దశ-అవస్థలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దశవిధ అవస్థలలో భాగంగా మానవ జీవన దశలు
  1. (అ.) 1. దీప్తి, 2. శాంతి, 3. మోదము, 4. స్వాస్థ్యము, 5. శక్తి, 6. పీడ, 7. దైన్యము, 8. వైకల్యము, 9. ఖలత్వము, 10. భీతి [ఇవి గ్రహముల అవస్థలు].
  2. "దీప్తః శాంతో ముదితః స్వస్థః శక్తోః ప్రపీడితో దీనః, వికలః ఖలశ్చ భీతః ఏవం దశ గ్రహావస్థాః"
  3. (ఆ.) 1. ఇచ్ఛ, 2. ఉత్కంఠ, 3. అభిలాష, 4. చింత, 5. స్మృతి, 6. గుణ స్తుతి, 7. ఉద్వేగము, 8. ప్రలాపము, 9. ఉన్మాదము, 10. వ్యాధి.
  4. (ఇ.) 1. దృష్టిసంగము, 2. మనస్సంగము, 3. సంకల్పము, 4. జాగరము, 5. కృశత్వము, 6. అరతి, 7. హ్రీత్యాగము, 8. ఉన్మాదము, 9. మూర్ఛ, 10. మరణోద్యోగము [ఇవి మన్మథావస్థలు].

"దృఙ్మనస్సంగసంకల్పా జాగరః కృశతారతిః, హ్రీత్యాగోన్మాద మూర్ఛాంతా ఇత్యనంగదశా దశ"

  1. (ఈ.) 1. గర్భవాసము, 2. జన్మము, 3. బాల్యము, 4. కౌమారము, 5. పౌగండము, 6. యౌవనము, 7. స్థవిరత్వము, 8. జర, 9. ప్రాణరోధము, 10. నాశము [ఇవి జీవుని దశలు].
  2. (ఉ.) 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. చిత్తభ్రమ, 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].