అష్టవిధ వివాహాలు
Appearance
(అష్టవిధవివాహాలు నుండి దారిమార్పు చెందింది)
యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి
- బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
- దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
- ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
- ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం
- ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం
- గాంధర్వ :- ప్రేమ వివాహం
- రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
- పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం
(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)
వివరణ
[మార్చు]- బ్రాహ్మం
- దైవం
-
- యజమాని గృహంలో దైవ యజ్ఞం చేసి యజ్ఞాంతములో ఋత్విజునికి ధారాపూర్వకంగా కన్యను ఇచ్చి వివాహం చెయ్యడం.
- ప్రాజాపత్యం
-
- కేవలం సంతానం కోసం చేసుకునే వివాహం. వదూవరులు ఒకచోట సుఖంగా ధర్మాచరణ చేసుకొంటూ జీవిస్తారనే బుద్దితో వరునికి కన్యనిచ్చి వివాహం చేయడం. ఈ ప్రక్రియలో కట్నం, కన్యాశుల్కం అనే ప్రసక్తి ఉండదు.
- ఆర్షం
-
- వేదవిహితంగా చేసుకునే వివాహం. కన్య తల్లి దండ్రులకు వరుడు కొన్ని ఉపకరణాలు అనగా ఆవు లేదా ఎద్దు లేదా కొన్ని మేకలు ఇలా ఇచ్చి కన్యను/కన్యాదానమును గ్రహించడం.
- ఆసురం
-
- వదువు వైపువారికి శుల్కమును/ధనము ఇచ్చి కన్యాధానము గ్రహించడం.
- గాంధర్వం
-
- వధూవరులు ఇష్టపడి చేసుకునే వివాహం. పెద్దల అనుమతితో ప్రమేయము లేక ఇరువురు ఇష్టముతో పాణిగ్రహణము చేసుకొనడం.
- పైశాచం
-
- కన్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసుకునే వివాహం. వదువు ఏమరుపాటుగా ఉన్నపుడు గాని, నిద్రిస్తున్నపుడు గాని, చేసుకొనే ఈ వివాహాన్ని అధమాధమమైనదిగా పరిగణిస్తారు.
- రాక్షసం
-
- కన్య ఆమె బందువుల ఇష్టాలతో ప్రమేయం లేకుండా వారిని ఎదిరించి, బెదిరించి చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహాలు పలు పురాణాలలో కానవస్తాయి.
ఈ విధములైన అష్ట విధ వివాహాలు యాజ్ఞవల్కస్మృతిలో కానవస్తాయి. ఇవే కాక హిందూ సాంప్రదాయంలో స్వయంవరం అనే మరొక సాంప్రదాయ వివాహం చూడచ్చు. శివదనుస్సును విరిచి శ్రీరాముడు సీత ను పెళ్ళాడినది. మత్యయంత్రమును ఎక్కుపెట్టీ ద్రౌపదిని అర్జునుడు చేపట్టినది ఈపద్దతినే.