ఉపనిషత్తు
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు.
ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి
- సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు
- బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.
- అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.
- ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.
వ్యుత్పత్తి
[మార్చు]- ఉప +ని + షత్
- ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట
- ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంథాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 10 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.
- ఉపనిషత్తులు అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి, వారి పేరు మీద చేయబడ్డాయి: అవి యాజ్ఞవల్క, ఉద్దాలక, అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద, సనత్కుమార పేరు మీద ఉన్నాయి. గార్గి, యాజ్ఞవల్క భార్య మైత్రేయి మొదలైన మహిళల పేరు మీద కూడా ఉన్నాయి.
- మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు, దారా షిఖ్, 1657 లో. పెర్షియన్ భాష లోకి 50 ఉపనిషత్తులు అనువాదం చేయడము జరిగింది.
- ఉపనిషత్తులులో ఎక్కువగా బ్రాహ్మణాలు, అరణ్యకములు యొక్క ముగింపు భాగం లోనివి.
- భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములును ప్రస్థానత్రయం అంటారు.
అర్థము
[మార్చు]- వేదాల చివరి బాగాలు. గ్రంథ ప్రతిపాద్యమగు విద్య అని శ్రుతి వచనం. బ్రహ్మవిద్య అని కూడా ఉపనిషత్తులకు మరో పేరు. ఇది ద్వివిధం. 1. పరావిద్య, 2. అపరా విద్య.
ఉపనిషత్తుల విభాగాలు
[మార్చు]- ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.
- శైవ, వైష్ణవ వర్గాల వారు తమవిగా భావించే ఉపనిషత్ వర్గీకరణ ఒకటి ఉంది.[ఆధారం చూపాలి]
- శైవులు తమవని భావించే ఉపనిషత్తులు పదిహేను ఉన్నాయి: 1. అక్షమాలికోపనిషత్తు, 2. అథర్వ శిరోపనిషత్తు, 3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయో పనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు.[ఆధారం చూపాలి]
- వైష్ణవులు తమవిగా చెప్పే పదునాలుగు ఉపనిషత్తులు: 1. అవ్యక్తోప నిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోప నిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్వి భూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయో పనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామ తాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.[ఆధారం చూపాలి]
- సన్యాసానికి సంబంధించిన లక్షణాలను, విధి విధానాలను తెలియజేసే 17 ఉపనిషత్తులను సన్యాసోపనిషత్తులని వర్గీకరించారు. అవి: 1. అరుణికోపనిషత్తు, 2. అవధూతోపనిషత్తు, 3. కఠశ్రుత్యుపనిషత్తు, 4. కుండినోపనిషత్తు, 5. జాబాలోపనిషత్తు, 6. తురీయాతీత అవధూతోపనిషత్తు, 7. నారద పరివ్రాజకో పనిషత్తు, 8. నిర్వాణోపనిషత్తు, 9. పరబ్రహ్మోపనిషత్తు, 10. పరమహంస పరివ్రాజకోపనిషత్తు, 11. పరమహంసో పనిషత్తు, 12. బ్రహ్మోపనిషత్తు, 13. భిక్షుక ఉపనిషత్తు, 14. మైత్రేయ ఉపనిషత్తు, 15. యాజ్ఞవల్క్య ఉపనిషత్తు, 16. శాట్యాయన ఉపనిషత్తు, 17. సన్యాసో పనిషత్తు.
