదం నుండి వచ్చింది. ఈ నగరం కోల్‌కాతా, కలికత అని పిలువబడుతూ వచ్చింది. ఈ పేరును ఆంగ్లేయులు కలకత్తా అని పిలుస్తూ వచ్చారు. 2001లో నగరం పేరును అధికారికంగా కోల్‌కాతాగా మార్చారు.
కోల్‌కాతా చారిత్రకాధారాలు 1690 నుండి లభ్య మౌతున్నాయి. కాలికత, సూతనుతి, గోవిందపూరు అనే మూడు గ్రామాల చుట్టూ క్రమంగా నగరం విస్తరించిందని భావిస్తున్నారు. కాలికత జాలరి పల్లెగా ఉండేది, సూతనుతి నదీతీర సాలెవారి పల్లె. 1712 లో బ్రిటిష్ ప్రభుత్వం హుగ్లీ నది తూర్పుతీరంలో ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఆ తరువాత కోల్‌కాతా ప్రెసిడెన్సీ నగరంగా ప్రకటించబడింది. 1772లో ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోని ప్రదేశాలకు కలకత్తాను రాజధానిగా చేసారు. 18వ శతాబ్దపు చివరి నుండి 19వ శతాబ్దం అంతా ఈ నగరం ఈస్టిండియా కంపెనీ ఓపీయం వాణిజ్యానికి కేంద్రంగా ఉంది.
1850 నాటికి కోల్‌కాతాలో ప్రధానంగా రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఒకటి వైట్ టౌన్ (శ్వేతనగరం) రెండవది బ్లాక్ టౌన్ (నల్లవారి నగరం). చౌరింఘీని కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ ప్రజలు నివాసాలు అభివృద్ధి చేసుకున్నారు. ఉత్తర కోల్‌కాతాలో భారతీయులు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తరువాత టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషను నిర్మాణం కొనసాగింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి, స్వదేశీ ఉద్యమం రూపుదిద్దుకుని, బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి మార్చుకుంది.
ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరికొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పు పాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు. 1971లో బంగ్లాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కోల్‌కాతా నగరం నిండిపోయింది. 1990 తరువాత నగరం ఆర్థికంగా కోలుకోసాగింది. 2000లో దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం బాగా అభివృద్ధి సాధించి ఆర్థికంగా బలపడడం మొదలైంది.
అధికార పరిధి
[మార్చు]అధికార పరిధి | ||
---|---|---|
విభాగాలు | పేరు | మొత్తం |
నగరపాలక సంస్థలు | కోల్‌కాతా, బిధన్నగర్,[4][5] హౌరా,[6] చదన్నగర్ | 4 |
పురపాలక సంఘాలు |
|
37 |
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో మొత్తం జనాభా 14,112,536 ఉన్నారు. మొత్తం వైశాల్యం 1,886.67 కి.మీ.² కాగా, కి.మీ.కి జనాభా సాంద్రత 7,480.[7]
ఇవికూడా చూడండి
[మార్చు]- ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం
- హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
- ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం
- భారతదేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ http://censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/india2/Million_Plus_UAs_Cities_2011.pdf
- ↑ Kolkata Archived 8 మార్చి 2012 at the Wayback Machine. Metropolis.org.
- ↑ "Chapter II – The Vision _ Evolution of Kolkata Metropolitan Area" (PDF). jnnurmmis.nic.in. Archived from the original (PDF) on 2009-04-11. Retrieved 2020-10-07.
- ↑ "Rajarhat-Gopalpur Municipality merges with Bidhannagar Municipal Corporation".
- ↑ "BMC". Archived from the original on 2020-09-20. Retrieved 2020-10-07.
- ↑ "Bally Municipality is merged with Howrah Corporation".
- ↑ "2011 Census India" (PDF). www.censusindia.gov.in. Archived from the original (PDF) on 2020-07-04. Retrieved 2020-10-07.