తాతినేని చలపతిరావు
| తాతినేని చలపతిరావు | |
|---|---|
తాతినేని చలపతిరావు | |
| జననం | తాతినేని చలపతిరావు 22డిసెంబర్1920 కృష్ణాజిల్లా,ఉంగుటూరు మండలం నందమూరు |
| ప్రసిద్ధి | సంగీత దర్శకులు |
| మతం | హిందూ మతము |
| తండ్రి | రత్తయ్య |
| తల్లి | ద్రోణవల్లి మాణిక్యమ్మ |
తాతినేని చలపతిరావు (1920 డిసెంబర్ 22 - 1994 ఫిబ్రవరి 22) తెలుగు సినిమాలో పనిచేసిన ఒక భారతీయ సంగీత స్వరకర్త, హార్మోనియం వాద్యకారుడు. ఆయన కెరీర్ 1950ల ప్రారంభం నుండి 1980ల వరకు మూడు దశాబ్దాలకు పైగా విస్తరించింది. ఆయన టి. ప్రకాష్ రావు బంధువు.
బాల్యం నించి సంగీతం ఆయన నరనరాల్లోనూ ప్రవహించేది. సంగీతాన్ని ఆయన ప్రేమిస్తారు; పూజిస్తారు. అందుకే తను భాగస్వామిగా నిర్మిస్తున్న ఛాయా చిత్ర వారి తొలి చిత్రానికి తాను మాత్రమే సంగీత దర్శకత్వ బాధ్యత వహించకుండా, తాను సినిమారంగంలో ప్రవేశింఛిన తొలిరోజుల్లో శిష్యరికం చేసిన ఎస్.రాజేశ్వరరావు గారిని కూడా కొన్ని పాటలకు సంగీత దర్శకత్వం వహించమని కోరారు. ఇంతటి నిస్వార్ధ జీవులు ఈ సినిమారంగంలో అరుదేమో అని చెప్పడంలో పొరబాటు ఏమీ లేదు
ప్రారంభ జీవితం
[మార్చు]1920 డిసెంబర్ 22న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు గ్రామంలో ద్రోణవిల్లి మాణిక్యమ్మ, రత్తయ్య దంపతులకు జన్మించాడు, కానీ అతనిని తాతినేని కోటేశ్వరరావు, కోటమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. అతనికి నలుగురు అక్క చెల్లెళ్లు. అతను బి.ఇ. (ఎలక్ట్రికల్) చేసాడు. అతనికి ఇద్దరు భార్యలు అన్నపూర్ణమ్మ (గృహిణి),జమునా కుమారి (డాక్టర్). అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సతీష్ సన్ టీవీ లో ఎడిటర్ గానూ, రెండవ కుమారుడు ప్రశాంత్ దుబాయ్‌లో నెట్‌వర్కింగ్ ఇంజినీర్ గాను పనిచేస్తున్నారు. అతని కూమర్తె కవిత వర్జీనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది.
అతను ఫిబ్రవరి 22 , 1994 న మరణించాడు.
అతనికి బాల్యం నుండి సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. ఊళ్లో ఎక్కడైనా నాటక సమాజాలలో రిహార్సల్సు జరుగుతుంటే అతను వాళ్ళు పాడే పద్యాలన్నీ శ్రద్ధగా వింటూ చాటుగా ప్రాక్టిసు చేసేవాడు. ఒక రోజు ఒక సమాజం వారికి హార్మోనిస్టు దొరకక యిబ్బంది పడుతున్నప్పుడు అతను హార్మోనిస్టుగా చేస్తానని వారికి చెప్పాడు. ఆ సమాజంలో హార్మోనియం వాదనను సమర్థనీయంగానే నిర్వహించగలిగాడు.
అప్పట్నించి సశాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాలనే వాంఛ ఆయనలో మొలకెత్తింది. కాని, అది కేవలం ఒక ఆశయంగా కాక ఊసుపోని హాబీగా మాత్రమే అప్పటికి తీసుకున్నారు. ఒక నాలుగు నెలల్లో తన చెల్లెలి గురువుగారి దగ్గరే అరవై కృతుల వరకు నేర్చుకున్నారు. ఆ తర్వాత తాడంకి హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనూ తరచు సంగీత సాధన చేయసాగారు.
ఆ ప్రాంతాలలో కార్తీక మాసాలలో ప్రజలు కాస్త తీరుబడిగా ఉండేవారు. అప్పుడు హరికథా కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి. బందరు బెజవాడ రోడ్డుకు ఒక వైపున తాడంకి, రెండవ వైపున మంటాడ అనే రెండు గ్రామాలు ఉన్నాయి. రెండు ఊళ్ళలోనూ పోటాపోటీగా హరికథా కాలక్షేపాలు ఏర్పాటు చేసేవారు. ఒక సందర్భంలో ఒక పందిట్లో మ్యూజిక్ డైరెక్టర్ వేణు, మరొక పందిట్లో చలపతిరావు హార్మోనియమ్ లు వాయించారు.
