పి.ఎస్. రామకృష్ణారావు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పి.యస్.రామకృష్ణారావు (అక్టోబర్ 12, 1918 - సెప్టెంబరు 7, 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.

జననం[మార్చు]

రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12కర్నూలులో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మా రాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.

హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

మరణం[మార్చు]

రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 7మద్రాసులో మరణించాడు.

చిత్ర సమాహారం[మార్చు]

దర్శకునిగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

రచయితగా[మార్చు]

బయటి లింకులు[మార్చు]