అష్టగురువులు
స్వరూపం
వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు.
అష్టగురువులు:
- అక్షరాభ్యాసం చేయించినవారు
- ఉపనయనంలో గాయత్రీ మంత్రము ఉపదేశించినవారు
- వేదాధ్యయనం చేయించినవారు
- శాస్త్రాభ్యాసం చేయించినవారు
- పురాణాదికాలను చెప్పినవారు
- శైవ, వైష్ణవ సంప్రదాయాలను బోధించినవారు
- టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు
- బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినవారు
- బోధక గురువులు : శాస్త్రాన్ని యధాతధంగా చెప్పేవారు. ఏమాత్రము అనుభవ జ్ఞానం లేక, గ్రంథములో ఉన్న విషయాన్ని యదాతథంగా బోధించేవాడు. వీరు బోధక గురువులుగా వ్యవహరించబడతారు.
- వైదిక గురువులు : వేదార్ధంతో భగవంతుని వైపు దృష్టి మరల్చేవారు. అనగా వేదాలలోని వేదాంత భావములను వివరించువారు.
- ప్రసిద్ధ దేశికులు: ఫతిఫలాన్ని ఆశించకుండా ఆధ్యాత్మిక బోధనలు చేసే వారు.
- కామ్యక గురువులు: పుణ్యకార్యాల ద్వారా పుణ్యసంపాదన చేయించేవారు. పాప పుణ్య క్రియల వల్ల సంభవించే పాపపుణ్య ఫలితాల గూర్చి చెప్పేవారు.
- వాచక గురువు : యోగాతత్వాన్ని బోధించి ఆత్మతత్వాన్ని అనుభవింప చేసేవారు. అన్ని అంటి అంటకుండా ఉండే మార్గమనే వైరాగ్యమును తెలుపువాడు.
- సూచక గురువు : శమాది షట్కసంపత్తిని బోధించి ఇంద్రియ నిగ్రహం కలిగించే వారు. ఏకాగ్రతతో చూపు నిలిపి, కన్నులలో దర్శించే, విశ్వములోని కళలన్నీ ఏవిధంగా సాధమవుతాయో తెలిపే గురువులు.
- కారణ గురువు : జీవబ్రహ్మలకు ఐక్యతను బోధించేవారు. ఇహలోక, సంపద సుఖాలపై, మోహమును పోగొట్టి ముక్తి అనే సంపదను కైవసం చేగించగల గురువు.
- విహిత గురువు : సందేహాలను తీర్చి చిత్తశుద్ధి కలిగించి, ఆత్మయే సత్యమని దృఢమైన బోధ చేసేవారు. అంతు చిక్కని, అని నిగూఢమైన, సృష్టి తత్వాన్నిబోధించి విశ్వరూపుని దర్శింగు మార్గమును చూపించే గురువు. ఇతనిని విహితోపదేష్ట గురువు అనికూడా అంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Unknown. "అష్ట విధ గురువులు - వారి లక్షణములు". Retrieved 2020-08-24.