Jump to content

యాజ్ఞవల్క్య స్మృతి

వికీపీడియా నుండి

యాజ్ఞవల్క్య స్మృతి హిందూమతం లోని అనేక ధర్మ గ్రంథాలలో ఒకటి. ఇది 3వ నుండి 5వ శతాబ్దానికి మధ్య నాటిది. ధర్మశాస్త్ర సంప్రదాయానికి చెందినది. [1]సంస్కృత గ్రంథాన్ని మనుస్మృతి తర్వాత రచించారు. కానీ దాని లాగా, నారదస్మృతి లాగా, దీన్ని కూడా ఛందోబద్ధ శ్లోక శైలిలో కూర్చారు. [2] యాజ్ఞవల్క్య స్మృతిలోని చట్టపరమైన సిద్ధాంతాలు ఆచార -కాండ (ఆచారాలు), వ్యవహార -కాండ (న్యాయ ప్రక్రియ), ప్రాయశ్చిత్త -కాండ (నేరం-శిక్ష, తపస్సు) అనే మూడు పుస్తకాలలో అందించబడ్డాయి. [3]

న్యాయ ప్రక్రియ సిద్ధాంతాలపై పెద్ద విభాగాలతో ఈ శైలిలో "అత్యుత్తమంగా రచించిన" కృతి. ఇది మధ్యయుగ భారతదేశ న్యాయవ్యవస్థ అమలులో మనుస్మృతి కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపింది. [4] [5] [6] [7] 1849లో జర్మన్ భాషలో ప్రచురితమైన మొదటి అనువాదంతో ఇది, పురాతన మధ్యయుగ భారతదేశంలోని చట్టపరమైన ప్రక్రియల అధ్యయనాలలోను, బ్రిటిష్ ఇండియాలోనూ ప్రభావవంతంగా మారింది. చట్టపరమైన సిద్ధాంతాలలో మరింత ఉదారవాదం, మానవత్వం, చట్టపరమైన పత్రాల సాక్ష్యం, న్యాయబద్ధతపై విస్తృతమైన చర్చలు మొదలైన వాటిలో మనుస్మృతికీ దీనికీ ఉన్న తేడాల కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది. [8]

తేదీ

[మార్చు]

ఈ గ్రంథం గుప్తుల కాలం నాటిది. సుమారు 3వ, 5వ శతాబ్దాల మధ్య కాలంలో ముందా లేదా తరువాతి భాగంలో ఉంచాలా అనే దానిపై కొంత చర్చ ఉంది. [note 1] పాట్రిక్ ఒలివెల్లే 4వ నుండి 5వ శతాబ్దానికి చెంది ఉండవచ్చునని సూచిస్తున్నారు. [1]

నిర్దిష్ట డేటింగ్ కోసం వాదనలు గ్రంథమంతటా కనిపించే సంక్షిప్త, అధునాతన పదజాలం, నాణక వంటి నిర్దిష్ట పదాల వాడకంపైన, గ్రీకు జ్యోతిషశాస్త్రానికి సంబంధించిన సూచనల (ఇది భారతదేశంలో 2వ శతాబ్దం నుండి ప్రసిద్ది చెందింది) పైన ఆధారపడి ఉన్నాయి. నాణకను ఎవరు మార్పిడి చేసుకుంటున్నారు, రచయిత అర్థం చేసుకున్న గ్రీకు ఆలోచన స్థాయి వగైరాలను బట్టి ఈ వాదనలు తలెత్తాయి. [9]

కర్త

[మార్చు]

అనేక ప్రధాన ఉపనిషత్తులు, యోగ యాజ్ఞవల్క్యం వంటి ఇతర ప్రభావవంతమైన గ్రంథాలలో కనిపించే వేదర్షి యాజ్ఞవల్క్యుడి పేరు మీద ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది. [10] అయితే, అతని తర్వాత ఒక సహస్రాబ్ది కంటే ఎక్కువ కాలం తర్వాత ఈ గ్రంథాన్ని రచించారని భావిస్తున్నారు. హిందూ సంప్రదాయాలలో ఋషుల పట్ల సాధారణంగా కనిపించే గౌరవం కారణంగా దీన్ని అతనికి ఆపాదించి ఉండవచ్చు. [10]

ఈ గ్రంథం చారిత్రాత్మక భారతదేశంలోని మిథిల ప్రాంతంలో (ఆధునిక బీహార్‌లో) రచించి ఉండవచ్చు. [8]

నిర్మాణం

[మార్చు]

