Jump to content

దానం

వికీపీడియా నుండి
(దానము నుండి దారిమార్పు చెందింది)
బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, రాజా రవివర్మ చిత్రం.

దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. దుస్తులు, బొమ్మలు, ఆహార పదార్ధాలు, వాహనాలు, పశువులు.

దాతృత్వం

[మార్చు]

ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.[1]

కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు కూడా దానమిస్తున్నారు. దీనిని అవయవ దానం (Organ donation) అంటారు.

అన్నదానం

[మార్చు]

ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

కన్యాదానం

[మార్చు]

కన్యాదానం:వివాహంలో పెళ్ళికూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధన వస్తు కనక వాహన దానంగా కూడా పేరుగాంచింది.

పురాణాలలో దానం

[మార్చు]
  • వైశాఖమాసం - దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
  • బలి చక్రవర్తి - మూడడుగులు విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
  • శిబి చక్రవర్తి - పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
  • కర్ణుడు - తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
  • ఏకలవ్యుడు - తన బొటనవేలును కోసి ఇచ్చాడు

అపాత్రదానం

[మార్చు]

ప్రధాన వ్యాసం అపాత్రదానం

మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు.

మూలాలు

[మార్చు]
  1. సాక్షి16.9.2010

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దానం&oldid=4306638" నుండి వెలికితీశారు