అష్టాంగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పతంజలి యోగసూత్రాల్లో అష్టాంగాలు...!

అష్టాంగాలు రెండు సందర్బాలలో చెప్పబడుతుంది. మొదటిది పతంజలి యోగసూత్రాల్లోనూ, రెండవది సాష్టాంగ నమస్కారంలోను.

పతంజలి యోగసూత్రాల్లో అష్టాంగాలు[మార్చు]

పతంజలి యోగసూత్రాల్లోని అష్టాంగాలు సాధనా మార్గాలు.


 1. యమము అనగా ఇంద్రియ నిగ్రహము. ఇందులో పది రకాలున్నాయ (పదో రకం ఏదీ?)
  1. అహింస
  2. సత్యము
  3. అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట)
  4. దొంగిలింపకుండుట
  5. బ్రహ్మ చర్యము
  6. దయ
  7. అర్జవము (అందరి పట్ల ప్రవృత్తిలో గాని, నివృత్తిలో గాని సమభావము కలిగి ఉండుట)
  8. క్షమ
  9. మితాహారము
 2. నియమము అనగా ఏర్పాటు. ఇది పది రకములు
  1. సంతోషము
  2. దానము
  3. అస్తిక్యము (వేదోక్తమైన ధర్మమునందు విశ్వాసము)
  4. దానము
  5. ఈశ్వర పూజ
  6. సిద్ధాంత శ్రవణము
  7. హ్రీ (వేదాలలో చెప్పిన లౌకిక మార్గములందు సిగ్గు కలిగి యుండుట)
  8. మతి (వేద విహిత మార్గములందు శ్రద్ధ)
  9. జపము
  10. వ్రతము
 3. ఆసనము అనగా కూర్చునే విధానం. ఎనిమిది విధాలైన ఆసనాలున్నాయి.
  1. స్వస్తికము
  2. గోముఖము
  3. పద్మము
  4. వీరము
  5. సింహము
  6. భద్రము
  7. ముక్తము
  8. మయూరము
 4. ప్రాణాయామము అనగా శ్వాస విధానము మూడు రకాలు
  1. రేచకము
  2. కుంభకము
  3. పూరకము
 5. ప్రత్యాహారము అనగా ఇంద్రియాలనుండి మనసును మరల్చడం. ఐదు విధాలు
  1. విషయములలో సంచరించే ఇంద్రియాలను బలాత్కారముగా వెనుకకు లాగడం
  2. చూచిన ప్రతి వస్తువూ ఆత్మయే అనే జ్ఞానము
  3. నిత్య విహితమైన కర్మ ఫల త్యాగము
  4. విషయాలలో ఆసక్తి లేకుండా ఉండడం
  5. ప్రతి ఇంద్రియమునందు ఆరోహణ, అవరోహణ
 6. ధారణ మూడు విధాలు
  1. ఆత్మ యందు మనసును ధారణ చేయడం
  2. దహరాకాశంలో బాహ్యాకాశం ధారణ చేయడం
  3. పంచ భూతములందు పంచమూర్తి ధారణ
 7. ధ్యానము రెండు విధాలు
  1. సగుణము
  2. నిర్గుణము
 8. సమాధి ఒకటే స్థితి.

సాష్టాంగ నమస్కారంలో అష్టాంగాలు[మార్చు]

సాష్టాంగ నమస్కారంలో అష్టాంగాలు అనగా మన శరీరంలోని 8 అంగాలు నేలను తాకాలి. ఆ 8 అవయవాలు:

రెండు చేతులు, రెండు కాళ్ళు, రొమ్ము, నుదురు, రెండు భుజాలు

"కరయుగములు, చరణంబులు,

నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్

సరిధరణిమోపి మ్రొక్కిన

బరువడి సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్"


వనరులు[మార్చు]