Jump to content

తంత్ర శాస్త్రం

వికీపీడియా నుండి
(తంత్ర శాస్త్రము నుండి దారిమార్పు చెందింది)

తంత్ర అనే పదం రెండు సంస్కృత పదాల కలయిక ద్వారా ఏర్పడింది: తనోతి (విస్తరణ), త్రయతి (విముక్తి). తంత్ర అనగా శక్తి విముక్తి, స్థూల రూపం నుండి చైతన్యం విస్తరణ. ఇది మనస్సును విస్తరింపజేసి, నిద్రాణమైన అంతర్గత శక్తిని విముక్తి చేసే పద్ధతి. దీని సూత్రాలు అన్ని యోగ సాధనలకు ఆధారం. అందువల్ల, హిందూ తాంత్రిక గ్రంథాలు ఒక ఫలితాన్ని సాధించేందుకు అవసరమైన మెలకువలను సూచిస్తాయి.

తంత్ర శాస్త్రము శక్తి ఉపాసన శాస్త్రము. యొక్క ముఖ్య గమ్యము జీవబ్రహ్మైక్యం. ఉపనిషత్తులు సిద్ధంతమే ఇది.కాని ఉపనిషత్తులు ఎక్కువగా జ్ఞానమును ఆధారం చేసుకున్నవి. శక్తిని ఆధారం చేసుకున్నవి తంత్ర శాస్త్రములు. ఆత్మ జ్ఞాన గ్రంథాలు రహస్య గ్రంథాలన్నారు పెద్దలు.కనుక తంత్ర శాస్త్రమును రహస్య భాషలో వ్రాసారు.ఈభాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళయందు చీకటి, వెలుగులు రెండున్నట్లు, సంధ్యా భాషకు రెండర్ధాలున్నవి.తెలిసిన వారు చదివితే ఒక అర్ధం, తెలియని వారు చదివితే వేరొక అర్ధం. మహానిర్వాణ తంత్ర శాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడు.అని కొందరు అంటారు.వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మలను ఆదరించకూడదని బహిష్కించినవి.దీనివల్ల కలియుగంలో స్త్రీ శూద్రులు తంత్ర శాస్త్రమును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది.

తంత్రము -క్రాంతములు

[మార్చు]

తంత్ర శాస్త్రము సాధనా గ్రంథము. త్రంత్రమునకు ఉపాయము అని కూడా అర్ధమున్నది. దీని యందు ముఖ్య విషయములను వేదములనుండే తంత్ర శాస్త్రము తీసుకున్నది.ఆ తీసుకున్నదానిని విశదపరిచి వ్రాసింది. తను అనగా విస్తరించుట. తనువిస్తారే. త్ర అనగా తరింప జేయు జ్ఞానము.తరింపజేయు జ్ఞానమును విస్తరించి చెప్పినది తంత్ర శాస్త్రము.తంత్ర శాస్త్రములో శక్తి (స్త్రీ) ఆరాధ్యముఖ్యము. శ్రీ పూజ వేదములలో శ్రీసూక్తం మొదలైన వాటిలలో ఉంది. గాయత్రి కూడా స్త్రీయే.యజ్ఞములందు పశుబలులు, సోమపానములున్నవి. తంత్ర శాస్త్రములు దేశాచారములను అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈసంప్రదాయములు కల ప్రాంతములను క్రాంతములందురు.వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రాధాక్రాంతమంటారు.ఇక్కడ కాశ్మీరి సంప్రదాయం ఉంది.తూర్పున ఉన్న ప్రాంతమును విష్ణు క్రాంతము అంటారు.ఇక్కడ గౌడ (వంగ) సంప్రదాయం ఉంది. దక్షిణ దేశమును అశ్వ క్రాంతమందురు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.ఎవరి ఆచారవ్యవహారములను అనుసరించి ఆసాధనలు ప్రబలివి.వంగీయులు మత్స్య మాంస ప్రియులు-వీరు వాటిని విశేషముగా ఉపయోగించిరి.

