అష్టాదశసిద్ధులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టాదశసిద్ధులు అనగా పద్దెనిమిది రకాల సిద్ధులు. ఇవి మార్కండేయ పురాణములో పేర్కొనబడడ్డాయి.[1] భారతీయ తత్వ శాస్త్రంలో "సిద్ధి" అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. అప్పుడు అతనికి సిద్ధించే శక్తులే ‘సిద్ధులు’. సాంఖ్యం, భాగవతం, బౌద్ధం ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా నిర్వచిస్తున్నప్పటికీ, ప్రచారంలో ఉన్నది మాత్రం అష్టసిద్ధులే.

ఎనిమిది అణిమాది సిద్ధులు, పది గౌణ సిద్ధులను కలిపి అష్టాదశసిద్ధులు అంటారు.[2]

అష్టాదశసిద్ధులు[మార్చు]

  1. అణిమ: శరీరాన్ని సూక్ష్మ రూపంలోకి మార్చుకోగలగడం.
  2. లఘిమ: శరీరాన్ని తేలికగా మార్చుకోగలగడం.
  3. ప్రాప్తి: శూన్యం నుంచి కావలసిన వస్తువును సాధించడం.
  4. ప్రాకామ్యము: కోరుకున్నది సాధించడం.
  5. మహిమ: శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోగలగడం.
  6. ఈశిత్వము: అష్టదిక్పాలకులపై ఆధిపత్యం.
  7. వశిత్వము: సకల జీవరాశులను వశం చేసుకోగలగడం.
  8. సర్వకామానసాయిత: కోరిన రూపము ధరించగలగడం.
  9. సర్వజ్ఞత్వము
  10. దూరశ్రవణము: దూర ప్రదేశములందున్న దృశ్యములను దర్శించగలగడం.
  11. పరకాయ ప్రవేశము: అన్య దేహముల ప్రవేశించగలగడం
  12. వాక్సిద్ధి
  13. కల్పవృక్షత్వము
  14. సృష్టి
  15. సంహారకరణ సామర్థ్యము
  16. అమరత్వము: కోరినప్పుడు దేహమును త్యజించగలగడం
  17. సర్వన్యాయకత్వము
  18. భావన
  19. సిద్ధి

మూలాలు[మార్చు]

  1. "నవరాత్రుల ప్రత్యేకం : సిద్ధిదాత్రి". telugu.oneindia. 2016-10-14. Archived from the original on 2016-10-18. Retrieved 2022-11-03.
  2. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.