సి.ఐ.డి. (1965 సినిమా)
స్వరూపం
| సి.ఐ.డి (1965 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | తాపీ చాణక్య |
|---|---|
| నిర్మాణం | బి.నాగిరెడ్డి, చక్రపాణి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని, పండరీబాయి, రాజనాల |
| సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | డి.వి.నరసరాజు |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
సి. ఐ. డి తాపీ చాణక్య దర్శకత్వంలో 1965లో విడుదలైన సినిమా. రామారావు, జమున ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు అందించారు .
నటీనటులు
[మార్చు]- నందమూరి తారక రామారావు - సి.ఐ.డి. రవి
- జమున - వసంత
- గుమ్మడి వెంకటేశ్వరరావు - చలపతి/బాబా
- మిక్కిలినేని - రామదాసు
- పండరీబాయి - పార్వతి, గుమ్మడి భార్య
- రాజనాల - ఉద్దండం
- రమణారెడ్డి - వ్యాఘ్రేసర భాగవతార్
- పి.హేమలత - అవ్వ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాపీ చాణక్య
- కధ: కె.బాలచందర్
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు , టి.చలపతిరావు
- మాటలు: డి.వి.నరసరాజు
- పాటలు: పింగళి నాగేంద్రరావు, సింగిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల
- ఛాయా గ్రహణం: మాధవ్ బుల్ బులే
- ఎడిటింగ్: జి.కల్యాణ సుందర్, డి.జి.జయరాం
- నిర్మాతలు: బి.నాగిరెడ్డి, చక్రపాణి
- నిర్మాణ సంస్థ: విజయా ప్రొడక్షన్స్
- విడుదల:23:09:1965.
పాటలు
[మార్చు]| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఎందుకనో నిను చూడగానే కవ్వించాలని ఉంటుంది | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| ఎందుకయ్యా వుంచినావు బందిఖానలో | పింగళి నాగేంద్రరావు | ఘంటసాల | ఘంటసాల |
| నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే | పింగళి నాగేంద్రరావు | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
| జగము చీకటాయెనే బ్రతుకు భారమాయెనే కనులనీరు నిండెనే | పింగళి నాగేంద్రరావు | టి.చలపతిరావు | పి.సుశీల |
| నా మనసు నీ మనసు ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో | పింగళి నాగేంద్రరావు | టి.చలపతిరావు | ఘంటసాల, పి.సుశీల |
| నిను కలసిన నిముషమున నిను తెలిసిన క్షణమున కనుల | సినారె | టి.చలపతిరావు | పి.సుశీల |
| యువతులు చూసి చూడకముందే ఐసౌవుతావా అబ్బాయి | సినారె | టి.చలపతిరావు | పి.సుశీల |
| సుదతి నీకు తగిన చిన్నదిరా (ధిల్లాన) | పట్నం సుబ్రమణ్య అయ్యర్ | టి.చలపతిరావు | ఘంటసాల |
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.