ఎనిమిది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

0 | 1 | 2| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 100 | 108 | 1000 | 1116

ఈ అంకె గురించి



కార్డినల్ 8
eight
ఆర్డినల్ 8th
eighth
సంఖ్యా పద్ధతి octal
Factorization
Divisors 1, 2, 4, 8
రోమను సంఖ్య VIII
రోమను సంఖ్య (Unicode) Ⅷ, ⅷ
చైనీసు సంఖ్య
prefixes octa-/oct- (from Greek)

octo-/oct- (from Latin)

Binary 1000
Octal 10
Duodecimal 8
Hexadecimal 8
Hebrew ח (Het)

భాషలో ఎనిమిది[మార్చు]

  • “ఓం నమోనారాయణాయ” అనే తారక మంత్రం అష్టాక్షరిగా వ్యవహరించబడుతోంది.
  • ఎనిమిది పాదాలు ఉన్న శ్లోకం అష్టపది. ఎనిమిది పద్యాలున్న స్తోత్రాన్ని అష్టకం అంటారు.
  • సాలెపురుగుకి ఎనిమిది పాదాలుంటాయి కాని, దానిని అష్టపది అని అనరు.
  • బుద్ధుడు బోధించినది అష్టాంగ మార్గం. ఆ మార్గాలు ఏమిటయ్యా అంటే – సమ్యగ్‌దృష్టి, సమ్యస్సంకల్పం, సమ్యగ్వాక్కు, సమ్యక్కర్మ, సమ్యగ్జీవనం, సమ్యగ్‌వ్యాయామం, సమ్యక్‌స్మృతి, సమ్యక్‌సమాధి.
  • ఎనిమిది శరీర అవయవాలతో చేసేదే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం మగవారే చెయ్యవచ్చుట.
  • అష్టభోగములు- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము;
  • అష్టాగ్నులు, అష్టకష్టాలు, అష్టకర్మలు, అష్టగణపతులు, అష్టలక్ష్మిలు, అష్టదిక్పాలకులు, అష్టదిగ్గజాలు, …, ఇలా ఎన్నో అష్ట మాటలు మన భాషలో ఉన్నాయి.
  • పాణిని రచించిన వ్యాకరణ గ్రంథంలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి కనుక దానిని అష్టాధ్యాయి అన్నారు.
  • అష్టభాషలలో సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగధి, పైశాచి, చూళికాపైశాచి, అపభ్రంశం, తెలుగు ఉన్నాయనిన్నీ ఇందులో తెలుగు ఉండడం గమనించదగ్గ విషయమనిన్నీ మనవి చేసుకుంటున్నాను.
  • ఒక్క తెలుగు భాషలోనే అష్టావధానం అనే ప్రక్రియ మొదలయింది. కన్నడంలో కూడ ప్రయత్నాలు జరిగేయని విన్నాను కాని ఇది తెలుగు వారి సొత్తేమో అని అనిపిస్తూ ఉంటుంది. మరో విషయం. ఈ రోజుల్లో అష్టావధానులకి అమెరికాలో ఉన్న పలుకుబడి, గిరాకి ఇండియాలో ఉన్నట్లు కనిపించదు.
  • “అష్టవర్షా భవేత్కన్యా” అన్న శ్లోకాన్ని ఉదహరిస్తూ మనవాళ్లు ముక్కుపచ్చలారని అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేసి వాళ్లని అష్టకష్టాలు పెట్టేసేవారు.

బ్రహ్మో దైవస్తదైవార్ష: ప్రజాపత్యస్తధాసురః |

గాంధర్వో రాక్షసశ్చైవ పైశాశ్చా ష్టమో 2 ధమః || (మనుస్మృతి 3-21)

  • బ్రహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గంధర్వం, రాక్షసము, పైశాచికం, అని వివాహాలు ఎనిమిది రకాలు. వీటిల్లో మొదటి నాలుగు రకాలు ఈ రోజుల్లో జరగడం లేదు.
    • వరుడు వధువుకు, ఆమె బంధువులకు తన శక్తి మేరకు ధనము ఇచ్చి, తన ఇష్ట ప్రకారం చేసుకునే వివాహం ఆసుర వివాహం.
    • స్త్రీపురుషులు ఇరువురు ఒకరి పట్ల మరొకరు గాఢమైన అనురక్తితో చేసుకునే వివాహం గంధర్వ వివాహం.

కన్య యొక్క బంధువులు వివాహానికి సమ్మతించని యెడల అడ్డు పడిన వారందరినీ హత్య చేసి, ఖండఖండాలుగా వారిని నరికి, ఏడుస్తున్న కన్యను ఆమె ఇంటినుండి బలవంతముగా తీసుకెళ్లి చేసుకునే వివాహం రాక్షస వివాహం.

