Jump to content

రాయకంటి గోపాలరావు

వికీపీడియా నుండి
రాయకంటి గోపాలరావు
రాయకంటి గోపాలరావు
వ్యక్తిగత సమాచారం
జననం1938
హైదరాబాదు, తెలంగాణ
సంగీత శైలినృత్యం
వృత్తికథక్ నృత్యకారులు, నృత్య శిక్షకులు

రాయకంటి గోపాలరావు, తెలంగాణకు చెందిన ప్రముఖ కథక్ నృత్యకారులు, నృత్య శిక్షకులు.[1]

జననం, విద్య

[మార్చు]

గోపాలరావు 1938 తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తిచేసిన తర్వాత పెయింటింగ్, డ్రాయింగ్ కోర్సు చేయడానికి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరారు. ఆ తరువాత నటరాజ రామకృష్ణ మార్గదర్శకత్వంలో 1958లో హైదరాబాద్‌లోని సంగీత పాఠశాలలో కథక్ నృత్యాన్ని పూర్తిచేశారు. 1963లో అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయ మండలం నుండి నృత్య విశారద్‌లో ఉత్తీర్ణత సాధించారు.[1]

నాట్య ప్రస్థానం

[మార్చు]

భారత ప్రభుత్వ నేషనల్ స్కాలర్‌షిప్ కూడా అందుకున్నారు. ప్రస్తుతం కథక్ కళా కేంద్రంగా పిలువబడుతున్న న్యూఢిల్లీలోని భారతీయ కళా కేంద్రంలో పద్మశ్రీ శంబు మహారాజ్ శిష్యుడిగా రెండు సంవత్సరాల పాటు కథక్ నృత్యాన్ని నేర్చుకున్నారు. 1961లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతి ప్రారంభోత్సవంలో ప్రదర్శించిన బ్యాలెట్లలో పాల్గొన్నారు. 1963లో కళాప్రపూర్ణ డా. నటరాజ రామ కృష్ణ దర్శకత్వం వహించిన కుమార సంభవం అనే సంస్కృత బ్యాలెట్‌లో శివుడిగా అద్భుతమైన పాత్రను పోషించారు. 1974లో 'కథక్ కళాకేంద్ర' (ఢిల్లీ), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కూడా ఉపకారవేతనం అందుకున్నారు. కథక్ విభాగంలో ఉపకారవేతనం పొందిన మొదటి వ్యక్తి గోపాలరావు. కాళిదాస సమరోహ ఉజ్జయినిలో పాల్గొని స్వర్ణ కలశ రోలింగ్ ట్రోఫీని గెలుచుకున్నారు. 1975లో మరాఠీ బ్యాలెట్ ‘ప్రతిమ’ నాట్యాన్ని పూణే, ఢిల్లీ, బొంబాయిలలో ప్రదర్శన ఇచ్చారు. డా. సి. నారాయణరెడ్డి రాసిన కర్పూర వసంతరాయలు కావ్యం ఆధారంగా రూపొందించబడిన 'వసంత రాజ్యం' బ్యాలెట్‌కు దర్శకత్వం వహించి, నటించారు. గోల్కొండ కోటలో ప్రదర్శించిన ‘కులీ ఖుతుబ్ షా’ అనే ఉర్దూ నాటకంలో నటించారు.[1]

ఉద్యోగం

[మార్చు]

1976 నుండి 1992 వరకు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో కథక్ లెక్చరర్‌గా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 తెలంగాణలో నృత్యం. హైదరాబాదు: తెలంగాణ సంగీత నాటక అకాడమీ (తెలంగాణ ప్రభుత్వం). 2021. p. 180. ISBN 9788195226368. {{cite book}}: Cite uses deprecated parameter |authors= (help)