హిందూ తంత్రాలు మొత్తం 92 గ్రంథాలు; వీటిలో 64[1][2][3] పూర్తిగా అభేద (వాచ్యంగా "భేదం లేనిది" లేదా ఏకేశ్వరోపాసన), వీటిని భైరవ తంత్రాలు లేదా కాశ్మీర్ శైవ తంత్రాలు అని పిలుస్తారు. 18 భేదాభేద (వాచ్యంగా "భేదంతో, భేదం లేకుండా" ఏకేశ్వరోపాసన లేదా ద్వైత), వీటిని రుద్ర తంత్రాలు అని పిలుస్తారు. 10 పూర్తిగా భేద (వాచ్యంగా "విభజించబడిన" లేదా ద్వైత), వీటిని శివ తంత్రాలు అని పిలుస్తారు. చివరి రెండింటిని (రుద్ర తంత్రాలు, శివ తంత్రాలు) శైవ సిద్ధాంతులు ఉపయోగిస్తారు. అందువల్ల వీటిని కొన్నిసార్లు శైవ సిద్ధాంత తంత్రాలు లేదా శైవ సిద్ధాంత ఆగమాలు అని పిలుస్తారు.

తంత్రాలు ప్రధానంగా రెండు రకాలు: ఆగమ, నిగమ. ఆగమాలు అంటే అమ్మవారు ప్రశ్నలు అడగగా దేవుడు సమాధానం చెప్పిన గ్రంథాలు. నిగమ గ్రంథాలలో, దేవుడు ప్రశ్నలు అడగగా అమ్మవారు సమాధానం చెబుతుంది. దేవుడు, అమ్మవార్ల మధ్య జరిగే ఈ సంభాషణ హిందూ తంత్ర విశిష్ట లక్షణం.

విధానములు-సాధనలు-భావనలు

[మార్చు]

తంత్ర పూజలు 5 విధానములు.ఇవి ఒక్కొక్క శక్తికి 5 రూపాలు.

  • 1 సూర్య
  • 2 గణపతి
  • 3 విష్ణు
  • 4 శివ
  • 5 శక్తి

సాధనలు- సాధకుని భావము-చతురతననుసరించి 4 విధానములు.

  • 1 పూజ
  • *2 జపం
  • *3 ధ్యానము
  • *4 బ్రహ్మత్వం.

సాధకుని భావనము 3.

  • 1 పశుభావం- లజ్జా మోహకామక్రోధాదులనే పాశములతో కట్టుబడి ఉన్నాయి. పశ్వాచారులు.
  • 2 వీరభావం- పశుబంధమును తెంచుకొని, జితేంద్రియుడైనవానిని వీరాచార్యులంటారు.
  • 3 దివ్యభావం- బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వానిని దివ్యాచార్యుడంటారు.

కులార్ణవ తంత్రము 7 రకాల ఆచారములను చెప్పింది. (1) - వేదాచారం- ఇది ఆచారములకు స్థూల దేహం వంటిది.బహిఃపూజలు చేయువిధానమిది.ఇది క్రియా మార్గము. (2) - వైష్ణవాచారము - ఇది భక్తి యోగము, హృదయ సాధన. (3) - శావాచారము - జపయోగము. (4) - దక్షిణాచారము - వీరు దక్షిణకాళికను పూజింతురు.వీరు గాయత్రిని ఉపాసింతురు. (5) - వామాచారము - గురువు వల్ల తంత్ర దీక్ష పొదాక దక్షిణాచార్యులు వామనాచార్యులగుదురు.వీరు వామనుని పూజింతురు.స్త్రీ వామపార్స్వంలో ఉండు. (6) - సిద్ధాంతాచారము - లజ్జాభయమోహములు వీరికి ఉండవు.వీరు శ్మశానంలో ఉందురు.యోగరహస్యములు తెలుసుకుంటు ఉందురు.అష్టాంగయోగమును సాధించి తురీయాచారమైన కాలాచారమునకు అర్హత పొందుతారు. (7) - కాలాచారము - ఇది భాక్మీభావం.ఇతనికి శాత్రువులు, మిత్రులు, లాభనష్టాలు అనేభావాలు ఉండవు. అన్నీ సమానమే.ఏకాంతంగా శ్మశానభూములందు ఉంటు నిర్వికల్పసమాధిస్థితిలో ఉందురు. ఇదే చివరి దశ.

యంత్ర, మంత్ర రహస్యాలు

[మార్చు]

సాంప్రదాయకంగా విగ్రహాలు లేదా చిహ్నాలు లేకుండా ఆరుబయట నిర్వహించే వేద క్రతువులకు భిన్నంగా, తాంత్రిక క్రతువు ఎక్కువగా దేవాలయాలు, విగ్రహాలకు సంబంధించినది. తంత్రాలు ఎక్కువగా ఆలయ నిర్మాణాలు, అందులోని విగ్రహాలు, లింగాల ప్రతిష్ఠాపన, నిర్వహణకు సంబంధించిన వివరణలు, నిర్దేశాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు అజిత మహాతంత్రం.[4]

తంత్ర సిద్ధికి సాధనలు మంత్రయంత్ర పూజలు (బహిర్ముఖమైనవి), హఠ, రాజయోగములు (అంతఃముఖమైనవి).మంత్రయంత్రములు శక్తిసమంవితములైనవి.మత్రము శబ్దబ్రహ్మమునుండి పుట్టింది.కనుక మంత్రము బ్రహ్మ శక్తి. దీనివల్ల అంతఃసాధనయైన కుండలినీశక్తి కలుగుతుంది.

మత్రము శబ్ద శక్తి. యంత్రము చిత్ర శక్తి. యంత్రము శరీరము. మత్రము ప్రాణము.యంత్రమందు మంత్రం చేర్చినప్పుడు జీవం కలదౌను.కామక్రోధాధులను నియంత్రణ చేయునది యంత్రము.మనన చేత తరింప జేయునది మంత్రము.యంత్ర మంత్రములు రెండును రహస్యముగా ఉంచదగినవే.యంత్రము సాంకేతిక శక్తి.శివునికి గాని, శక్తికిగాని త్రికోణము యాంత్రిక సంకేతము, 3 గీతలు ఒక్క ఆకారంగాచేసిన త్రికోణము.ఒక్క రూపంలో 3 వస్తువులున్నవి.ఒకడే 3 ఆకారములుగా ఉంది.అందుకే త్రికోణము ఆదిశక్తికి గాని, ఆది శంభునికి గాని సంకేతమైన యంత్రము.

శక్తి సమస్త ప్రపంచమునకు ఉత్పత్తి చేయుయోని.రెండు త్రికోణాకారాములను శివశక్తుల సంయోగముగా పరిగణింతురు.ప్రపంచ శబ్దములో, ప్ర అనగా వికసించుట పంచ అనగా 5 భూతములు.దీని అర్ధం పంచభూతముల వికాసమే ప్రపంచము.బీజమైన బిందువునకు శివశక్తుల సంయోగము ప్రధానకారణము.

ఆది శివుని సంకేతమైన త్రికోణాకారము మీద శాక్తి సంకేతమైన త్రికోణాకారమును తలక్రిందులుగా ఉంచెదరు.ఇప్పుడు శక్తిసంకేతమైన రెండు త్రికోణాకారములు యోని అంటారు.ఇదే సృష్టి క్రీడ. తంత్ర శాస్త్రము దీనిని సదాశివ అంటుంది.మంత్ర శాస్త్రము రంభం అంటుంది.

తంత్ర శాస్త్రము ప్రకారము బ్రహ్మకు రెండు కళలు. (1) సా కళ (2) నిష్కళ. బ్రహ్మ మూల ప్రకృతిలో కలిసినప్పుడు సాకళ అప్పుడు ప్రకృతి గర్భమందు బీజోత్పత్తియౌను, అప్పుడు ఒక స్పందనం ఏర్పడును.ఈ స్పందనమే నాదం.నాదం నుండి బిందువు ఏర్పడును.నాదమునకు సంకేతము వంటి బాలచంద్రాకారము.

కలవక ఉన్నప్పుడు నిష్కళ.

ఆదియందు పరమేశ్వరుడు ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్క తంత్ర శాస్త్రం చొప్పున 64 తంత్ర శాస్త్రములను చెప్పాడు.కామ్యములన్నింటిని పొందుటకు 64 తంత్రములను పూజించవలసివచ్చింది.ఇది కష్టమైన కార్యము.కనుక పరమేశ్వరుని సులభమార్గం చూపించమని ప్రార్థించారు.దీని పర్యవసానంగా పరమేశ్వరుడు శ్రీ విద్యోపాసనను ప్రసాదించాడు.శృఈ విద్యోపాసనలో 12 సంప్రదాయములున్నవి.