ఈ గ్రంథం సాంప్రదాయిక సంస్కృతంలో ఉంది. ఆచార-కాండ (368 శ్లోకాలు), వ్యవహార -కాండ (307 శ్లోకాలు) ప్రాయశ్చిత్త-కాండ (335 శ్లోకాలు) మూడు అధ్యాయాల్లో దీన్ని రాసారు. [3] [7] యాజ్ఞవల్క్య స్మృతి మొత్తం 1,010 శ్లోకాల్లున్న గ్రంథం. రాబర్ట్ లింగత్ ప్రకారం అది, మనుస్మృతిలో కనిపించే "సాహిత్య సౌందర్యానికి" బదులుగా పద్దతిగా, స్పష్టంగా, సంక్షిప్తంగా ఉంది. [7]

లూడో రోచెర్ ఈ గ్రంథం, పాశ్చాత్యులకు అర్థమయ్యే లా పుస్తకాల లాగా కాక, ధర్మశాస్త్ర శైలిలోని ఇతర గ్రంథాల మాదిరిగానే ధర్మంపై రాసిన భాష్యమని పేర్కొన్నాడు. [11] దీనికి విరుద్ధంగా రాబర్ట్ లింగట్, ఈ రచన చట్టపరమైన తత్వశాస్త్రానికి దగ్గరగా ఉందనీ, మునుపటి ధర్మ-సంబంధిత గ్రంథాలలో కనిపించే ధర్మ ఊహాగానాలు నుండి మార్పు ఉందనీ పేర్కొన్నాడు. [11]

విషయం

[మార్చు]

మిథిలా ఋషులు యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్లి ధర్మాన్ని బోధించమని అడిగారు. [12] 1.4-5 శ్లోకాలలో, ఈ క్రింది వారు ధర్మశాస్త్రాన్ని రచించారు - మను, అత్రి, విష్ణు, హరిత, యాజ్ఞవల్క్య, ఉషానులు, అంగీరసులు, యమ, ఆపస్తంబ, సంవర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖిత, దక్ష, గౌతమ, శతతప, వశిష్ఠ అని చెబుతూ ప్రాచీన ధర్మ పండితులను గౌరవప్రదంగా ప్రస్తావించి, గ్రంథం తన ప్రత్యుత్తరాన్ని మొదలుపెడుతుంది. [13] మిగిలిన వచనం ధర్మంపై యాజ్ఞవల్క్య సిద్ధాంతాలు, ఆచార (సరైన ప్రవర్తన), వ్యవహార (నేరసంబంధమైన చట్టం), ప్రాయశ్చిత్త (ప్రాయశ్చిత్తం) భాగాలుగా నడుస్తుంది.

యాజ్ఞవల్క్య స్మృతి, మను స్మృతి వంటి ఇతర ధర్మ-గ్రంధాలను విస్తృతంగా ఉటంకిస్తుంది. కొన్నిసార్లు వీటి లోని పాఠ్యాన్ని నేరుగా ప్రస్తావిస్తూ, మునుపటి అభిప్రాయాలను సంగ్రహంగా తగ్గించి, ప్రత్యామ్నాయ న్యాయ సిద్ధాంతాన్ని అందజేస్తుంది. మునుపటి ధర్మ గ్రంథాల కంటే ఇందులో ప్రభావవంతమైన వ్యత్యాసాలు ఉన్నాయి -ప్రత్యేకించి రాజధర్మానికి సంబంధించి.[14]

స్త్రీలను గౌరవించాలి

స్త్రీని భర్త,
సోదరుడు, తండ్రి, అత్త, మామ,
భర్త తమ్ముడు, ఇతర బంధువులు,
ఆభరణాలతో, వస్త్రాలతో, ఆహారంతో గౌరవించాలి.

Yajnavalkya Smriti 3.82 [15]

1. భవిష్యత్ ధర్మశాస్త్రాల్లో అవలంబించిన నిర్మాణానికి యాజ్ఞవల్క్యుడు మార్గదర్శకుడు: [16]

ఎ) ధర్మాన్ని చాలా సమానమైన ప్రాముఖ్యత ఉన్న వర్గాలుగా విభజించాడు:
  • ఆచారం (సరైన ప్రవర్తన)
  • వ్యవహారం (చట్టబద్ధ ప్రక్రియ)
  • ప్రాయశ్చిత్తం (తపస్సు)
బి) నిర్దిష్ట అంశాల ద్వారా ఈ మూడింటిని మరింతగా విభజించాడు.

2. చట్టపరమైన ప్రక్రియ యొక్క అత్యున్నత పునాదిగా డాక్యుమెంటరీ సాక్ష్యం: [16]

యాజ్ఞవల్క్యుడు సాక్ష్యాధారాలను ప్రాముఖ్యత వారీగా చిత్రీకరించాడు. ధృవీకరించబడిన పత్రాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చాడు. సాక్షులు, పరీక్షలు (ఐదు రకాల ధృవీకరించదగిన సాక్ష్యాలు) ఆ తరువాత వస్తాయి. [17] [18]

3. న్యాయస్థానాలను పునర్నిర్మించాడు: [19][full citation needed]

రాజు నియమించే న్యాయస్థానాలు, మధ్యవర్తి సమూహాలు ఏర్పరిచే న్యాయస్థానాల మధ్య తేడాను యాజ్ఞవల్క్యుడు గుర్తించాడు. అతను ఈ కోర్టులను క్రమానుగత అప్పీళ్ల వ్యవస్థలో భాగంగా చిత్రించాడు.

4. సన్యాసాశ్రమ ఆదేశాల చర్చ స్థానం మార్చబడింది: [19]

మునులు, సన్యాసుల గురించి తపస్సు విభాగంలో చర్చించాడు. మునుపటి గ్రంథాలలో, సన్యాసుల వివరణ బ్రాహ్మణుల చర్చను అనుసరించింది. గృహస్థ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వాటిని రూపొందించారు. యాజ్ఞవల్క్య స్మృతిని బట్టే తదుపరి గ్రంథాలలో సన్యాసాశ్రమ ఆదేశాలను అనుసరించారు.

5. మోక్ష గామిత్వం: [19]

మోక్షం వర్ణన, ధ్యానం, ప్రాపంచిక జీవనాన్ని వివరిస్తూ మోక్షంపై ఎక్కువ శ్రద్ధ చూపబడింది. అప్పటి వైద్యశాస్త్ర ఆధారంగా లోతైన, సాంకేతిక ఉపన్యాసం కూడా ఉంది.

వ్యాఖ్యానం

[మార్చు]

యాజ్ఞవల్క్య స్మృతిపై మధ్యయుగంలో వచ్చిన ఐదు భాష్యాలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. ఇవి విశ్వరూప (బాలక్రిడ, సా.శ. 750-1000), విజనేశ్వర (మితాక్షర, 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినవి), అపరార్క (అపరార్క-నిబంధ, 12వ శతాబ్దం, శూలపాణి (దీపకళిక, 14వ లేదా 15వ శతాబ్దం), మిత్రమిశ్ర (వీరమిత్రోదయ, 17వ శతాబ్దం) మొదలైనవారు రచించినవి [20]

ప్రభావం

[మార్చు]

ఈ గ్రంథంలోని చట్టపరమైన సిద్ధాంతాలు మధ్యయుగ భారతదేశంలో చాలా ప్రభావవంతంగా ఉండేవి. దీనిలోని గద్యాలు, కోట్‌లు భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తాయి. ఈ శాసనాలు సా.శ. 10 నుండి 11వ శతాబ్దాల నాటివి. [21] [22] దీనిపై విస్తృతంగా వ్యాఖ్యానాలున్నాయి. 5వ శతాబ్దపు పంచతంత్ర వంటి ప్రసిద్ధ రచనలలో కూడా దీన్ని ప్రస్తావించారు. [21] అగ్ని పురాణపు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రతులలో 253-258 అధ్యాయాలు, గరుడ పురాణంలోని 93-106 అధ్యాయాలు ఈ స్మృతిని బాగా ఉదహరించాయి. [22]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Patrick Olivelle 2006, p. 176 with note 24.
  2. Patrick Olivelle 2005, p. 20.
  3. 3.0 3.1 Patrick Olivelle 2006, p. 188.
  4. Robert Lingat 1973, p. 98.
  5. Timothy Lubin, Donald R. Davis Jr & Jayanth K. Krishnan 2010, pp. 59–72.
  6. Robert Lingat 1973, p. 97.
  7. 7.0 7.1 7.2 Mandagadde Rama Jois 1984, p. 31.
  8. 8.0 8.1 Mandagadde Rama Jois 1984, pp. 31–32.
  9. Winternitz 1986, pp. 599–600.
  10. 10.0 10.1 Robert Lingat 1973, pp. 97–98.
  11. 11.0 11.1 Ludo Rocher 2014, pp. 22–24.
  12. Timothy Lubin, Donald R. Davis Jr & Jayanth K. Krishnan 2010, p. 44.
  13. Timothy Lubin, Donald R. Davis Jr & Jayanth K. Krishnan 2010, p. 51.
  14. Timothy Lubin, Donald R. Davis Jr & Jayanth K. Krishnan 2010, p. 45.
  15. SC Vidyarnava (1938), Yajnavalkya Smriti, Book 1, verse III.LXXXII, page 163
  16. 16.0 16.1 Olivelle, "Literary History," p. 21
  17. Timothy Lubin, Donald R. Davis Jr & Jayanth K. Krishnan 2010, pp. 45–46.
  18. Mandagadde Rama Jois 1984, pp. 300–302.
  19. 19.0 19.1 19.2 Olivelle, "Literary History," p. 22
  20. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; scbp72 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  21. 21.0 21.1 Mandagadde Rama Jois 1984, p. 32.
  22. 22.0 22.1 John Mayne 1991, pp. 21–22.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు