కథక్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.

చరిత్ర[మార్చు]

పూర్వకాలంలో కథకులు (కథను చెప్పే వాళ్ళు), పురాణాల నుంచీ ఇతిహాసాల నుంచీ కథలను వల్లె వేయడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. కథక్ ప్రారంభానికి ఇదే మొదలు. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది.

వేషధారణ[మార్చు]

ఈ నాట్యంలో ప్రసిద్ధి చెందినవారు.

  • దమయంతీ జోషీ
  • భారతీగుప్త
  • కుముదినీ గోపీకృష్ణ
  • సితారాదేవి
  • బిర్జూ మహరాజ్
  • బిందారిన్ మహరాజ్
  • ఉమాశర్మ. మొదలగువారు
"https://te.wikipedia.org/w/index.php?title=కథక్&oldid=2034864" నుండి వెలికితీశారు