Jump to content

ధర్మదాత

వికీపీడియా నుండి

ధర్మాదాత , 1970 లో విడుదలైన తెలుగు డ్రామా చిత్రం . ఎ.సంజీవి దర్శకత్వంలో , రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈచిత్రంలో, అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేయగా , కాంచన, పద్మనాభం, గీతాంజలి, నాగభూషణం మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి, సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు . తమిళంలో 1968 లో వచ్చిన" ఎంగ ఊర్ రాజా" ఈ చిత్రానికి మూలం. బాక్స్ఆఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా పేరు గాంచింది.

ధర్మదాత
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.సంజీవి
కథ బాలమురుగన్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కాంచన,
నాగభూషణం
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు_రాజా రఘుపతి రావు/ శేఖర్ (ద్వి పాత్రాభినయం)
  • కాంచన_పద్మ
  • నాగభూషణం _జమిందార్ భుజంగరావు
  • గీతాంజలి _విజయపూర్ యువరాణి
  • పద్మనాభం_చక్రవర్తి
  • అల్లు రామలింగయ్య_ఏడుకొండలు
  • రేలంగి వెంకట్రామయ్య_ భూషణం
  • అనిత_జయ
  • సాక్షి రంగారావు_ భజ గోవిందం
  • వల్లం నరసింహారావు_ సత్యం
  • వెంకటేశ్వరరావు_సేతు దయారామ్
  • ఈశ్వరరావు_ప్రసాద్
  • షావుకారు జానకి_సుశీల
  • సూర్యకాంతం_విజయపూర్ రాణి
  • ఝాన్సీ: లక్ష్మి
  • మాస్టర్ ఆదినారాయణరావు_ మిస్టర్ శేఖర్
  • మాస్టర్ విశ్వేశ్వరరావు_ మిస్టర్ చక్రవర్తి .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: అక్కినేని సంజీవి
  • కధ: బాల మురుగన్
  • సంగీతం: తాతినేని చలపతిరావు
  • మాటలు: పినిశెట్టి శ్రీరామమూర్తి
  • పాటలు: కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, టి.ఆర్.జయదేవ్
  • ఛాయ గ్రహణం: ఎస్.వెంకటరత్నం
  • ఎడిటింగ్: బాలు
  • నిర్మాత: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
  • నిర్మాణ సంస్థ: రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:07:05:1970.

పాటలు

[మార్చు]
క్ర.సం. పాట గాయినీగాయకులు గీత రచన
1 ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం ఘంటసాల కొసరాజు
2 ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే కల్పతరువువో టి.ఆర్.జయదేవ్, పి.సుశీల కొసరాజు
3 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (శ్లోకం) ఘంటసాల వేదవ్యాసుడు
4 ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా ఘంటసాల, పి.సుశీల, టి.ఆర్.జయదేవ్ సినారె
5 జో లాలీ జో లాలి .. లాలీ నా చిట్టి తల్లి లాలి ననుగన్న తల్లి లాలి ఘంటసాల సినారె
6 చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట స్నానాలు ఘంటసాల సినారె
7 హల్లో ఇంజినియర్ హల్లో కం హియర్ ఓ ఓ ఓ మై డియర్ పి.సుశీల బృందం సినారె
8 ఓం పరమేశ్వరి.. జగదీశ్వరి.. రాజేశ్వరి.. కాళేశ్వరి ఘంటసాల, పి.సుశీల సినారె
9 ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు అడిగిన వారికి ఘంటసాల సినారె

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=ధర్మదాత&oldid=4685120" నుండి వెలికితీశారు