గ్రంథాలు

[మార్చు]

తాంత్రిక గ్రంథాలు సాధారణంగా ఒక నిర్దిష్ట సంప్రదాయం, దేవతతో ముడిపడి ఉంటాయి. తాంత్రిక సాహిత్య రకాలు: తంత్ర, ఆగమ, సంహిత, సూత్ర, ఉపనిషత్, పురాణ, టీక (వ్యాఖ్యానాలు), ప్రకరణ, పద్ధతి గ్రంథాలు, స్తోత్రం, కవచ, నిఘంటు, కోశ, హజియోగ్రాఫికల్ (పుణ్యపురుషుల చరిత్ర) సాహిత్యం. ఇవి సంస్కృతం, ప్రాంతీయ భాషలలో రాయబడ్డాయి. కొన్ని ముఖ్యమైన ఉదాహరణ గ్రంథాలతో కూడిన ప్రధాన తాంత్రిక సంప్రదాయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:[5]

  • శైవ – సదాశివ (శివాగమ), వామ లేదా తుంబురు, దక్షిణ లేదా భైరవ
    • కులార్ణవ తంత్రం
    • అమృతేశ తంత్ర లేదా నేత్ర తంత్రం
    • నేత్రజ్ఞానార్ణవ తంత్రం
    • నిఃశ్వాసతత్వసంహిత
    • కాలోత్తారా తంత్రం
    • సర్వజ్ఞానోత్తారా
    • శైవాగమాలు
    • రౌద్రాగమాలు
    • భైరవాగమాలు
    • వామ ఆగమాలు
    • దక్షిణాగమాలు
  • శివశక్తి సంప్రదాయాలు – యామల (భైరవ సంప్రదాయంలో భాగం కూడా)
    • బ్రహ్మ యామల
    • రుద్రయామల
    • స్కంద యామల
    • విష్ణు యామల
    • యమ యామల
    • వాయు యామల
    • కుబేర యామల
    • ఇంద్ర యామల
హిందూ దేవత కాళీ తాంత్రిక రూపం. నేపాల్ ఐకానోగ్రఫీ పుస్తకం నుండి ఒక పేజీ, 17వ శతాబ్దం.
  • శాక్తేయకాళీ సంప్రదాయాలు (కాళీ, కాళీ విష్ణు, కామాఖ్య/కుబ్జిక, తారా, ఇతరులు), శ్రీకుల సంప్రదాయం
    • వారాహి తంత్రం
    • శాక్త ఆగమాలు
    • ముండమాల తంత్రం
    • తోడల తంత్రం
    • చాముండ తంత్రం
    • దేవీయామల
    • మాధవకుల
    • యోనిగహవర,
    • కాళీకులార్ణవ తంత్రం
    • కంకాలమాలినీ తంత్రం
    • ఝంకారకరవీర,
    • మహాకాల సంహిత
    • కాళీ తంత్రం
    • కాలజ్ఞాన తంత్రం
    • కుమారీ తంత్రం
    • సిద్ధలహరీ తంత్రం
    • నిరుత్తారా తంత్రం
    • కాళీవిలాస తంత్రం
    • ఉత్పత్తి తంత్రం
    • కామధేను తంత్రం
    • నిర్వాణ తంత్రం
    • కామాఖ్య తంత్రం
    • తారా తంత్రం
    • కౌల తంత్రం
    • మత్స్య సూక్త / తారా కల్ప
    • సమయా తంత్రం
    • వామకేశ్వర తంత్రం
    • తంత్రజా తంత్రం
    • యోగిని తంత్రం
  • కౌల - కౌలమార్గం , ఇతర తంత్రాలు
    • కులార్ణవ తంత్రం
    • మహానిర్వాణ తంత్రం
    • కులచూడామణి తంత్రం
    • గుప్తసాధన తంత్రం
    • మాతృకాభేద తంత్రం
  • వైష్ణవవైఖానస, పాంచరాత్ర, కృష్ణ, రాముల భక్తి-ఆధారిత తంత్రాలు
    • పాంచరాత్ర సంహిత గ్రంథాలు
    • అహిర్బుధ్న్య సంహిత
    • జయాఖ్య సంహిత
    • పారమేశ్వర సంహిత
    • పౌష్కర సంహిత
    • పాద్మ సంహిత
    • నారదీయ సంహిత
    • హంసపరమేశ్వర సంహిత
    • లక్ష్మీ తంత్రం
    • వైహాయస సంహిత
    • శ్రీకాలప్ర సంహిత
    • వైఖానస ఆగమాలు
    • గౌతమీయ తంత్రం
    • బృహద్బ్రహ్మ సంహిత
    • మాహేశ్వర తంత్రం
    • సాత్వత తంత్రం
    • రాధా తంత్రం
