ఉంగుటూరు, కృష్ణా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉంగుటూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఉంగుటూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,333
 - పురుషుల సంఖ్య 1,130
 - స్త్రీల సంఖ్య 1,124
 - గృహాల సంఖ్య 618
పిన్ కోడ్ 521312
ఎస్.టి.డి కోడ్ 08674


ఉంగుటూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో ఉంగుటూరు మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో ఉంగుటూరు మండలం స్థానం
ఉంగుటూరు is located in Andhra Pradesh
ఉంగుటూరు
ఉంగుటూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఉంగుటూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°30′18″N 80°52′54″E / 16.504895°N 80.881634°E / 16.504895; 80.881634
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం ఉంగుటూరు, కృష్ణా
గ్రామాలు 30
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 54,347
 - పురుషులు 26,946
 - స్త్రీలు 27,401
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.22%
 - పురుషులు 71.94%
 - స్త్రీలు 60.63%
పిన్‌కోడ్ 521312

ఉంగుటూరు కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన గుడివాడ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 670 ఇళ్లతో, 2333 జనాభాతో 374 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1233, ఆడవారి సంఖ్య 1100. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 664 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 62. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589260[1].పిన్ కోడ్: 521312, ఎస్.టి.డి.కోడ్ నం. 08676.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 25 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)[2]

సమీప గ్రామాలు[మార్చు]

ఆముదాలపల్లి 1 కి.మీ, వింజరంపాడు 5 కి.మీ, చేదుర్తిపాడు 5 కి.మీ, ఇందుపల్లి 5 కి.మీ, వేంపాడు 5 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

గన్నవరం, నందివాడ, పెదపారుపూడి, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కలవపాముల, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 32 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గన్నవరంలోను, ఇంజనీరింగ్ కళాశాల విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ గుడివాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల తేలప్రోలులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ గ్రామానికి చెందిన శ్రీ బొబ్బా వెంకటాద్రి దంపతులు అమెరికాలో స్థిరపడినారు. వీరు ఈ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్ధం, నాలుగు లక్షల రూపాయల వ్యయంతో, డిజిటల్ క్లాస్ రూం ఏర్పాటుచేసారు. [5]
 2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
 3. జయరామ ఎడ్యుకేషనల్ సొసైటీ:- ఈ సొసైటీ కార్యదర్శి శ్రీ జాలాది సత్యరాజేంద్రప్రసాద్, ఇటీవల ఢిల్లీలో, జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన జ్యువెల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ గోల్డ్ మెడల్ అవార్డులు పొందినారు. [7]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఉంగుటూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

స్త్రీ శక్తి భవనం, అంగనవాడీ కేంద్రం స్థానిక బి.సి.కాలనీలో ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ గుండే రవిబాబు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ ప్రసాదు ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామాలయం[మార్చు]

 1. స్థానిక బి.సి.కాలనీలోని వెలమపేటలో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్, తన స్వంత నిధులనుండి ఒక లక్ష రూపాయలను విరాళంగా అందజేసినారు. [2]
 2. రు. 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేసిన ఈ ఆలయ పునఃప్రతిష్ఠతోపాటు,శ్రీ సీతా, రామ, లక్ష్మణుల నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-12వ తేదీ గురువారం నుండి 14వ తేదీ శనివారం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 12వ తేదీ గురువారం నాడు, పలువురు పుణ్యదంపతులు, వేదపండితుల ఆధ్వర్యంలో విగ్రహాలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 13వ తేదీ శుక్రవారం నాడు, గవ్యాంతము, వాస్తుపూజ, వాస్తుహోమం, పరాగ్నీకరణం, వాస్తుబలి, క్షీరాభిషేకం, ధాన్యాధివాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు యంత్రస్థాపన, కళాన్యాసములు, మహాపూర్ణాహుతి, గోదృష్టి, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [3]
 3. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2016,ఏప్రిల్-1వ తేదీ శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం మూడువేలమందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం నుండి స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. [9]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామస్థులు, దాతల ఆర్థిక సకారంతో చేపట్టుచున్న ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి, 2016,ఫిబ్రవరి-17న భూమిపూజ నిర్వహించారు. [8]

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

 1. దాతలు, గ్రామస్థుల విరాళాలు, ఐదు లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, అమ్మవారి విగ్రహ ప్రఠిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,మే-30వ తేదీ శనివారంనాడు, అమ్మవారి విగ్రహాన్ని, గ్రామ వీధులలో డప్పు వాయిద్యాలతో ఊరేగించి శాంతి జరిపించారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 8-30 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. [4]
 2. 2015,ఆగష్టు-23వ తెదీ ఆదివారంనాడు, అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు, భక్తులు అమ్మవారికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించారు. సాయంత్రం గ్రామస్తులంతా డప్పువాయిద్యాలతో ఆలయానికి చేరుకొని, అమ్మవారికి పూజలు నిర్వహించారు. [6]

గ్రామ ప్రముఖులు[మార్చు]

శాసనసభ్యులు శ్రీ వల్లభనేని వంశీమోహన్, ఈ గ్రామములోనే పుట్టి పెరిగినారు. [4]

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆముదాలపల్లి 207 857 434 423
2. అత్కూరు 1,345 5,326 2,626 2,700
3. బొకినాల 143 556 275 281
4. చాగంటిపాడు 230 970 483 487
5. చికినాల 91 334 162 172
6. ఎలుకపాడు 144 538 266 272
7. గారపాడు 270 967 459 508
8. ఇందుపల్లి 903 3,264 1,639 1,625
9. కొయ్యగురపాడు 313 1,211 598 613
10. లంకపల్లె అగ్రహారం 199 742 376 366
11. మధిరపాడు 126 453 242 211
12. మానికొండ 1,587 6,260 3,123 3,137
13. ముక్కపాడు 195 814 408 406
14. నాగవరప్పాడు 250 987 508 479
15. నందమూరు 393 1,434 711 723
16. ఒంద్రంపాడు 73 223 114 109
17. పెదఅవుటపల్లి 1,764 7,123 3,444 3,679
18. పొనుకుమాడు 242 868 438 430
19. పొట్టిపాడు 730 2,775 1,368 1,407
20. తరిగొప్పుల 606 2,449 1,234 1,215
21. తేలప్రోలు 2,455 8,896 4,377 4,519
22. తుట్టగుంట 89 330 171 159
23. ఉంగుటూరు 618 2,254 1,130 1,124
24. వెలదిపాడు 391 1,376 687 689
25. వెన్నూతల 136 528 251 277
26. వేమండ 397 1,407 713 694
27. వెంపాడు 356 1,405 709 696

భూమి వినియోగం[మార్చు]

ఉంగుటూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 36 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 17 హెక్టార్లు
 • బంజరు భూమి: 10 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 310 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 10 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 310 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఉంగుటూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 310 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఉంగుటూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

వనరులు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011". Cite web requires |website= (help)
 2. "ఉంగుటూరు, కృష్ణా". Retrieved 22 June 2016. Cite web requires |website= (help)
 3. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు విజయవాడ; 2014,ఆగష్టు-20; 4వపేజీ. [2] ఈనాడు విజయవాడ; 2014,నవంబరు-29; 5వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2015,మార్చి-13; 14&15పేజీలు. [4] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి, 2015,జులై-14; 4వపేజీ. [6] ఈనాడు అమరావతి, 2015,ఆగష్టు-24; 4వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-25; 4వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-18; 4వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-2; 4వపేజీ.