తాడంకిలో హైస్కూలు విద్యాభ్యాసం పూర్తి చేశాక రావుగారు కాలేజీ చదువుకు బందరు వెళ్ళారు. అక్కడ కస్తూరి నరసింహారావుగారనే ప్రముఖ తబలా విధ్వాంసునితో పరిచయమేర్పడింది. గవాయి సత్యం అనే మరో మిత్రుడు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని చక్కగా గానం చేసేవారు. వీళ్ళంతా కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని ప్రతి దినం సాయంత్రం హిందూస్థానీ సంగీత సాధన చేయసాగారు. ఇప్పుడు మద్రాసు ఆలిండియా రేడియో నిలయ విద్వాంసుడైన మల్లిక్ కూడా వారితో పాటు శృతి కలిపి సాధన చేసేవారు.
స్వర్గీయ గూడవల్లి రామబ్రహ్మం గారు చలపతిరావు గారికి వేలు విడిచిన మేనమామ గారవుతారు. ఆయన 'రైతుబిడ్డ' చిత్రం తీస్తున్నప్పుడు చలపతిరావు బందరులో హిందూస్థాన్ మ్యూచువల్ ఇన్ ష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూండేవారు. 'రైతుబిడ్డ' విడుదలయింది. ఆ చిత్రం విజయవిహారం చేస్తూన్న సందర్భంలో రామబ్రహ్మంగారు ఒక సారి బందరు వచ్చినప్పుడు చలపతిరావుగారికి సంగీతంలో ప్రవేశముందని తెలుసుకొని, మద్రాసుకు రమ్మని ఆహ్వానించారు. ఆ నాటికి కొందరు తెలియని వారు అనుకొంటున్నట్లుగా అప్పటికి చలపతిరావుకు కూడా సినిమా సంగీతం పట్ల అంతగా సదభిప్రాయం లేకపోవడం వల్ల, ప్రస్తుతం తన ఉద్యోగం తనకు చాలని రామబ్రహ్మం గారితో చెప్పి, అప్పటి మద్రాసు ప్రయాణాన్ని తప్పించుకున్నారట.
చలపతిరావు జనక తండ్రిగారూ చక్కగా పాడేవారు. పెద్దన్న ద్రోణపల్లి సూర్యనారాయణ గారు డ్రామాలు వెసేవారు. మరో అన్న వీరరాఘవయ్య గొప్ప మార్దంగికులూ, తబలిష్టూ కూడా, తమ్ముడు నాగభూషణం మంచి హార్మోనిస్టు, ఫ్రూటిస్టూ, తబ్లిస్తూ, వోకలిస్టూ.
విజయవాడలో పీపుల్స్ థియేటర్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించే సందర్భంలో కొత్తగూడెం కాలనీ బొగ్గు గనులలో మందుగుండు సామాను సరఫరా అధికారి ఉద్యోగానికి తిలోదకాలిచ్చి, చలపతిరావు విజయవాడ చేరుకున్నాడు. ఈ సమితిలో నేటి సుప్రసిద్ధ సంగీత దర్శకులైన హేమంత్ కుమార్, సలీల్ చౌదరి, పంకజ్ ముల్లిక్, శంకర్ లు సభ్యులుగా ఉండేవారు. సరోజినీ నాయుడు ఈ అఖిల భారత సమితికి అధ్యక్షురాలు. వీరంతా నాలుగైదు అభ్యుదయకర, విప్లవకరమైన నాటకాలు వేసేవారు. వాటిలో మూడింటిని ప్రభుత్వం నిషేధించింది. 1948 జనవరి31 నుంచి చలపతి రావుగారు 1950 నవంబర్ 7 న సోవియట్ విప్లవాత్మక దినం వరకు రాజకీయ ఖైదీగా కారాగార శిక్షననుభవించారు. ఇక ఆ ప్రాంతాల ఉంటే తన ఆశయాలకు, అభ్యుదయానికి అవరోధాలేర్పడుతాయని ఒక శుభరినానా బెజవాడనించి తిన్నగా మద్రాసు బండెక్కారు.
ఈయన పని చేసిన మొదటి చిత్రం స్వర్గీయ డాక్టర్ రాజారావుగారి పుట్టిల్లు ఐతే, జోయా ఫిలిమ్స్ వారి "వయ్యారి భామ" చిత్రానికి రాజేశ్వరరావు గారికి సహాయ దర్శకులుగా పని చేశారు. పుట్టిల్లు, పరివర్తన చిత్రాలకు మోహన్ దాసు గారితో కలిసి జంటగా సంగీతం ఇచ్చారు. ఈయన స్వయంగా సంగీత దర్శకత్వం భారం వహించినది వీనస్ వారి తమిళ చిత్రం "అమర దీపం" అందులో శ్రీమతి జిక్కి పాడిన "జాతిలో జంభానా" అనే పాట పెద్ద హిట్ అయింది. ఆ హిందీ చిత్రం లోనూ అదే మెట్టు ఉపయోగించబడింది.