ఉపనిషత్తుల సంఖ్య
[మార్చు]ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్నకు అందరినీ సంతృప్తిపరచే సమాధానం లేదు. శంకరుడు వ్యాఖ్యానించిన ఈశకేనాది పది ఉపనిషత్తులే బహుళ ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ తరచు మరికొన్ని ఉపనిషత్తుల ప్రస్తావన విన వస్తుంటుంది. ముక్తికోపనిషత్తు 108 ఉపనిషత్తులను ప్రస్తావిస్తున్నది. ఒక్కొక విశ్వాసం వారు ఒక్కొక్క విధంగా ఉప నిషత్తులను తమకు అనుకూలంగా ఉదహరిస్తున్నారు. ప్రామాణికంగా చెప్పడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు జాబాలి పేరు అనేక విధాలుగా ఉపనిషత్తుల పట్టికలో దర్శనమిస్తుంది. ఏమైనప్పటికీ, వైదిక వాఙ్మయంలో ఉపనిషత్తుల స్థానం విశిష్టమైనది. ఉపనిషత్తు అనే పదానికి సవిూపానికి తీసుకునిపోవడం అనే అర్థం ఉన్నదనీ, మనిషి తన పరిమితమైన చైతన్యాన్ని, ప్రజ్ఞను బ్రహ్మ చైతన్యంతో, ప్రజ్ఞతో అనుసంధానం చేసి పరిమితత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య అంటారు. ఒక్కోవేదానికి ఉపనిషత్తుల సంఖ్య ఇలా ఉంది
- ఋగ్వేదానికి సంబంధించినవి - 10
- కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి - 32
- శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి - 19
- సామవేదానికి సంబంధించినవి - 16
- అధర్వణ వేదానికి సంబంధించినవి - 31 (మొత్తం - 108)
ముఖ్య ఉపనిషత్తులు
[మార్చు]- మొత్తం 108 ఉపనిషత్తులలో ప్రధానంగా 10 ఉపనిషత్తులను దశోపనిషత్తులుగా వ్యవహరిస్తున్నారు. అవి:
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) 2. కేనోపనిషత్తు 3. కఠోపనిషత్తు 14. బ్రహ్మోపనిషత్తు 15. కైవల్యోపనిషత్తు 16. జాబలోపనిషత్తు 17. హంసోపనిషత్తు 18. ఆరుణికోపనిషత్తు 19. గర్భోపనిషత్తు 20. నారాయణోపనిషత్తు 21. పరమహంస ఉపనిషత్తు 23. అమృతనాదోపనిషత్తు |
28. కళాగ్నిరుద్రోపనిషత్తు 29. మైత్రేయోపనిషత్తు 30. సుబాలోపనిషత్తు 31. క్షురికోపనిషత్తు 32. మంత్రికోపనిషత్తు 33. సర్వసారోపనిషత్తు 34. నిరలాంబోపనిషత్తు 35. శుకరహాస్యోపనిషత్తు 36. వజ్రసూచ్యుపనిషత్తు 37. తేజోబిందూపనిషత్తు 38. నృసిందబిందూపనిషత్తు 39. ధ్యానబిందూపనిషత్తు 40. బ్రహ్మవిద్యోపనిషత్తు 41. యోగతత్వోపనిషత్తు 42. ఆత్మబోధోపనిషత్తు 43. నారదపరివ్రాజకోపనిషత్తు 44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు 45. సీతోపనిషత్తు 46. యోగచూడామణ్యుపనిషత్తు 47. నిర్వాణోపనిషత్తు 48. మండల బ్రాహ్మణోపనిషత్తు 49. దక్షిణామూర్త్యుపనిషత్తు 50. శరభోపనిషత్తు 51. స్కందోపనిషత్తు 52 మహానారాయణోపనిషత్తు 53. అద్వయతారకోపనిషత్తు 54. రామరహస్యోపనిషత్తు
|
55. రామతాపిన్యుపనిషత్తు 56. వాసుదేవోపనిషత్తు 57. ముద్గలోపనిషత్తు 58. శాండిల్యోపనిషత్తు 59. పైంగలోపనిషత్తు 60. భిక్షుకోపనిషత్తు 61. మహోపనిషత్తు 62. శారీరకోపనిషత్తు 63. యోగశిఖోపనిషత్తు 64. తురియాతీతోపనిషత్తు 65. సన్యాసోపనిషత్తు 66. పరమహంస పరివ్రాజకోపనిషత్తు 67. అక్షమాలికోపనిషత్తు 68. అవ్యక్తోపనిషత్తు 69. ఏకాక్షరోపనిషత్తు 70. అన్నపూర్ణోపనిషత్తు 71. సూర్యోపనిషత్తు 72. అక్ష్యుపనిషత్తు 73. అధ్యాత్మోపనిషత్తు 74. కుండికోపనిషత్తు 75. సావిత్ర్యుపనిషత్తు 76. ఆత్మోపనిషత్తు 77. పశుపతబ్రహ్మోపనిషత్తు 78. పరబ్రహ్మోపనిషత్తు 79. అవధూతోపనిషత్తు 80. త్రిపురతాపిన్యుపనిషత్తు 81. శ్రీదేవ్యుపనిషత్తు
|
82. త్రిపురోపనిషత్తు 83. కఠరుద్రోపనిషత్తు 84. భావనోపనిషత్తు 85. రుద్రహృదయోపనిషత్తు 86. యోగకుండల్యుపనిషత్తు 87. భస్మజాబలోపనిషత్తు 88. రుద్రాక్షజాబలోపనిషత్తు 89. గణపత్యుపనిషత్తు 90. దర్శనోపనిషత్తు 91. తారాసారోపనిషత్తు 92. మహావాక్యోపనిషత్తు 93. పంచబ్రహ్మోపనిషత్తు 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు 95. గోపాలతాపిన్యుపనిషత్తు 96. కృష్ణోపనిషత్తు 97. యాజ్ఞవల్క్యోపనిషత్తు 98. వరాహోపనిషత్తు 99. శాట్యానీయోపనిషత్తు 100. హయగ్రీవోపనిషత్తు 101. దత్తాత్రేయోపనిషత్తు 102. గరుడోపనిషత్తు 103. కలిసంతారణోపనిషత్తు 104. బాల్యుపనిషత్తు 105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు 107. భహ్వృచోపనిషత్తు 108. ముక్తికోపనిషత్తు
|
- దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:
ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా |
ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ
[మార్చు]- దీనిని మనం 2600 నుండి 3400 సంవత్సరాల క్రితం వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి.
