ఆత్మబంధువు (1962 సినిమా)
| ఆత్మబంధువు | |
|---|---|
| దర్శకత్వం | పి.ఎస్. రామకృష్ణారావు |
| రచన | జూనియర్ సముద్రాల (మాటలు) |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, యస్వీ రంగారావు |
| ఛాయాగ్రహణం | కె. ఎస్. ప్రసాద్ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | డిసెంబర్ 14, 1962 |
| భాష | తెలుగు |
ఆత్మబంధువు 1962, డిసెంబర్ 14న విడులదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు,సావిత్రి, యస్వీ రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ, పద్మనాభం, సూర్యకాంతం, హరనాధ్, రీటా తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాతృక జోగ్ బిజోగ్ అనే బహుళ ప్రజాదరణ పొందిన బెంగాలీ చిత్రం. తర్వాత తమిళంలో కూడా ఈ చిత్రాన్ని పడిక్కామెదమేదె అనే పేరుతో తీశారు. అక్కడ కూడా ఆర్థికంగా విజయం సాధించిందీ చిత్రం.[1]
కథ
[మార్చు]చంద్రశేఖరం అలియాస్ రావు బహద్దూర్ ఒక ధనిక వ్యాపారస్తుడు. ఆయన భార్య పార్వతమ్మ. వీరి కుటుంబం పెద్దది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు మంగళమ్మకు భర్త చనిపోతే ఆమె తన కొడుకుతో సహా వచ్చి తండ్రి దగ్గరనే ఉంటుంది. పెద్ద కొడుకులిద్దరికి పెళ్ళి అయి ఉంటుంది. ఆఖరి అమ్మాయికి, అబ్బాయికి ఇంకా పెళ్ళి అయి ఉండదు. వీరందరితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి రంగా. ఈ కుటుంబంతో సంబంధం లేకపోయినా పార్వతమ్మ దంపతులు అతన్ని ఎక్కడినుంచో తెచ్చుకుని పెంచి పెద్దచేస్తారు. లక్ష్మి అనే అమ్మాయినిచ్చి పెళ్ళి కూడా చేస్తారు. చంద్రశేఖరం ఆర్థిక పరిస్థితి బాగున్నంత వరకు అందరూ ఆయన్ను గౌరవిస్తూ ఉంటారు. ఆయన ఆఖరి కుమార్తెకు కూడా మరో వ్యాపారవేత్త తన కొడుక్కిచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడతాడు. కానీ ముహూర్తం ఖరారు అవగానే వ్యాపారంలో మొత్తం నష్టం వచ్చి ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. పెళ్ళి ఆగిపోతుంది. ఆస్తులన్నీ అమ్మినా అప్పు తీరదు. ఇంట్లో పొదుపుగా జీవించడం అలవాటు చేసుకోమంటాడు చంద్రశేఖరం. దాంతో స్వంత కొడుకులే ఆయనన్ను అవమానించడం మొదలుపెడతారు.
తారాగణం
[మార్చు]- చంద్రశేఖరం అలియాస్ రావు బహద్దూర్ గా ఎస్. వి. రంగారావు
- రంగా గా ఎన్. టి. రామారావు
- లక్ష్మి గా సావిత్రి
- చంద్రశేఖరం భార్య పార్వతమ్మగా కన్నాంబ
- జట్కాబండి కోటయ్యగా రేలంగి
- గీత గా గిరిజ
- రఘు గా పద్మనాభం
- జానకి గా శారద
- మంగళమ్మగా సూర్యకాంతం
- మంగళమ్మ కొడుకుగా రాజబాబు
- లలిత గా మీనా కుమారి
- మధు గా హరనాథ్
- అంజమ్మ గా సురభి బాలసరస్వతి
- ప్రసాద్ గా వల్లం నరసింహారావు
- రామకోటి
- రిటైర్డ్ ఆర్మీఆఫీసర్ దామోదరం గా డాక్టర్ శివరామ్మకృష్ణయ్య
- రాజారావు గా ఎ.వి.సుబ్బారావు
- శ్రీధర్ గా ఏడిద నాగేశ్వరరావు
- కమల గా మోహన .
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
- మాటలు:సముద్రాల రామానుజాచార్యులు
- కధ: అషాపూర్ణ దేవి
- సంగీతం: కె.వి.మహదేవన్
- గీత రచయితలు: శ్రీరంగం శ్రీనివాసరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి,సముద్రాల రాఘవాచార్య
- నేపథ్య గాయకులు: కె.జమునారాణి, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రతివాది భయంకర శ్రీనివాస్
- ఛాయా గ్రహణం: కె.ఎస్.ప్రసాద్
- ఎడిటింగ్: బి.హరినారాయణ
- నిర్మాతలు: వై రామకృష్ణ ప్రసాద్, సి.వి.ఆర్.ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శ్రీ సారథి స్టూడియోస్
- విడుదల:14:12:1962.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి కె. వి. మహదేవన్ సంగీతాన్నందించగా సి. నారాయణ రెడ్డి, సముద్రాల, కొసరాజు, శ్రీశ్రీ పాటలు రాశారు.[2][3]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు | |
|---|---|---|---|---|
| అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ఘంటసాల, పి.సుశీల | |
| ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి ననుకొలువ తపమేమి చేసానో కృష్ణయ్యా | సముద్రాల | కె.వి.మహదేవన్ | ఘంటసాల | |
| చదువురానివాడవని దిగులు చెందకు | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.సుశీల | |
| చీరగట్టి సింగారించి చింపి తలకు చిక్కు తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదానా | కొసరాజు | కె.వి.మహదేవన్ | ఘంటసాల | |
| మారదూ మారదూ మనుషులతత్వం మారదు | కొసరాజు | కె.వి.మహదేవన్ | పి.సుశీల, బృందం | |
| దక్కెనులే నాకు నీ సొగసు | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | పి.బి. శ్రీనివాస్, కె. జమునా రాణి | |
| తీయని ఊహల ఊయలలూగె ప్రాయం | సి.నారాయణరెడ్డి | కె.వి.మహదేవన్ | ||
| అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి | సి.నారాయణ రెడ్డి | కె. వి.మహదేవన్ | ఘంటసాల | |
మూలాలు
[మార్చు]- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (16 December 1962). "ఆత్మబంధువు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Archived from the original on 10 ఆగస్టు 2020. Retrieved 28 November 2017.
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ↑ సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.