అష్టస్వామ్యాలు
స్వరూపం
అష్టస్వామ్యాలు:
స్వామ్యం అంటే హక్కు లేదా అధికారం. స్థిరాస్థి అయిన భూమిని ఎవరికైనా అమ్మిన లేదా దానంగా ఇచ్చినప్పుడు దాని మీద తనకు గల సర్వస్వామ్యాలను అప్పగించినట్లు లెక్క. ఈ స్వామ్యాలు ఎనిమిది రకాలు. అవి:
- దాన = ఎవరికైనా దానంగా ఇచ్చే హక్కు
- విక్రయ = ఎవరికైనా అమ్మేసే హక్కు
- వినిమయ = తాకట్టు పట్టే హక్కు లేదా ఇంకొక వస్తువుతో మారకం చేసే హక్కు
- జల = ఆ భూమిలో ఉండే జలవనరులు
- తరు = ఆ భూమిలో ఉండే చెట్లు
- పాషాణ = ఆ భూమిలో ఉండే రాళ్ళు
- నిధి = భూమిలో పాతిపెట్టిన ధాన్యాది వస్తువులు
- నిక్షేపం = భూమిలో పాతిపెట్టిన ధనం
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |