వాణి దొంగలరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాణి దొంగలరాణి
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
నిర్మాణం పి.వి.సుబ్బారావు,
జె.కృష్ణస్వామి
తారాగణం జయంతి,
సంగీతం టి.చలపతిరావు
సంభాషణలు అనిసెట్టి
ఛాయాగ్రహణం ప్రకాష్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వాణి దొంగలరాణి 1974, అక్టోబర్ 4వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనిలో జయంతి ద్విపాత్రాభినయం చేసింది. కన్నడ సినిమా జయ విజయ దీనికి మూలం.

నటీనటులు[మార్చు]

  • జయంతి
  • గంగాధర్
  • బాలకృష్ణ (నూతననటుడు)
  • జయకుమారి
  • హలం
  • దినేశ్
  • తూగుదీప శ్రీనివాస్

సాంకేతికబృందం[మార్చు]

  • దర్శకుడు: ఆమంచర్ల శేషగిరిరావు
  • నిర్మాతలు:పి.వి.సుబ్బారావు, జె.కృష్ణస్వామి
  • మాటలు: అనిసెట్టి
  • సంగీతం:టి.చలపతిరావు
  • ఛాయాగ్రహణం: ప్రకాష్

సంక్షిప్తకథ[మార్చు]

ఒకే పోలికగల ఇద్దరు అమ్మాయిలు, వాణి రాణి. వాణి దొంగలముఠా నాయకురాలు. రాణి శ్రీమంతులబిడ్డ. అయితే ఆమె సంపదను అపహరించడానికి ఆమె బాబాయే ఆమెను సంహరించాలని కుట్రపన్నాడు. ఒక సారి రాణిని ఆపద నుండి తప్పించింది వాణి. వేషాలు మార్చుకుని ఒకరి స్థానంలో మరొకరు వచ్చారు. తుదకు దుర్మార్గుల కుట్రలను వాణి ఎలా భగ్నం చెసిందనేది పతాక సన్నివేశంలో చూపించారు[1].

మూలాలు[మార్చు]

  1. రెంటాల (13 October 1974). "చిత్ర సమీక్ష - వాణి దొంగలరాణి". ఆంధ్రప్రభ దినపత్రిక. Retrieved 28 February 2020.[permanent dead link]