అష్టవిధ ప్రమాణాలు
స్వరూపం
ప్రమాణము అంటే ఒక విషయం యొక్క సత్యాసత్యాలను నిర్ధారించుకోవడం. హిందూ సాంప్రదాయంలో అందుకు వివిధ పద్ధతులు వివరించబడ్డాయి. అవి:
- ప్రత్యక్ష ప్రమాణం: ప్రత్యక్ష ప్రమాణం అంటే స్వయంగా గ్రహించడం.
- అనుమాన ప్రమాణం: పొగను గమనించి నిప్పు ఉండవచ్చునను కోవడం అనుమాన ప్రమాణం.
- శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం: తాను నమ్మే ప్రమాణ గ్రంథంలో ఉన్నందువలన గానీ, తను విశ్వసించే వారెవరైనా చెప్పినందువలన గానీ అంగీకరించడం శబ్ద / ఆప్తవాక్య ప్రమాణం.
- ఉపమాన ప్రమాణం: ఏదైనా ఒక ఉపమానాన్ని చెప్పి ఒప్పించడం ఉపమాన ప్రమాణం.
- అర్థాపత్తి ప్రమాణం: వాచ్యంగా చెప్పక పోయినప్పటికీ ధ్వనివల్ల విషయాన్ని బోధపరచడం అర్థాపత్తి. ఫలానా వ్యక్తి పగలు భోజనం చేయడం లేదు అంటే అతడు రాత్రి భోజనం చేస్తున్నాడనుకోవచ్చు.
- అనుపలబ్ధి ప్రమాణం: ఒక వస్తువు కోసం ఒకరు మిగతా అందరితో పాటు వరుసలో నిలుచున్నాడు. కాని, అతని వంతు రాకముందే సరకు అయిపోయింది. సరకు అయిపోయి నందువల్ల తనకు వస్తువు దొరకలేదని తెలియడం అనుపలబ్ధి ప్రమాణం.
- సంభవ ప్రమాణం: ఈ రోజు ఏకాదశి అయితే నిన్న దశమి, మొన్న నవమి అని చెప్పకపోయినా తెలియడం సంభవ ప్రమాణం.
- ఐతిహ్య ప్రమాణం: ఏదైనా వస్తువును చూసినప్పుడు, దానిని గురించి గతంలో తాను విన్న విషయాలు జ్ఞాపకానికి వచ్చి తదనుభూతి కలగడం ఐతిహ్య ప్రమాణం.