    • అగస్త్య సంహిత, దాశరథీయ తంత్రం
    • ఈశాన సంహిత, ఊర్ధ్వామ్నాయ సంహిత
  • మంత్ర-శాస్త్ర - మంత్రాలు, మంత్ర శబ్ద అధిభౌతిక శాస్త్రం, సంబంధిత ఆచరణలు, క్రతువులపై పాఠ్యపుస్తకాలు
    • ప్రపంచసార తంత్రం, దాని వ్యాఖ్యానాలు, టీకాలు
    • లక్ష్మణ దేశికేంద్ర రచించిన శారదాతీలక తంత్రం
    • పరమహంస పూర్ణప్రకాశ రచించిన మంత్రముక్తావళి
    • మహీధర రచించిన మంత్రమహోదధి
    • విష్ణుదేవ రచించిన మంత్రదేవప్రకాశిక
    • కమలాకర భట్ట రచించిన మంత్రకమలాకర
    • యదునాథ చక్రవర్తిన్ రచించిన మంత్రరత్నాకర
    • మాధవ రాయ వైద్య రచించిన మంత్రమహార్ణవ
    • కృష్ణానంద ఆగమవాగీశ రచించిన తంత్రసార
  • నిబంధ - ఆచార ఆరాధన, సాధన, పూజపై చేతిపుస్తకాలు
    • శక్తినాథ కళ్యాణకర రచించిన క్రియాకల్పతరు
    • జ్ఞానానందగిరి పరమహంస రచించిన కౌలావలీనిర్ణయ
    • బ్రహ్మానంద గిరి రచించిన శాక్తానందతరంగిణి
    • పూర్ణానంద రచించిన శాక్తక్రమ
    • పూర్ణానంద రచించిన శ్రీతత్వచింతామణి
    • గోవింద రచించిన ఆగమకల్పద్రుమ
    • యదునాథ రచించిన ఆగమకల్పలతిక
    • రఘునాథ తర్కవాగీశ ఆగమతత్వవిలాస, రామకృష్ణ ఆగమచంద్రిక
    • నవమీసింహ రచించిన తంత్రచింతామణి
    • రామతోషణ విద్యాలంకార రచించిన ప్రాణతోషిణి
    • శివరహస్య
    • శైవకల్పద్రుమ
  • గాణపత్య తంత్రాలు
  • ఇతరాలు – అతీంద్రియ, రసాయన శాస్త్రం, జ్యోతిష్యం, రసవాదం, మొదలైనవి.
హిందూ తాంత్రిక చిత్రలేఖనం. ఇండియా, పహారీ, సుమారు 1780-1800. పై నుండి కిందకు: శివుడు, శక్తి, శంఖంతో విష్ణువు, నాభి నుండి ఉద్భవిస్తున్న బ్రహ్మ, లక్ష్మి. కింద హరిహర, నాలుగు తలల బ్రహ్మ. అట్టడుగున త్రిమూర్తులు. అన్నీ ఓం అనే బీజాక్షర ఆకారంలో బంగారు నేపధ్యంలో చిత్రించబడ్డాయి.

పలువురు తంత్ర శాస్త్ర ఉపాసకులు

[మార్చు]

పుస్తక మూలము

[మార్చు]
  • 1960 భారతి మాస పత్రిక.

ఉదహరించిన రచనలు

[మార్చు]
  • Flood, Gavin D. (1996). An Introduction to Hinduism.మూస:Incomplete citation
  • Wallis, Christopher (2013). Tantra Illuminated: The Philosophy, History, and Practice of a Timeless Tradition. Mattamayura Press. ISBN 978-0-9897613-0-7.

మరింత చదవడానికి

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sanderson, Alexis (1994). The Śaiva Literature. Routledge.
  2. "Tantra Yoga Explained – History and Philosophy". FITSRI. November 2025. Retrieved 28 November 2025.
  3. "64Tantras". Archived from the original on 2015-08-11. Retrieved 2015-08-26.
  4. Ajita_Mahatantra 1–18 Ajita_Mahatantra,_19-35 Ajita_Mahatantra,_36-66 Ajita_Mahatantra,_67-89
  5. Mukhopadhyay, Subhodeep (August 26, 2016). "Demystifying Tantra-III: Śaiva and Vaiṣṇava Tantras". Indiafacts.org.