షట్చక్రవర్తులు
స్వరూపం

షట్చక్రవర్తులు అనగా ఆరుగురు చక్రవర్తులు.
షట్చక్రవర్తులు
[మార్చు]- హరిశ్చంద్రుడు : హరిశ్చంద్రుడు పౌరాణిక హిందూ రాజులలో బాగా ప్రసిద్ధి చెందినవాడు. హరిశ్చంద్రుడు అయోధ్యకు చెందిన పేరుగాంచిన సూర్యవంశ (ఇక్ష్వాకువంశ, అర్కవంశ, రఘువంశ) రాజు. సత్యవ్రతుడి కొడుకైన అతడు ఎప్పుడు నిజమే పలకాలని అబద్దము చెప్పకూడదనే నియమము కలిగినవాడు. తనకు పేరు తెచ్చి పెట్టిన తన సత్యనిష్ఠ వలనే తను ఎన్నో కష్టాలు ఎదురుకోవాల్సి వచ్చింది.
- నలుడు : నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపు స్వారీలో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.
- పురుకుత్సుడు : ఇక్ష్వాకువంశస్థులలో మహాఖ్యాతికి ఎక్కిన రాజు అయిన మాంధాత జ్యేష్ఠపుత్రుఁడు. ఇతని భార్య నాగుల సహోదరి అయిన నర్మద. ఇతఁడు కశ్యపపుత్రులు అయిన మౌనేయులవలని భయమును నాగులకు మాన్పినందున వారు తమసహోదరి అయిన నర్మదను ఇతనికి ఇచ్చి వివాహము చేయించిరి. ఇతని కొడుకు త్రసదస్యుఁడు లేక వసుదుఁడు.
- పురూరవుడు : చంద్రవంశానికి చెందిన ఒక రాజు. ఆయన తల్లిదండ్రులు చంద్రవంశ సంజాతుడైన బుధుడు, మనువు కూతురైన ఇళ. మంచి అందగాడు, పరాక్రమవంతుడు కావడంతో ఆయన కీర్తి దేవలోకానికి కూడా పాకింది.
- సగరుడు : హిందూ పురాణాల్లో సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజుకి ఈయన పూర్వీకుడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి. మరొకరు శివి వంశానికి చెందిన స్త్రీ.[1]
- కార్తవీర్యుడు : హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.
హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I
సగర: కార్త వీర్యశ్చ,షడేతే చక్రవర్తిన:I
మూలాలు
[మార్చు]- ↑ Ikshaku tribe The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 3: Vana Parva: Tirtha-yatra Parva: Section CVI, p. 228 'There was born in the family of the Ikshaku tribe, a ruler of the earth named Sagara, endued with beauty, and strength...".
- ↑ "Wayback Machine" (PDF). ebooks.tirumala.org. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-17.
{{cite web}}: Cite uses generic title (help)