చతుర్వ్యూహములు
Appearance
శ్రీ వైష్ణవ సిద్ధాంతము ప్రకారము భగవంతుడు నాలుగు వ్యూహములలో వ్యక్తమగును.
- ప్రద్యుమ్న వ్యూహము
- ఈ రూపము ఐశ్వర్య, వీర్య సంపన్నము. మనస్సునకు ప్రతీక.సృష్టి కార్యమును నిర్వర్తించును. ప్ర-ద్యుమ్న- అనగా అమితముగా వీర్యము గలవాడు.
- అనిరుద్ధ వ్యూహము
- ఈయన శక్తి, తేజస్సు గుణములు ప్రధానముగా గలవాడు. అహంకారమునకు ప్రతీక. స్థితి కార్యమును నెరపు సంరక్షకుడు. అ-నిరుద్ధ - అనగా ఆపజాలని వాడు. ఆయన రక్షణలో నున్నవారికి ఇంక భయము వలదు.
- సంకర్షణ వ్యూహము
- జ్ఙాన, బల గుణములు ప్రధాన లక్షణములుగా గలవాడు. జీవునకు ప్రతీక. లయ కార్యమును నిర్వహించువాడు. సమస్తమును ఆకర్షించి తనయందు లీనమొనర్చుకొనును.
- వాసుదేవ వ్యూహము
ప్రార్థన:
- నమస్తే వాసుదేవాయ నమఃసంకర్షణాయచ
- ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః