ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం
Location of ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
నగరంముంబై
జిల్లాముంబై పరిసరం
ఠాణే
పాల్ఘర్
రాయగడ్
విస్తీర్ణం
 • మెట్రో ప్రాంతం
6,355 కి.మీ2 (2,454 చ. మై)
జనాభా
(2005 Census)
20,748,395
 • సాంద్రత4,764/కి.మీ2 (12,340/చ. మై.)
కాలమానంUTC+5:30 (IST)

ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం మహారాష్ట్రలోని ముంబై, దాని సమీప పట్టణాలను కలిగివున్న మెట్రోపాలిటన్ ప్రాంతం. 6,355 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగివున్న ఈ ప్రాంతం[1] 26 మిలియన్లకు పైగా జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది.[2]

20 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ మెట్రోపాలిటన్ ప్రాంతంలో తొమ్మిది నగరపాలక సంస్థలు, పదిహేను చిన్న పురపాలక సంఘాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ముంబై మహానగర అభివృద్ధి సంస్థ (ఎంఎంఆర్‌డిఎ) పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, రవాణా, గృహాల బాధ్యత నిర్వర్తించే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.

మెట్రోపాలిటన్ ప్రాంతంలో సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక, అభివృద్ధికి సంబంధించిన సమస్యలను అధిగమించి, పరిష్కరించడానికి ఈ ముంబై మహానగర అభివృద్ధి సంస్థ ఏర్పడింది. ముంబై, నవీ ముంబై వెలుపల ఉన్న ప్రాంతాలలో వ్యవస్థీకృత అభివృద్ధి జరగలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రణాళికాబద్ధమైన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిన ఈ నవీ ముంబైని మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగర, పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సిడ్కో) అభివృద్ధి చేసింది.

ముంబై పట్టణీకరణ వేగవంతంగా జరిగినందువల్ల ఈ ప్రాంతంలో అక్రమ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. భీవండి తాలూకాలోని మూడవ జాతీయ రహదిరి వెంట ఉన్న గ్రామాలలో (భారతదేశంలో అతిపెద్ద గిడ్డంగు ప్రాంతాలు) జరిగిన అవాంఛనీయ పరిణామాలు వీటికి ఉదాహరణలు చెప్పవచ్చు. పట్టణ ప్రణాళిక, ఠాణే జిల్లా కలెక్టర్ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ అసంఘటిత అభివృద్ధిని పరిష్కరించడంలో సమస్యలను ఎదుర్కొన్నాయి.

చరిత్ర[మార్చు]

మరాఠీయుల ఆరాధ్యదైవమయిన ముంబాదేవి పేరు మీదుగా ఈ పట్టణానికి 'ముంబై' అనే పేరు వచ్చింది. కాలాలకనుగుణంగా 'బాంబే', 'బొంబైమ్', 'బంబై' అనే పేర్లతో పిలువబడి 1995లో అధికారికంగా 'ముంబై'గా మర్చబడింది.[3]

భారతదేశపు పడమటిభాగంలో అరేబియన్ సముద్ర తీరంలో ఉల్హానదీ ముఖద్వారంలో ముంబై నగరం ఉంది. మహారాష్ట రాష్ట్రానికి చెందిన సాష్టా ద్వీపంలో అధిక భాగాన్ని ఆక్రమించుకొని వున్న ముంబై నగరం నగరమంతా సముద్ర మట్టానికి 10 నుండి 15 మీటర్ల ఎత్తుల మధ్యలో ఉంటుంది. ఉత్తర ముంబై నగరం కొండ ప్రాంతాలతో నిండి ఉంటుంది. నగరంలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఎత్తు 450 మీటర్లు. నగరం విస్తీర్ణం 603 కిలోమీటర్లు. 2001 జనాభా లెక్కల ననుసరించి ముంబై జనాభా 1,30,00,000. నగరపురాలలో నివసిస్థున్న ప్రజలను చేర్చుకుంటే ఈ సంఖ్య 1,60,00,000.

నగరపాలక సంస్థలు[మార్చు]

గేట్ వే ఆఫ్ ఇండియా
ఛత్రపతి శివాజీ టెర్మినల్
చర్చిగేట్ మెట్రో రైల్వే స్టేషను

ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ క్రింది నగరపాలక సంస్థలు ఉన్నాయి.[4]

 1. ముంబై
 2. ఠాణే
 3. కళ్యాణ్-డోంబివ్లి
 4. నవీ ముంబై
 5. పన్వెల్
 6. వసై-విరార్
 7. మీరా-భయందర్
 8. భీవండి-నిజాంపూర్
 9. ఉల్హాస్ నగర్
 10. అంబర్‌నాథ్
 11. బద్లాపూర్
 12. యురాన్
 13. అలీబాగ్
 14. పెన్
 15. మాథేరన్
 16. కర్జాత్
 17. ఖోపోలి
 18. పాల్ఘర్

జిల్లాలు[మార్చు]

 1. ముంబై నగరం (పూర్తి) [5]
 1. ముంబై పరిసరం (పూర్తి)
 2. ఠాణే (పాక్షిక)
 3. పాల్ఘర్ (పాక్షిక)
 4. రాయగడ్ (పాక్షిక)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Metropolitan region now covers Palghar, Vasai | Mumbai News - Times of India". The Times of India.
 2. "INDIA STATS: Million plus cities in India as per Census 2011". Press Information Bureau, Mumbai. National Informatics Centre (NIC). Archived from the original on 30 June 2015. Retrieved 4 October 2020.
 3. Sheppard, Samuel T (1917). Bombay Place-Names and Street-Names:An excursion into the by-ways of the history of Bombay City. Bombay, India: The Times Press. pp. pp 104–105. B0006FF5YU. {{cite book}}: |pages= has extra text (help)
 4. "Mumbai Metropolitan Region Development Authority – About MMR". mmrda.maharashtra.gov.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 డిసెంబర్ 2018. Retrieved 4 October 2020. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 5. "Mumbai metropolitan area" (in ఇటాలియన్). Projectsecoa.eu. Archived from the original on 6 October 2014. Retrieved 4 October 2020.

బాహ్య లంకెలు[మార్చు]