ఇతిహాసములు

వికీపీడియా నుండి
(ఇతిహాసం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అంటారు. "ఇతి-హాస" - అనగా "ఇలా జరిగిందని చెప్పడం " అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.

ప్రాచీన సంస్కృతవాఙ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు ఒక కోవకు చెందుతాయి. వేదాలలో చెప్పబడిన మౌలిక విషయాలకు ఇతిహాసాలు అనుబంధ గ్రంథాలని, వేదాలలో ఉన్న సిద్ధాంతాలకు వివరణ పురాణ ఇతిహాసాలలో వివరణ, సోదాహరణ లభిస్తుందని భావింపవచ్చును.

ఇతిహాసమంటే

[మార్చు]
ధర్మార్ధ కామ మోక్షాణాముపదేశ సమన్వితం
పూర్వావృత్త కథాయుక్త మితిహాసం ప్రచక్ష్యతే

ధర్మార్ధకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్ధములు, ఉపదేశములు, పూర్వవృత్తాంత కథలతో కూడినది ఇతిహాసము.

రామాయణం

[మార్చు]

సంస్కృతంలో "ఆదికవి"గా చెప్పబడుతున్న వాల్మీకి వ్రాసిన ఈ కావ్యం 24 వేల శ్లోకాలు కలిగి ఉంది. ఇందులో రాముడు అనే రాజకుమారుడు తండ్రిమాటకు కట్టుబడి భార్యతోను, తమ్మునితోను వనవాసానికి వెళ్ళడం, అక్కడ రాముని భార్య సీతను ఒక రాక్షసుడు హరించడం, వానరుడైన హనుమంతుడు , వానరసేన రామునికి అండగా ఉండడం, వారి సహకారంతో రాముడు ఆ రాక్షసుని జయించి తన భార్యను రక్షించుకోవడం ప్రధాన రామాయణ కథాంశం.

రామాయణంలో ధర్మనిరతి, ఉత్తమమైన వ్యక్తులు పాటించవలసిన నీతి ప్రధానంగా కనిపిస్తాయి. సేవకుడు ఎలా ప్రవర్తించాలి, కొడుకు ఎలా నడుచుకోవాలి, తమ్ముడు ఎలా నడచుకోవాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి - వంటి నియమాలు రామాయణంలో కథాపరంగా వివరింపబడినాయి.

మహాభారతం

[మార్చు]

వేదవ్యాసుడు వ్రాసినట్లుగా చెబుతున్న మహాభారతం పద్ధెనిమిది పర్వాల (విభాగాల) లక్ష శ్లోకాల ఉద్గ్రంధం. హస్తినాపురం అనే రాజ్యంలో అన్నదమ్ముల కొడుకులైన కౌరవులు, పాండవుల మధ్య రాజ్యాధికారం కోసం తలెత్తిన విభేదాలు, ఆ వివాదంలో కృష్ణుడు అనే యదువంశీకుడు పాండవుల పక్షాన ఉండి సహాయపడడం, ఇరు సేనల మధ్య మధ్య పెద్ద యుద్ధం జరుగడం, కృష్ణుని సహాయంతో పాండవులు విజయాన్ని కైవసం చేసుకోవడం మహాభారతకథ. అంతే కాకుండా ఏదో ఒకరూపంలో (గ్రంధంలో చెప్పినంత పెద్దయెత్తున కాకపోయినా గాని) మహాభారత యుద్ధం కురుక్షేత్రం వద్ద జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం.

మహాభారతంలో రాజనీతి, వ్యక్తుల ప్రవర్తన, ప్రతీకారం, యుద్ధ విధానాలు వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదట "జయం" అనే పదివేల శ్లోకాల కావ్యంగా మొదలైన ఈ కథ తరువాత లక్ష శ్లోకాల "మహాభారతం"గా రూపు దిద్దుకొన్నదని భావిస్తున్నారు. ఇంత పెద్ద కావ్యం గనుక ఇందులో అనేక ఉపాఖ్యానాలు, వాదాలు, సూక్తులు కలగలిపి ఉన్నాయి. ఇందులోని పాత్రల వ్యక్తిత్వాలలోను, ప్రవర్తనలోను ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. మహాభారతంలో లేనిది మరెక్కడా లేదని నానుడి. మహాభారతంలో ఒక భాగంగా ఉన్న 700 శ్లోకాల భగవద్గీత ఒక ప్రత్యేక గ్రంథంగాను, హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి గాను విశిష్టమైన స్థానం కలిగి ఉంది. హిందూమతానికి సంబంధించిన కొన్ని అతి మౌలికాంశాలు (ఆత్మ, ధర్మము, కర్మ, కర్మసిద్ధాంతము, భక్తి, జీవిత విధానము వంటివి) భగవద్గీతలో పొందుపరపబడి ఉన్నాయి.

ఇతర ఇతిహాసాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]