    • ఒక స్త్రీని ఆమె ఇష్టంతో పని లేకుండా, నిద్రిస్తున్న దానిని, లేదామత్తులోఉన్నదానిని, లేదా ఏమరుపాటుగా ఉన్నదానిని బలాత్కారముగా అనుభవిస్తే దానిని పైశాచిక వివాహం అంటారు. ఈ ఎనిమిదవ తరహా వివాహం అష్టవిధ వివాహాలలో అధమమైనది.
  • అష్టవంకరలున్న అష్టావక్రుడి కథలోనే ఈ విశ్వం ఎంత పురాతనమైనదో విశదీకరించే పిట్టకథ ఒకటి ఉంది. ఈ అష్టావక్రుడి తండి ఏకపాదుడు. ఈ కథ విశ్వస్వరూపం <ref వేమూరి వేంకటేశ్వరరావు, విశ్వస్వరూపం, కినిగె ప్రచురణ, https://web.archive.org/web/20190428112414/http://kinige.com/ /ref> అన్న పుస్తకంలో వివరంగా ఉంది.
  • అష్టా, చెమ్మా అనే ఆటలో అష్టా అంటే ఎనిమిది ఎలా వచ్చిందో ఊహించవచ్చు కాని చెమ్మా అంటే నాలుగెలా అయిందో ఊహకి అందడం లేదు. చార్ లోంచి వచ్చిందేమో.
  • ఎనిమిదికి భారత, భాగవత కథలలో కొంత ప్రత్యేకత ఉంది. అష్టవసువుల్లో ఎనిమిదవ వాడే భీష్ముడు. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకి అష్టమి నాడు పుట్టిన ఎనిమిదవ సంతానం, పైపెచ్చు దశావతారాలలో ఎనిమిదవ అవతారం.
  • చైనాలో 8 కి అదృష్టానికి అవినాభావ సంపర్కం ఉంది. వాళ్ళకి 8 మీద ఎంత మోజు అంటే బైజింగ్ ఒలింపిక్ కార్యక్రమాన్ని 2008 ఆగస్టు 8 తేదీన సాయంకాలం 8 గంటల 8 నిమిషాల 8 సెకండ్లకి మొదలు పెట్టేరు.
  • కొలమానాలలో - అమెరికాలో 8 ఔన్సులు ఒక కప్పు; 8 పైంట్లు ఒక గేలను; బ్రిటన్ లో 8 ఫర్లాంగులు ఒక మైలు.

గణితంలో ఎనిమిది[మార్చు]

దశాంశ పద్ధతిలో ఒక సంఖ్యని 8 చేత నిశ్శేశంగా భాగించగలమో లేమో తెలుసుకోవాలంటే ఆ సంఖ్య చివర ఉన్న మూడంకెల సంఖ్యని 8 చేత నిశ్శేశంగా భాగించగలిగితే చాలు. ఉదా: 680 ని 8 చేత నిశ్శేషంగా భాగించగలం. 56680 ని కూడ 8 చేత నిశ్శేషంగా భాగించగలం.

ఇటీవలి కాలంలో కూడ ఎనిమిది కొంత ప్రత్యేకత సంతరించుకుంది. నలుగురు మనుషులు ఉన్న మేళాన్ని ఇంగ్లీషులో "క్వార్టెట్" అన్నట్లే ఎనిమిది వస్తువుల గుంపుని ఇంగ్లీషులో ఆక్టేట్ అంటారు. వార్తాప్రసారణ సిద్ధాంతంలో ఎనిమిది ద్వింకముల గుంపుని కూడ ఆక్టెట్ అనే అంటారు. ఇక్కడ “ద్వింకము” అన్నది ద్వియాంశ అంకము (బైనరీ డిజిట్) అన్న మాటకి సంక్షిప్త రూపం. కంప్యూటర్ రంగంలో ఎనిమిది ద్వింకముల గుంపుని “బైట్” అంటారు. ఎనిమిది చింతపిక్కల గుంపుకి గుర్రం అనిన్నీ, నాలుగు చింతపిక్కల గుంపుకి పుంజీ అనిన్నీ పేర్లు పెట్టగలిగిన తెలుగువాళ్లు ఎనిమిది ద్వింకముల గుంపుకి కూడ ఒక తెలుగు పేరు పెట్టగల సమర్ధులే - ఎందుకు పెట్టలేదో.

వనరులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎనిమిది&oldid=3142309" నుండి వెలికితీశారు