షోడశోపచారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2010లో సామూహిక పూజలు, ఇంగ్లాండ్

షోడశోపచారాలు హిందువులు షోడశోపచార పూజా విధానంలో దేవున్ని పూజిస్తారు. షోడశ అనగా పదహారు; ఉపచారాలు అనగా సేవలు. షోడశోపచారాలు తెలుగు వ్యాకరణంలో గుణ సంధి.

 1. ఆవాహనం
 2. ఆసనం
 3. పాద్యం
 4. ఆర్ఘ్యం
 5. ఆచమనీయం
 6. స్నానం
 7. వస్త్రం
 8. యజ్ఞోపవీతం
 9. గంధం
 10. పుష్పం
 11. ధూపం
 12. దీపం
 13. నైవేద్యం
 14. తాంబూలం
 15. నమస్కారం
 16. ప్రదక్షిణం

ఉపచార విధానం పూజా విధానంలో ఇంటికి వచ్చిన పెద్దలను ఎలా గౌరవిస్తారో అలానే షోడశోపచారములలో కూడా భగవానుని అలాగే గౌరవిస్తారు. అలా పూజా పరంగా భగవానుని మర్యాద చేయడం ఉపచార విధానం.

 • ఆవాహనము -- మనస్ఫూర్తిగా ఇంట్లోకి ఆహ్వానించడం
 • ఆసనము -- వచ్చిన వారిని కూర్చోబెట్టడం
 • పాద్యము -- కాళ్ళు కడుగుకొనేందుకు నీళ్ళివ్వడం
 • ఆర్ఘ్యము -- చేతులు శుభ్రపరచడం
 • ఆచమనీయము -- దాహమునకు నీళ్ళివ్వడము
 • స్నానము -- ప్రయాణ అలసట తొలగుటకు స్నానింపచేయడం
 • వస్త్రము -- స్నానానంతరము పొడి బట్టలివ్వడం
 • యజ్ఞోపవీతము -- మార్గమధ్యలో మైల పడిన యజ్ఞోపవీతమును మార్చడం