కన్యాదానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిందూ వివాహం-సౌగంధికా పరిణయం నుండి ఒక దృశ్యం

కన్యాదానం అనగా పెళ్ళిలోని అతిముఖ్యమైన కార్యక్రమం. పెళ్ళికూతురు తండ్రి తన కూతుర్ని వరునికి దానం ఇచ్చేది ఒక హిందూ సాంప్రదాయం. ఈ తంతులో అత్త మామలు కన్యకయైన తమ కుమార్తెను సాక్షాత్తు దైవ స్వరూపుడైన వరునికి ఇవ్వడం ద్వారా పాపములు హరించునని భావించును. కన్యాదానం ముఖ్యముగా - పురుషర్ధములైన ధర్మము, అర్ధము, కామము, మోక్షము కేవలం భార్య వద్దే దొరకునని చెప్పును. తద్వారా వరుడు తనును అత్త మామలు దైవంగా భావించారని, తన జీవితంలో వెలకట్టలేని అపురూపమైన బహుమతి తన భార్యేనని భావించుకొనును. వాస్తవానికి ఈనాటి స్త్రీవాదులు పొరబడినట్లుగా ఈ తంతులో ఎంత మాత్రమునూ పురుష ఆధిక్యత గాని, స్త్రీని ఒక నిర్జవమైన వస్తువుగా భావించబడటం గాని లేదు. భర్త విడిచిన స్త్రీలను, విధవరాండ్రును కన్యాదానముగా ఇవ్వరాదు. అన్ని దానములలో అతి శ్రేష్టమైన దానం కన్యాదానం.