చక్రపాణి
ఆలూరు వెంకట సుబ్బారావు | |
---|---|
![]() చక్రపాణి | |
జననం | ఆలూరు వెంకట సుబ్బారావు ఆగష్టు 5, 1908 గుంటూరు జిల్లా తెనాలి |
మరణం | సెప్టెంబరు 24, 1975 |
మరణ కారణము | క్షయ |
ఇతర పేర్లు | చక్రపాణి |
ప్రసిద్ధి | బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత , దర్శకుడు |
ఆలూరు వెంకట సుబ్బారావు (ఆగష్టు 5, 1908 - సెప్టెంబరు 24, 1975 ) (కలంపేరు చక్రపాణి) బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకడు.
జీవిత విశేషాలు[మార్చు]
చక్రపాణి గుంటూరు జిల్లా తెనాలిలో 1908, ఆగష్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించాడు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించాడు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న వ్రజనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించాడు. 'చక్రపాణి' అనే కలం పేరును ఈయనకు అతనే ప్రసాదించాడు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందాడు. క్షయ వ్యాధిగ్రస్తుడై 1932 లో మదనపల్లె లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళాడు. అక్కడే కొన్ని నెలలు ఉండి, సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో బెంగాలీ భాష కూడా నేర్చుకొన్నాడు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను తెలుగు లోకి అనువదించడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా శరత్‌బాబు నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టాడు.
1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు వ్రాసాడు. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు.[1]
1949-1950 లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్‌ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించాడు.
1934-1935 లో కొడవటిగంటి కుటుంబరావుతో కలసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించాడు. 1960 లో దీనిని హైదరాబాదుకు తరలించారు.
మరణం[మార్చు]
ఈయన సెప్టెంబరు 24, 1975 సంవత్సరంలో పరమపదించాడు.
చిత్ర సమాహారం[మార్చు]
రచయితగా[మార్చు]
- స్వయంవరం (1980) (కథ)
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (రచయిత)
- జూలీ (1975) (చిత్రానువాదం)
- గుండమ్మకథ (1962) (కథ)
- మనిదన్ మారవిల్లై (1962) (చిత్రానువాదం)
- రేచుక్క పగటిచుక్క (1959) (చిత్రానువాదం)
- అప్పుచేసి పప్పు కూడు (1958) (చిత్రానువాదం)
- మాయాబజార్ (1957/II) (చిత్రానువాదం)
- మిస్సమ్మ (1955) (రచయిత)
- మిస్సియమ్మ (1955) (రచయిత)
- చంద్రహారం (1954) (రచయిత)
- పెళ్లిచేసి చూడు (1952) (రచయిత)
- షావుకారు (1950) (రచయిత)
- స్వర్గసీమ (1945) (మాటలు, కథ)
- ధర్మపత్ని (1941/I) (మాటలు)
- ధర్మపత్ని (1941/II) (మాటలు)
- చక్రదత్త (బెంగాలీ నవలకు అనువాదం)
నిర్మాతగా[మార్చు]
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) (నిర్మాత)
- జూలీ (1975) (బి.నాగిరెడ్డి-చక్రపాణిగా నిర్మాత)
- గంగ- మంగ (1973) (నిర్మాత)
- రామ్ ఔర్ శ్యామ్ (1967) (నిర్మాత)
- గుండమ్మ కథ (1962) (నిర్మాత)
- మనిదన్ మారవిల్లై (1962) (నిర్మాత)
- రేచుక్క పగటిచుక్క (1959) (నిర్మాత)
- అప్పుచేసి పప్పుకూడు (1958) (నిర్మాత)
- మాయా బజార్ (1957/I) (నిర్మాత)
- మిస్సమ్మ (1955) (నిర్మాత)
- చంద్రహారం (1954) (నిర్మాత)
- పెళ్ళి చేసి చూడు (1952) (నిర్మాత)
- పాతాళ భైరవి (1951) (నిర్మాత)
- షావుకారు (1950) (నిర్మాత)
దర్శకుడిగా[మార్చు]
- శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976)
- అరస కత్తలి (1967)
- మనిదన్ మారవిల్లై (1962)
ఇతర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు సినిమా రచయితలు
- తెలుగు సినిమా దర్శకులు
- 1908 జననాలు
- 1975 మరణాలు
- సంపాదకులు
- గుంటూరు జిల్లా సినిమా దర్శకులు
- గుంటూరు జిల్లా సినిమా నిర్మాతలు
- గుంటూరు జిల్లా సినిమా రచయితలు
- గుంటూరు జిల్లా పాత్రికేయులు
- కలం పేరుతో ప్రసిద్ధులైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు