Jump to content

వసంత సేన (సినిమా)

వికీపీడియా నుండి
(వసంతసేన నుండి దారిమార్పు చెందింది)
వసంత సేన
(1967 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.ఎస్.రంగా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
పద్మిని,
సత్యనారాయణ,
కృష్ణకుమారి,
ఎస్.వి. రంగారావు,
రేలంగి
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ విక్రం ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ సినిమా శూద్రకుడు రచించిన సుప్రసిద్ధ సంస్కృత నాటకం మృచ్ఛకటికమ్‌ ఆధారంగా నిర్మించబడింది[1]. వసంత సేన చిత్రం 1967లో, బి. ఎస్ రంగా దర్శకత్వంలో, విక్రం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో, అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, కృష్ణకుమారి, నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

కథాసంగ్రహము

[మార్చు]

రమారమి 2000 సంవత్సరాల క్రితం సకల కళలకు, సర్వసంపదలకు నిలయమైన ఉజ్జయినీ నగరంలో చారుదత్తుడు అనే శీల సంపన్నుడైన బ్రాహ్మణుడు ఉంటాడు. ఇతడు ధనసంపన్నుడు. కళాపిపాసి. వేశ్యామణి అయిన వసంతసేన సంగీతనాట్యాలలో ఆరితేరిన సౌశీల్యవతి. వీరిద్దరూ ఒకరినొకరు కలిసి ప్రేమలో పడక ముందే ఉజ్జయినీ నగరం శత్రువుల హస్తగతమౌతుంది.

ఉజ్జయినిని జయించిన పౌలక మహారాజు తన బావమరిది అయిన శకారుని రాజప్రతినిధిగా నియమిస్తాడు. శకారునివి అన్నీ అవగుణాలే. ప్రత్యేకంగా అతని దృష్టి వసంతసేనపై పడింది. కాని వసంతసేన అతడిని ధిక్కరించి నిలిచింది. స్వాతంత్ర్యం కోల్పోయిన తన ప్రజల కోసం చారుదత్తుడు సర్వస్వాన్ని కోల్పోయి పేదవాడవుతాడు. ఆర్యకుడు అనే మారుపేరుతో విప్లవవీరుడిగా మారి ఇదివరకు బానిసతనం నుండి తాను విముక్తి చేసిన అనంగసేన అనే వీరవనితతో కలిసి సైన్యాన్ని సమీకరిస్తాడు. శర్విలకుడు అనే చోరశిఖామణి ఈ సైన్యాలకు బాసటగా ఉంటాడు.

శర్విలకుడు వసంతసేన వద్ద దాసిగా ఉన్న మదనికను ప్రేమిస్తాడు. చారుదత్తుని ఇంటికి కన్నంవేసి అక్కడ దాచివుంచిన వసంతసేన నగలను దొంగిలించి వాటినే వసంతసేనకు సమర్పించి మదనికను విడిపించి పెళ్ళి చేసుకుంటాడు.

ఎన్నివిధాలుగా ప్రయత్నించినా లొంగని వసంతసేనను శకారుడు అడవిలోకి తీసుకుపోయి గొంతు నులిమగా ఆమె సొమ్మసిల్లిపోతుంది. వసంతసేన చనిపోయిందని భావించి శకారుడు ఆ హత్యానేరాన్ని చారుదత్తునిపై మోపగా అతడికి ఉరిశిక్ష విధించబడుతుంది.

ఈ వార్త వసంతసేన విని తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయక దండనస్థానానికి పరిగెడుతుంది. చివరి క్షణంలో చారుదత్తుడు రక్షింపబడతాడు. ప్రజలు శకారుడిని శిక్షిస్తారు. ఉజ్జయినికి స్వాతంత్ర్యం లభిస్తుంది. కథ సుఖాంతమవుతుంది.

పాత్రలు - పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేశాడు.[2]

క్రమ సంఖ్య పాట రచయిత గాయకులు
1 ఓహో వసంత యామినీ యామినీ యామినీ నిను వర్ణింతును ఏమనీ ఏమనీ ఏమనీ సి.నారాయణరెడ్డి పి.బి.శ్రీనివాస్
2 బంగారు బండిలో వజ్రాల బొమ్మతో బలే బలే దాశరథి బి.వసంత
3 ఏమివ్వగలదానరా? నాస్వామీ? నా తనువూ, నా మనసూ మునుపే ఇచ్చితిరా దాశరథి పి.సుశీల
4 కిలకిల నగవుల నవమోహినీ ప్రియకామినీ దాశరథి ఘంటసాల
5 ఇదేవేళ నావలపు నిన్నే కోరింది అదేవేళ నా తనువు నిన్నే చేరింది శ్రీశ్రీ ఘంటసాల, ఎస్.జానకి
6 ఇద్దరికి యీడు జోడు కుదిరెను ఇక జూడు కొసరాజు మాధవపెద్ది, స్వర్ణలత
7 దిగరా దిగరా నాగన్నా ఎగిరిపడకురా నాగన్నా కొసరాజు ఎస్.జానకి, పి.లీల
8 కొండలన్నీ వెదికేను కోనలన్నీ తిరిగేను సఖియా దాశరథి ఘంటసాల, ఎస్.జానకి
9 ఎదురు ఎదురు చూచిన రేయి ఇపుడె ఇపుడె వచ్చినదోయి దాశరథి పి.సుశీల
10 వసంత సుమమే వాడిపోయెనా? విషాదమొక్కటే మిగిలిపోయెనా? శ్రీశ్రీ మాధవపెద్ది బృందం

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు, ఆంధ్రప్రభ (10 August 1967). "వసంతసేన ప్రత్యేకానుబంధ". ఆంధ్రప్రభ దినపత్రిక: 8. Retrieved 20 August 2016.[permanent dead link]
  2. స్వతంత్ర. వసంతసేన పాటలపుస్తకం. p. 8. Retrieved 18 September 2020.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు

[మార్చు]