పంచగవ్యం
స్వరూపం
పంచగవ్యం అంటే ఐదు గోసంబంధమైన పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం[1]. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో వినియోగిస్తారు. భారతదేశ ప్రాచీన వైద్య విధానం, ఆయుర్వేదంలో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆవు ద్వారా మనకు వచ్చే ఐదు వస్తువులను పంచ గవ్యాలు అంటారు. ఇవి ప్రకృతి వైద్యంలో వాడతారు. పంచ గవ్యాన్ని పవిత్ర హోమాల్లో, పూజల్లో వినియోగిస్తారు.
పదార్థాలు
[మార్చు]- గోక్షీరము - ఆవు పాలు
- గోఘ్రుతము - ఆవు నెయ్యి
- గోదధి - ఆవు పెరుగు
- గోమూత్రము - ఆవు మూత్రము
- గోమయము - ఆవు పేడ
ఉపయోగాలు
[మార్చు]దీనినే పంటలకు ఎరువు గానూ, క్రిమి సంహారిణిగానూ వాడతారు. కానీ ఫలితాలు మాత్రం శాస్త్రీయంగా నిరూపించబడలేదు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Dhama K. et al., Panchgavya (Cowpathy): An Overview, International Journal of Cow Science, 2005:vol 1:issue 1
- ↑ Arvind Kumar (1 January 2005). Environment & agriculture. APH Publishing. pp. 65–. ISBN 978-81-7648-921-8. Retrieved 25 March 2011.