వృత్తి జీవితం
[మార్చు]సంగీత దర్శకుడిగా అతని మొదటి చిత్రం 1953లో మరో సంగీత దర్శకుడు మోహన్ దాస్‌తో కలిసి తెలుగు సినిమా పుట్టిల్లు. అతని మొదటి స్వతంత్రంగా పనిచేసిన తమిళ చిత్రం అమర దీపం (1956). ఆ తర్వాత 1984 వరకు అతను దాదాపు 125 చిత్రాలకు తెలుగులో, కొన్ని తమిళంలో సంగీతాన్ని అందించాడు.
అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాలకు ఆయన అనేక ప్రసిద్ధ పాటలను రూపొందించారు. 1950, 1960, 1970లలో చలపతిరావు, నాగేశ్వరరావుకు లెక్కలేనన్ని హిట్‌లు అందించారు. వాటిలో ముఖ్యమైనవి ఇల్లరికం (1959), పునర్జన్మ (1963), మనుషులు మమతలు (1965), నవరాత్రి (1966), ధర్మ దాత (1970) మరియు శ్రీమంతుడు (1971); 1972లో దత్త పుత్రుడు, మంచి రోజులు వచ్చాయ్ మరియు రైతు కుటుంబం వంటి కొన్ని నిజమైన చార్ట్‌బస్టర్‌లతో కలిసి. చివరి వరకు ఈ జంట కన్న కొడుకు (1973), పల్లెటూరి బావ (1973), ఆలు మగలు (1977) మరియు శ్రీరామ రక్ష (1978) వంటి చిత్రాలకు సంగీతాన్ని సృష్టించడం కొనసాగించారు.
కృష్ణం రాజుతో మంచి రోజులు వచ్చాయ్, అమ్మా నాన్న, మంచి మనసు మరియు కమలమ్మ కమతంతో సహా ఇతర తెలుగు హీరోలతో చలపతిరావు హిట్ స్కోర్లు అందించాడు.
1984లో వచ్చిన జనం మనం చిత్రానికి ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం.
సంగీతం సమకూర్చిన చిత్రాలు
[మార్చు]- పుట్టిల్లు (1953)
- పరివర్తన (1954)
- వీరప్రతాప్ (1958) - జి.రామనాథన్‌తో కలిసి
- ఇల్లరికం (1959)
- మా బాబు (1960)
- శ్రీ వళ్లీ కళ్యాణం (1962)
- పునర్జన్మ (1963)
- లక్షాధికారి (1963)
- మంచి మనిషి (1964)
- మనుషులు మమతలు (1965)
- నవరాత్రి (1966)
- ఆడపడుచు (1967)
- గూఢచారి 116 (1967)
- మరపురాని కథ (1967)
- నడమంత్రపు సిరి (1968)
- ప్రేమకథ (1968)
- బంగారు గాజులు (1968)
- శ్రీమంతులు (1968)
- ప్రేమకానుక (1969)
- మద్రాస్ టు హైదరాబాద్ (1969)
- ధర్మదాత (1970)
- మాయని మమత (1970)
- అదృష్ట జాతకుడు (1971)
- దత్తపుత్రుడు(1971)
- శ్రీమంతుడు (1971)
- కిలాడి బుల్లోడు(1972)
- ఎర్రకోట వీరుడు(1973)
- డాక్టర్ బాబు (1973)
- పల్లెటూరి బావ (1973)
- మైనరు బాబు (1973)
- ఆడపిల్లల తండ్రి (1974)
- గాలిపటాలు (1974)
- వాణి దొంగలరాణి (1974)
- దేవుడు చేసిన పెళ్ళి (1974)
- చిన్ననాటి కలలు (1975)
- జమీందారుగారి అమ్మాయి (1975)
- వయసొచ్చిన పిల్ల (1975)
- సంసారం (1975)
- అమ్మానాన్న (1976)
- అల్లుడొచ్చాడు (1976)
- వనజ గిరిజ (1976)
- అత్తవారిల్లు (1977)
- అర్ధాంగి (1977)
- మంచి మనసు (1978)
- శ్రీరామరక్ష (1975)
- కమలమ్మ కమతం (1979)
- లవ్ మ్యారేజ్ (1979)
- నాయకుడు – వినాయకుడు (1980)
- యువతరం కదిలింది (1980)
- కీర్తి కాంత కనకం (1983)
- జనం మనం (1984)
నటించిన సినిమా
[మార్చు]- గూఢచారి 116 (1967) ....'యెర్ర బుగ్గల మీద మనసైతే' పాటలో అతిధిపాత్ర
నిర్మించిన సినిమా
[మార్చు]- మంచిమనిషి (1964) (నిర్మాత)