- వేదములవలె ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి.
- ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.
- ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ, పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.
- భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును శంకరాచార్యుడు, ద్వైతమును మధ్వాచార్యుడు తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు.
- అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.
కొత్త ఉపనిషత్తులు
[మార్చు]- పైన 108 ఉపనిషత్తులని తెలిపినప్పటికీ కొత్త ఉపనిషత్తుల రచన జరుగుతూనే ఉంది. ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అప్పటికే ఉన్న ఉపనిషత్తులు కొత్త సిద్ధాంతంతో విభేదించిన సందర్భాలలో, సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 వ సంవత్సరములో డా. ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి: బష్కళ, ఛాగలేయ, ఆర్షేయ, శౌనక ఉపనిషత్తులు.
- కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది.
- ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూక్ 1805 లో రచించడం జరిగింది.
వేదాంతం
[మార్చు]లక్ష్యం | ఆత్మ సాక్షాత్కారము |
గురువుల స్థానం | చాలా ఉన్నత స్థితిలో ఉండేది |
బోధనా పద్ధతులు | శ్రవణం, మననం, నిధిధ్యాస (అనుభవం) |
వర్ణము (కులము అనరాదు) | ద్విజులకు (అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు) వేద పఠనమునకు ఆర్హత కల్పించ బడింది. కానీ వేదాంత పఠనమునకు ఎట్టి నిషిద్ధము విధించలేదు. అనగా అన్ని వర్ణములవారు దీన్ని అభ్యసించవచ్చు. |
స్త్రీ విద్య | కొంత మంది స్త్రీ గురువులు గురించిన సమాచారం కలదు |
బయటి లింకులు
[మార్చు]- హిందూ ధర్మశాస్రాలు రాధాకృష్ణ
- Devanagari text in Wikisource
- GRETIL
- Sri Aurobindo, The Upanishads [1]. Sri Aurobindo Ashram, Pondicherry. 1972.
'అనువాదాలు
[మార్చు]- The Upanishads Translated and Commentated by Swami Paramananda From the Original Sanskrit Text
- English translation of 108 Upanishads
- 11 principal Upanishads with translations
- Translations and Essays on the Upanishads at Hinduwebsite.com
- Upanishads at Sanskrit Documents Site
- Upanishad page from hindunet.org
- Translations of principal Upanishads at sankaracharya.org
- English translations of major Upanishads.
- Upanishads Vedanta Treatises in Hinduism
- Ishopanishad The complete text, with transliteration, word-for-word meanings, and commentary
- Sri Aurobindo, The Upanishads [2]. Sri Aurobindo Ashram, Pondicherry. 1972.
- Shweta-shwatrupanishad Bhashya, by Pandit Raghunath Vinayak Dhulekar
- Prashnapanishad Saral Bhashya, by Pandit Raghunath Vinayak Dhulekar
- Kathopnishad Saral Bhasyha, by Pandit Raghunath Vinayak Dhulekar
వ్యాఖ్యలు, వివరణలు, ఇతర లింకులు
[మార్చు]- HinduWiki.Com - A collaborated wiki web site covering all aspects of Hinduism.
- Overview of 18 Upanisads; 108 main Upanisads
- Vaishnava explanation of Upanisads, list of Vaishnava commentaries
- The Upanishads (www.advaita-vedanta.org)
- Selections from the Upanishads
- Essence of Upanishads
- Weekly podcast on Vedic Chanting, Mantras, Vedic Mythology and stories from the Puranas
- Sacred-Texts (www.sacred-texts.com)
- The One and the Many: A Fundamental Philosophical Problem in the Prinicipal Upanishads by Georg Feuerstein, JOY: The Journal of Yoga, September 2002, Volume 1, Number 1