ఘనరాగ పంచరత్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచరత్నాల రచయిత త్యాగరాజస్వామి

పంచరత్న కృతులు: కర్నాట సంగీతంలోని ఐదు కృతుల సమూహాన్ని పంచరత్న కృతులు అంటారు. చాలామంది వాగ్గేయకారులు ఈ "పంచరత్న కృతులు" పేరుతో కృతులను రచించినారు. వాటిలో త్యాగరాజు తెలుగులో రచించినవి చాలా ప్రాముఖ్యం పొందినాయి. వీటిని ఘనరాగ పంచరత్నాలు అంటారు. అవి

  1. జగదానంద కారక - నాట రాగం
  2. దుడుకు గల - గౌళ రాగం
  3. సాధించెనే - అరభి రాగం
  4. కనకన రుచిర - వరాళి రాగం
  5. ఎందరో మహానుభావులు - శ్రీ రాగం

ఇంకా కోవూరు పంచరత్నాలు, శ్రీరంగం పంచరత్నాలు, లాల్ గుడి పంచరత్నాలు వంటివి ఉన్నాయి. కాని కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ఈ ఘనరాగ పంచరత్నాలకు ప్రత్యేకస్థానం ఉంది. వాగ్గేయకారుని ప్రతిభ, పురాణాలలోని భక్తి, నీతి, వైరాగ్యము వీటిలో పొందుపరచబడ్డాయి. దేశ విదేశాలలోని త్యాగరాజ ఆరాధనోత్సవాలలో అంతా కలసి ఈ కీర్తనలను ఆలాపించడం ఒక ఆనవాయితీ. త్యాగయ్య శిష్యుల ద్వారా వాటి బాణీలు ఈనాటికీ చెక్కు చెదరకుండా మన తరానికి అంది ఉన్నాయి.

వీటిని గురించి ఎంతో పరిశోధన జరిగింది. సంగీతము, సాహిత్యము వీటిలో సుమధురంగా మేళవించబడినది గనుకనే వీటికి ఘనరాగ పంచరత్నాలని పేరు వచ్చింది. అన్ని కీర్తనలూ ఆదితాళంలో ఉన్నాయి. ఎత్తుగడ నుండి చివరివరకూ అంచెలంచెలుగా తారస్థాయినందుకొనే ఈ కీర్తనలు కర్ణాటక సంగీతకారులకు దైవసమానాలు. ఇంక వాటిలో సాహిత్యం కూడా సొగసుగా తీర్చబడి మోక్షగాములకు దారిచూపే మహోపదేశంగా మన్ననలు అందుకొన్నది.

వనరులు

[మార్చు]