Jump to content

అష్టనాగములు (పాములు)

వికీపీడియా నుండి

అష్టనాగములు (పాములు):

Indian snakes (Plate XVII) BHL4390581

మహాభారతము నందు ఉపోద్ఘాతము ముగింపబడిన వెనుక ఈనాగులచరిత్ర మొదట చెప్పబడినది. కశ్యపుడను నార్యునకు కద్రువ, వినతయను నిరువురు భార్యలుగలరు. వీరిరువును తోబుట్టువులు. వీరికింగల యభిమతంబుల చొప్పున కద్రువకు సహస్రనాగములు జనించినవి. వినతకు గరుడుడు జన్మించెను. కద్రువకు జనించిన సహస్రనాగములకు బుట్టిన సంతతియే లోకమునందలి నాగకులముగానున్నది. ఈ నాగులలో బ్రముఖముగా నుండినవారు శేషుడు, వాసుకి, ఇరావంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, కాళీయుడు, ఐలుడు, ఇలాపాత్రుడు, నీలుడు, అనీలుడు, నహుషుడు మొదలగువారు. (అనంతుడు, వాసుకి, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు వీరినే అష్టనాగములు అని మన గ్రంథములు పేర్కొనుచున్నవి.) కద్రువ వినతకు జేసిన యపకారమునుబట్టి వినతకు బుట్టిన గరుత్మంతుడు నాగకులమునకెల్లను వైరియయ్యెను. దీనికిదోడు మాతృశాపముగూడ నాగులకు సంభవించెను.

  1. వాసుకి
  2. అనంతుడు
  3. తక్షకుడు
  4. శంఖపాలుడు
  5. కుశికుడు
  6. పద్ముడు
  7. మహాపద్ముడు
  8. కర్కోటకుడు