కన్యాశుల్కం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్యాశుల్కం, పెళ్ళి చేసుకుంటున్నందుకు వరుడు వధువుకిచ్చే రొక్కం. [1]ఇది వరకట్నం అనే దురాచారం కన్నా ప్రాచీనమైంది.వధువు పారితోషకం, (బ్రైడ్‌వెల్త్), అనేది వరుడు లేదా అతని కుటుంబం, అతను వివాహం చేసుకోబోయే లేదా వివాహం చేసుకోబోయే స్త్రీ కుటుంబానికి చెల్లించే డబ్బు, ఆస్తి లేదా ఇతర సంపదను కన్యాశుల్కం అని అంటారు. వధువు పారితోషకం,  వరకట్నంతో పోల్చవచ్చు. ఇది వరుడికి చెల్లించుతారు. లేదా వధువు కొత్త ఇంటిని స్థాపించడానికి సహాయపడుతుంది.ఇది వివాహం సమయంలో వరుడు స్వయంగా వధువుపై స్థిరపడిన ఆస్తి.

వధువుకు పారితోషకం ఇచ్చే సంప్రదాయం అనేక ఆసియా దేశాలు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, కొన్ని పసిఫిక్ ద్వీప సమాజాలలో, ముఖ్యంగా మెలనేషియాలో ఉంది.

ఇస్లాంలో కన్యాశుల్కం

[మార్చు]

దీనిని ముస్లిములు మహర్ అంటారు. ఇది అందరూ పాటించదగిన మంచి సంప్రదాయం. కట్నం లేదా వరకట్నం కన్యాశుల్కానికి వ్యతిరేకమైనవి. ముస్లిముల్లో వరుడు వధువుకు కట్నం ధారాళంగా ఇవ్వాలి, ఇచ్చితీరాలి (కురాన్ 2;136,4:19,24) వధువుకు కట్నం ఇవ్వకుండా పెళ్ళి చేయటానికి ఇస్లామ్ లో అనుమతే లేదు (తిర్మిజి :881). వధువుకు ఇచ్చిన కట్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకోకూడదు.

సౌదీలో కన్యాశుల్కం

[మార్చు]

భారత్‌లాంటి దేశాల్లో వరకట్నం పేద కుటుంబాల అమ్మాయిలకు భారంగా మారితే... సౌదీ అరేబియాలో పరిస్థితి తారుమారైంది. ఇక్కడ పెళ్లి కోసం అమ్మాయిలు పెట్టే కఠిన షరతులు నెరవేర్చలేక, కోరినంత కన్యాశుల్కం ఇవ్వలేక అబ్బాయిల కుటుంబాలే సతమతమైపోతున్నాయి. ఒక్కోసారి అమ్మాయిల షరతులు అసాధ్యంగా ఉంటున్నాయట. ఈ విషయాన్ని తాజాగా అల్-వతన్ దినపత్రిక వెల్లడించింది. పత్రిక కథనం ప్రకారం... అమ్మాయిలు భారీ మొత్తాలను కన్యాశుల్కంగా కోరుతున్నారు.విడాకులు తీసుకోవడం ఎక్కువైపోతుండడంతో తమ జీవనభద్రత కోసం సౌదీ అమ్మాయిలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వివాహ ఒప్పందంలో వారి కఠిన షరతుల కారణంగా తర్వాత ఆ బంధాన్ని తెంచుకోవాలనుకునే భర్తలు కాస్త ముందూవెనుకా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంప్రదాయం ప్రకారం ముస్లిం వివాహం ఒక ఒప్పందంలా జరుగుతుంది. ఒప్పంద పత్రంలో తనకిష్టమైన షరతులను విధించే హక్కు వధువుకు ఉంటుంది. ఈ హక్కును ఎవరూ కాదనడానికి లేదని జెడ్డాలోని అల్-సాదా గ్రాండ్ మసీదు ఇమామ్, వివాహ అధికారి అల్-అమ్రీ తెలిపారు. అయితే అసాధారణమైన షరతుల వల్ల దంపతుల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనీ, అవే విడాకులకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. కొందరు వివాహ బంధానికి హామీగా లక్ష రియాళ్లు (రూ.11 లక్షలు) చెల్లించాలన్న షరతు పెడుతున్నారని చెప్పారు. ఈ షరతు ప్రకారం భర్త విడిపోవాలనుకున్నప్పుడు ఆ సొమ్మును ఆమెకు చెల్లించాల్సి ఉంటుంది. మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తం వేయాలనీ, తమ పేరుతో భవనం కొనాలనీ, డ్రైవర్ సహా కారు ఇవ్వాలని షరతులు పెడుతున్నట్లు అమ్రీ వివరించారు.[2]

కన్యాశుల్కం - తెలుగు నాటకం

[మార్చు]
కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు చిత్రం

గురజాడ మహాకవి రచించిన గొప్ప నాటకం కన్యాశుల్కము. నిజానికి తెలుగు సాహిత్యలోకంలో కన్యాశుల్కము నాటకం ద్రువతార. ఇందులో సమాజమంతా ఉంది. సమాజంలోని అన్ని మనస్తత్వాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. వ్యావహారిక భాషలో గురజాడ ఈ నాటకాన్ని రచించి గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమానికి చేయూతనిచ్చాడు. కన్యాశుల్కములో సమకాలీన సామాజిక సమస్యలన్నీ గురజాడ వివరించాడు. మధుర వాణి, గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధాని, కరటక శాస్రి, వెంకటేశమ్, బుచ్చమ్మ వంటి పాత్రలు సజీవ శిల్పాలు.

కన్యాశుల్కములోని మధురవాణి గురజాడ అపూర్వ సృష్టి. మధురవాణి వేశ్య. ఈ నాటకానికి నాయిక. నాటకకథను నడిపించింది మధురవాణియే. వేశ్య అయినా నీతి నిజాయితీలు మధురవాణి సొత్తు. మృచ్చకటికం నాటకంలోని వసంతసేన మధురవాణి సృష్టికి ప్రేరణ. గురజాడపై శూద్రకుడు ప్రభావం ఉంది.

గిరీశం జిత్తులమారి నక్క. కుహనా సంస్కర్త. తన కాలం నాటి సమాజంలోని దొంగ సంస్కర్తలకు ప్రతినిధిగా గిరీశాన్ని గురజాడ సృష్టించాడు. బుచ్చెమ్మ అనే యంగ్ విడోను వలలో వేసుకోవడానికి గిరీశం అనేక యెత్తులు వేస్తాడు. చివరికి పప్పులు ఉడక్క డామిట్ కథ అడ్డం తిరిగింది అని నిష్క్రమిస్తాడు.

మూలాలు

[మార్చు]
  1. Dalton, George (1966). ""Bridewealth" vs. "Brideprice"1". American Anthropologist (in ఇంగ్లీష్). 68 (3): 732–738. doi:10.1525/aa.1966.68.3.02a00070. ISSN 1548-1433. Archived from the original on 2021-07-09. Retrieved 2021-07-08.
  2. ఈనాడు 20.7.2008

బయటి లింకులు

[మార్చు]