పురుకుత్సుడు
పురుకుత్సుడు ఇక్ష్వాకువంశస్థులలో మహాఖ్యాతికి ఎక్కిన రాజు అయిన మాంధాత జ్యేష్ఠపుత్రుఁడు. ఇతని భార్య నాగుల సహోదరి అయిన నర్మద. ఇతఁడు కశ్యపపుత్రులు అయిన మౌనేయులవలని భయమును నాగులకు మాన్పినందున వారు తమసహోదరి అయిన నర్మదను ఇతనికి ఇచ్చి వివాహము చేయించిరి. ఇతని కొడుకు త్రసదస్యుఁడు లేక వసుదుఁడు.
తను శ్రీరామునికి పూర్వీకుడు. అతను నాగ తెగకు చెందిన యువరాణి నర్మదను వివాహం చేసుకున్నాడు. అతని మనవడు, అనరణ్యుడు, రావణుడితో ద్వంద్వ యుద్ధంలో మరణించే సమయంలో, ఇక్ష్వాకు లేదా సౌర జాతికి చెందిన వంశస్థుడైన శ్రీరామునిచే చంపబడతాడని శపించాడు. [1]
అతని తండ్రి మాంధాత రెండవ యువనాశ్యుని కొడుకు. ఇతని భార్య శశిబిందుని కుమార్తె అయిన బిందుమతి. ఇతనికి పురుకుత్సుఁడు, అంబరీషుఁడు, ముచికుందుఁడు అను ముగ్గురు కుమారులు ఏబై మంది కుమార్తెలు కలరు. ఆ కుమార్తెలను సౌభరి అను మునికి ఇచ్చి వివాహము చేసెను.
మూలాలు
[మార్చు]- ↑ పురుకుత్సుఁడు : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 : ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం