పి. బి. శ్రీనివాస్
| పి. బి. శ్రీనివాస్ | |
|---|---|
పి. బి. శ్రీనివాస్ | |
| జననం | సెప్టెంబరు 22, 1930 గొల్లప్రోలు, కాకినాడ, మద్రాసు రాష్ట్రం |
| మరణం | ఏప్రిల్ 14, 2013 చెన్నై . తమిళనాడు |
| నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
| ఇతర పేర్లు | పి.బి.ఎస్. |
| వృత్తి | నేపథ్యగాయకుడు |
| మతం | హిందూ మతం |
| తండ్రి | ఫణీంద్రస్వామి |
| తల్లి | శేషగిరమ్మ |
పి. బి. శ్రీనివాస్ (సెప్టెంబరు 22, 1930 - ఏప్రిల్ 14, 2013) (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్)[1] చలనచిత్ర నేపథ్యగాయకుడు, స్వరకర్త, హార్మోనియం వాద్యకారుడు, గీత రచయిత, కవి.[2] ఆయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడారు.[3] ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు శ్రీనివాస్ ఎన్నో గీతాలు ఆలపించారు. శ్రీనివాస్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. శ్రీనివాస్ ఎన్నో గజళ్లు వ్రాసారు. శ్రీనివాస్ గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా జాతక ఫలం (1954) చిత్రంలో పాడారు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడారు.[4]. ఆయన సంగీతం, చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను కన్నడ రాజ్యోత్సవ అవార్డు, తమిళం కలైమామణి పురస్కారం, ఆంధ్ర శివ ప్రతిష్ఠానం వారి మాధవపెద్ది సత్యం అవార్డులను అందుకున్నారు.[5][6] ఆయన గౌరవార్థం చెన్నైలోని 'శ్రీ కళా సుధా తెలుగు సంఘం' సీనియర్ గాయకులను గౌరవించడానికి పి.బి. శ్రీనివాస్ మహాపురుష పురస్కారాన్ని నెలకొల్పింది.
జీవితం
[మార్చు]ఆయన ఆంధ్రపదేశ్ లో తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930న జన్మించాడు.[1] ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు.[7] వీరి పూర్వీకులు వాదనలో చాలా ప్రసిద్ధులు కావడంతో 'ప్రతివాది భయంకర' అనేది వీరి ఇంటిపేరుగా మారింది. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారి కాగా, తల్లి సంగీత విద్వాంసురాలు. శ్రీనివాస్ ప్రభుత్వ అధికారి కావాలని ఆయన తండ్రి కోరుకోవడంతో ఆయన బీ.కాం పట్టా పొందారు. అనంతరం దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి 'హిందీ విశారద్' పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.[8][9] ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. శాంతినివాసం (1960) చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
తండ్రి సంస్కృత పండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే అతనుకు ఆదిగురువు, తుది గురువు.
సంగీత ప్రస్థానం
[మార్చు]ఆయన చిన్నాన్న కిడాంబి కృష్ణస్వామి నాటక కళాకారుడు, గాయకుడు. శ్రీనివాస్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కృష్ణస్వామి ఒక నాటకంలో పాడే అవకాశం ఇచ్చారు. హార్మోనియం వాద్యకారుడిగా , గాయకుడిగా శిక్షణ పొందిన శ్రీనివాస్, మద్రాసులోని జెమినీ స్టూడియోస్ వెళ్లారు. అక్కడ ప్రముఖ వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి ఆయనను జెమినీ స్టూడియోస్ యజమాని ఎస్. ఎస్. వాసన్‌కు పరిచయం చేశారు. అక్కడ శ్రీనివాస్ తన అభిమాన గాయకుడు మొహమ్మద్ రఫీ పాడిన సూపర్ హిట్ పాటను పాడి వినిపించారు. నౌషాద్ స్వరపరిచిన దీదార్ (1951) చిత్రంలోని "హుయే హమ్ జిన్కే లియే బర్బాద్" పాటతో ఆయనకు ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్‌గా అవకాశం లభించింది.[10] ఆయన పాడిన మొదటి కన్నడ పాట జాతకఫల (1953) చిత్రంలోనిది.
రచయితగా
[మార్చు]పి.బి. శ్రీనివాస్ నేపథ్య గాయకుడిగానే కాకుండా దాదాపు ఎనిమిది భాషల్లో వేలాది పాటలు రాశారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై మొదటిసారి దిగినప్పుడు, పి.బి. శ్రీనివాస్ ఎస్. జానకితో కలిసి "మ్యాన్ ఆన్ మూన్" అనే ఇంగ్లీష్ గీతాన్ని రికార్డ్ చేసి పంపారు. ఆ రోజుల్లో అది గొప్ప ప్రశంసలు అందుకుంది.[11] ఆయన అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఈ పాటను విన్న ఒక విశ్వవిద్యాలయ అధినేత ఆయనను డక్టరేట్ పట్టాకు సిఫార్సు చేశారు. అలా పి.బి.ఎస్ అందుకున్న మొదటి గౌరవ డాక్టరేట్ అమెరికా విశ్వవిద్యాలయానిది. ఆయన కన్నడలో అనేక గజల్స్ రాశారు. భాగ్యజ్యోతి చిత్రంలో వాణి జయరామ్‌తో కలిసి పాడిన "దివ్యగగన వనవాసిని" అనే సంస్కృత గీతం ఆయన సొంత రచన. "నవనీత సుమసుధా" అనే రాగాన్ని ఆయన స్వయంగా సృష్టించారు. 'శ్రీనివాస గాయత్రి వ్రతం', 'గాయకుడి గేయాలు', ‘ప్రణవం’ అనే పుస్తకాలను కూడా ప్రచురించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పిబిఎస్' అంటే 'ప్లే బ్యాక్ సింగర్' మాత్రమే కాకుండా 'పెన్స్, బుక్స్ అండ్ సాంగ్స్' (Pens, Books and Songs) అని కూడా అర్థం అని చమత్కరించారు.
రాజ్‌కుమార్ కంఠస్వరం
[మార్చు]కన్నడ అగ్ర నటుడు డా. రాజ్‌కుమార్ కంఠానికి పి.బి. శ్రీనివాస్ గొంతు అద్భుతంగా సరిపోయేది.[12] రాజ్‌కుమార్ స్వయంగా పాడటం ప్రారంభించే వరకు, ఆయన చిత్రాలన్నింటికీ శ్రీనివాస్ ధ్వనిని అందించారు. రాజ్‌కుమార్ ఒకసారి మాట్లాడుతూ "పి.బి. శ్రీనివాస్ గొంతు నాకు ఆత్మ వంటిది" అని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ కోసం ఆయన దాదాపు 200 కంటే ఎక్కువ పాటలు పాడారు.[13]
కళారంగం
[మార్చు]
మాధుర్య సార్వభౌమ డా. పి. బి. శ్రీనివాస్-నాదయోగి సునద్యాన (రచన: ఆర్. శ్రీనాథ్) అనే పేరుతో వచ్చిన జీవిత చరిత్రను గాయకులు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్, కేజే ఏసుదాసు 2013 మే 7న బెంగళూరులో విడుదల చేశారు.[14] ఈ పుస్తకానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2013 సంవత్సరానికి "ఉత్తమ చలనచిత్ర సాహిత్యకృతి" అవార్డును అందించింది.
తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.[15]
శ్రీనివాస్ 1952లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్"తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించారు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ "తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందారు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర"[16]లో పాడారు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీలతో పాడారు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్కు చాలా కాలంపాటు పాటలు పాడారు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్కు అనేక పాటలు పాడారు. ఆయనపాటలలో పేరొందిన పాట "నిలవే ఎన్నిదం నెరుంగతె". ఆయన ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడారు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్ లకు పాడారు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రంలో లతా మంగేష్కర్తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.
"పావా మనిప్పు" అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన "కలగాలి ఆవల్ వసంతమ్" అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడారు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడారు. శ్రీనివాస్ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, లతా మంగేష్కర్ ల సరసన పాడారు.
ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్", "ముకుంద మాల", "శ్రీ మల్లికార్జునస్తోత్రం", పురందరదాసు సంకీర్తనలు.
చెన్నై లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో అతనును సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవారు.[17]
మరణం
[మార్చు]పి. బి. శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో తన 82వయేట చెన్నై లోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.
పురస్కారాలు
[మార్చు]- కర్ణాటక రాష్ట్ర రెండో అత్యున్నత పురస్కారం కన్నడ రాజ్యోత్సవ పురస్కారం.[18]
- తమిళనాడు ప్రభుత్వ కలైమామణి పురస్కారం.
- డా. రాజ్‌కుమార్ కుటుంబం నుండి డా. రాజ్‌కుమార్ సౌహార్ద పురస్కారం.
- హంపి కన్నడ విశ్వవిద్యాలయం నుండి గౌరవప్రదమైన నాడోజ పురస్కారం.
- తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం - కలైవనార్ అవార్డు (2002).
వివిధ చిత్రాలలో పాడిన పాటలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | భాష | పాట |
|---|---|---|---|
| 1952 | మిష్టర్ సంపత్ | హింది | Aji hum Bharat ki naari (with Geeta Dutt) |
| 1955 | హరిశ్చంద్ర | మళయాళం | |
| 1955 | రాణీ రత్నప్రభ | తెలుగు | |
| 1956 | భలే రాముడు | తెలుగు | |
| 1958 | శ్రీ రామభక్త హనుమాన్ | తెలుగు | లేవయ్యా లేవయ్యా లేరయ్య నీసాటి వీరాంజనేయా |
| 1959 | జయభేరి | తెలుగు | |
| 1960 | భక్త కనకదాస | కన్నడం | Baagilanu Theredu Eethaneega Vasudevano Badukideno Kula Kula Singara Sheela |
| 1960 | భక్త శబరి | తెలుగు | |
| 1960 | ఋణానుబంధం | తెలుగు | |
| 1960 | సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి | తెలుగు | |
| 1960 | శాంతినివాసం | తెలుగు | |
| 1961 | విజయనగరద వీరపుత్ర | కన్నడం | Apaara Keerthi |
| 1961 | ఇద్దరు మిత్రులు | తెలుగు | |
| 1961 | ఇంటికి దీపం ఇల్లాలే | తెలుగు | |
| 1961 | పాశమలర్ | తమిళం | Yaar Yaar Avar Yaaro |
| 1961 | పావ మన్నిప్పు | తమిళం | Kalangalil Aval |
| 1961 | తిరుడతే | ||
| 1961 | శ్రీ సీతారామ కల్యాణం | తెలుగు | |
| 1962 | ఆత్మ బంధువు | తమిళం | |
| 1962 | స్వర్ణ గౌరి | కన్నడం | Baara Chandrama Nudi Mana Baare Nee Cheluve Beeso Gaali |
| 1962 | భీష్మ | తెలుగు | మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా |
| 1962 | దక్ష యజ్ఞం | తెలుగు | |
| 1962 | కులగోత్రాలు | తెలుగు | Rave Rave Bala Hello My Dear Leela |
| 1962 | రక్త సంబంధం | తెలుగు | |
| 1962 | వీర తిరుమగన్ | తమిళం | Paadatha Paatellam Roja Malarae |
| 1963 | చదువుకున్న అమ్మాయిలు | తెలుగు | |
| 1963 | లవ కుశ | తలుగు | |
| 1963 | పార్ మగలె పార్ | తమిళం | Aval Paranthu Ponale Madhurai Nagaril Madura Nagaril |
| 1964 | మై భీ లడకీ హూన్ | హిందీ | Chanda Se Hoga Wo Pyaara (with Lata Mangeshkar) |
| 1964 | పతివ్రత | తెలుగు | చిన్నారి వన్నెలాడీ నీతో స్నేహం కోరి వుంటినమ్మా సా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవో |
| 1964 | బొబ్బిలి యుద్ధం | తెలుగు | |
| 1964 | డా. చక్రవర్తి | తెలుగు | |
| 1964 | సర్వర్ సుందరం | తమిళం | Poga Poga Theriyum |
| 1964 | కాదలిక్క నేరమిల్లై | తమిళం | Anubavam Puthumai Viswanathan Velai Vendum Unga Ponnana Kaigal |
| 1965 | గుడి గంటలు | తెలుగు | నీలి కన్నుల నీడల లోన |
| 1965 | ప్రేమించి చూడు | తెలుగు | Meda Meeda Meda Katti Kotlu Koodabettinatti Kamandu Mee Andala Chetulu Kandenu Papam |
| 1965 | శ్రీ సింహాచల క్షేత్ర మహిమ | తెలుగు | Jayahe Mohana Roopa Gaana Kalaapa |
| 1965 | తేనె మనసులు | తెలుగు | |
| 1966 | మంత్రాలయ మహాత్మె | కన్నడం | Indu Enage Govinda Kaliyirondu Paatavannu Tunge Theera Rasika Saalade Neenu Baralilla |
| 1966 | కప్పు బిలుపు | కన్నడం | Ide Roopa Indina Hindu Deshada |
| 1966 | ఎమ్మె తమ్మన్న | కన్నడం | Belli Hakki Aguva Kanneradu Kareyuthide Kolalanoodi Kuniva Neenaarigaadeyo Ele Maanava [19] |
| 1966 | శ్రీకృష్ణ పాండవీయం | తెలుగు | ఏమిటయా నీ లీలా కృష్ణా |
| 1966 | లేత మనసులు | తెలుగు | |
| 1967 | బంగారద హూవు | కన్నడం | Aaha Mogavu Do Do Do Basavanna Oduva Nadi |
| 1967 | లగ్న పత్రికె | కన్నడం | Bramhachaari Gandu Muthina Chandu Illi Yaaru Illa Kanneradu Nijavo Sullo |
| 1967 | బెల్లి మొద [20] | కన్నడం | Belli Modada Ideega Nee Ide Nanna Uthara Odeyithu |
| 1967 | సాక్షి | తెలుగు | |
| 1967 | ఊటీ వరై ఉరవు | తమిళం | |
| 1968 | బేడి బండవలు | కన్నడం | Neera Mele Aleya Ungura |
| 1969 | మేయర్ ముత్తన్న | కన్నడం | Ayyayyayyo Halli Mukha Haavige Halliyadarenu Shiva Onde Naadu |
| 1969 | సప్తస్వరాలు | తెలుగు | |
| 1970 | అరిశిన కుంకుమ | కన్నడం | Honnaase Ullavage Thaavare Hoo Kere Ilidu Baa Thaaye |
| 1971 | శర పంజర | కన్నడం | Kodagina Kaveri Uthara Drivadhim |
| 1971 | జై జవాన్ జై కిసాన్ | హిందీ | Nakhrewali Chaal |
| 1971 | కస్తూరి నివాస | కన్నడం | Aadisi Nodu Beelisi Nodu |
| 1971 | సీత | కన్నడం | Ee Cheluvanu Barede Neenu Ninna Hesara |
| 1971 | సంపూర్ణ రామాయణం | తెలుగు | వెడలెను కోదండపాణి |
| 1971 | పరోపకారి | కన్నడం | Hodare Hogu Guttonda Heluve Kaviya Madhura |
| 1971 | సాక్షాత్కార | కన్నడం | Janma Janmada Anubandha Olave Jeevana |
| 1971 | చెల్లెలి కాపురం | తెలుగు | |
| 1972 | సిపాయి రాము | కన్నడం | Kathe Mugiyithe Nidireyu Sadaa |
| 1972 | నాగర హావు | కన్నడం | Kannada Naadina Veera Baare Baare Sangama Sangama Kathe Heluve |
| 1972 | బంగారద మనుష్య | కన్నడం | Nagu Nagutha Aagadu Endu Aaha Mysooru Mallige Baala Bangara Hani Hani Goodidare |
| 1973 | దూరద బెత్త | కన్నడం | Preethine Aa Dyaavru Thanda Kaamanna Kathige |
| 1973 | సంగమ | కన్నడ | Sirivanthanaadaru |
| 1973 | గంధద గుడి | కన్నడం | Ellu hogalla Naavaaduva nudiye kannada |
| 1974 | భూతయ్యన మగ అయ్యు | కన్నడం | Malenaada Henna Maariya Gathiyendu |
| 1974 | భక్త కుంబర | కన్నడం | Naanu Neenu Hari Naamave Manava Lakshmi Sthothram Vitala Panduranga Kande Hariya Kande |
| 1974 | ఎరదు కనసు | కన్నడం | Baadi Hoda Endendu Ninnanu Marethu Endu Ninna Noduve |
| 1974 | జై జై రాం | హిందీ | లవ్ కుశ్ |
| 1975 | శుభ మంగళ | కన్నడం | Shubha Mangala Hema... Naakondla Naaku |
| 1975 | భక్తి మే భగవాన్ | హిందీ | Dekha Hari Dekha |
| 1976 | ప్రేమద కణికె | కన్నడం | Chinna Endu Naguthiru Putta Putta Hejje |
| 1976 | జీవనజ్యోతి | తెలుగు | |
| 1976 | సీతాకల్యాణం | తెలుగు | |
| 1977 | సొసెతండ సౌభాగ్యా | కన్నడం | Ravi Varmana Saaku Ennuvane Eke Avasaravu |
| 1977 | బభృవాహన | కన్నడం | Ninna Kanna Notadalli Yaaru Thiliyaru |
| 1977 | తబ్బలి నీనదె మగనె | కన్నడం | Dharani Mandala Madhyadolage |
| 1977 | దేవర దుడ్డు | కన్నడం | Godhuli Krishna..Gaaliya Patadanthe |
| 1978 | స్వర్ణ భూమి | కన్నడం | Kaanada Devaru Siri Kannada Naadu |
| 1978 | పద్వారల్లి పందవరు | కన్నడం | Haadomme Haadabeku Thookadisi Thookadisi Beeladiru Thamma |
| 1978 | గోరంత దీపం | తెలుగు | |
| 1979 | లక్ష్మీ పూజ | తెలుగు | |
| 2004 | 7జి రెయిన్ బౌ కాలనీ | తమిళం | Idhu Enna Maatram |
| 2010 | ఆయిరథిల్ ఒరువన్ | తమిళం |
ఇతర లింకులు
[మార్చు]- ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్- విష్ణుభొట్ల లక్ష్మన్న , ఇతరులు. ఈమాట మే 2013
- ఐ.ఎం.డి.బి. లో పి.బి.శ్రీనివాస్ పేజి
- ఆయనగూర్చి వివిధ ఇంటర్వ్యూలు[permanent dead link]
సూచికలు
[మార్చు]- ↑ 1.0 1.1 [1]
- ↑ Srinivasan, Meera (14 April 2013). "PBS leaves behind a treasure trove of melodies". The Hindu – via www.thehindu.com.
- ↑ "PBS no more". The Hindu. 14 April 2013.
- ↑ [2]
- ↑ Kolappan, B. (15 April 2013). "A singer who evoked pathos, a nonpareil". The Hindu – via www.thehindu.com.
- ↑ "Chennai: Legendary singer Dr P B Sreenivas no more".
- ↑ "Chennai: Legendary singer Dr P B Sreenivas no more".
- ↑ "The Hindu : Bit of drive-in nostalgia". Archived from the original on 8 May 2009. Retrieved 18 April 2008.
- ↑ Khajane, Muralidhara (14 April 2013). "P.B. Sreenivas was the voice of Rajkumar". The Hindu – via www.thehindu.com.
- ↑ "Archived copy". mobiletoi.timesofindia.com. Archived from the original on 14 June 2013. Retrieved 13 January 2022.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ https://www.sjanaki.net/telugu-music/with-pbs
- ↑ https://www.thehindu.com/news/national/karnataka/pb-sreenivas-was-the-voice-of-rajkumar/article4617526.ece
- ↑ https://celebrityborns.com/biography/p-b-sreenivas/931
- ↑ Kolappan, B. (15 April 2013). "A singer who evoked pathos, a nonpareil". The Hindu – via www.thehindu.com.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-04. Retrieved 2016-05-25.
- ↑ "The Hindu: Harishchandra (1955)". Archived from the original on 2011-10-08. Retrieved 2013-04-15.
- ↑ "The Hindu : Bit of drive-in nostalgia". Archived from the original on 2009-05-08. Retrieved 2013-04-15.
- ↑ "P.B. Sreenivas was the voice of Rajkumar". Retrieved 16 April 2013.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-23. Retrieved 2013-04-15.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-14. Retrieved 2013-04-15.
- CS1: unfit URL
- CS1 maint: deprecated archival service
- All articles with dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- గజల్ గాయకులు
- 1930 జననాలు
- 2013 మరణాలు
- భారతీయ పురుష గాయకులు
- తెలుగు కళాకారులు
- తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ప్రాజెక్టు
- తూర్పు గోదావరి జిల్లా గాయకులు